- Home
- Entertainment
- వేదికపై పూర్ణతో ఇమ్మానియేల్ అసభ్య ప్రవర్తన... స్పృహ కోల్పోయిన రష్మీ... అసలేం జరిగింది!
వేదికపై పూర్ణతో ఇమ్మానియేల్ అసభ్య ప్రవర్తన... స్పృహ కోల్పోయిన రష్మీ... అసలేం జరిగింది!
ఎంటర్టైనింగ్ సాగుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీలో పెద్ద వివాదం చోటు చేసుకుంది. ఇమ్మానియేల్ అసభ్యంగా తాకాడు అంటూ హీరోయిన్ పూర్ణ సీరియస్ కాగా... ఈ గొడవ మధ్యలో యాంకర్ రష్మీ గౌతమ్ సొమ్మసిల్లి పడిపోయారు.

Sridevi Drama company
లేటెస్ట్ ఎపిసోడ్ లో శ్రీదేవి డ్రామా కంపెనీ(Sridevi Drama Company) యాంకర్ సుడిగాలి సుధీర్ కనిపించలేదు. అయితే కొన్ని కొత్త అందాలు జాయిన్ అయ్యాయి. వారిలో పూర్ణ ఒకరు. మొదటిసారి పూర్ణ శ్రీదేవి డ్రామా కంపెనీలో మెరిశారు. వస్తూ వస్తూనే తనదైన పంచ్ లు విసిరారు. హైపర్ ఆది హగ్గు అడుగగా.. ఆ హగ్గులు ఇవ్వలేక ఢీ మానేశాను, మళ్ళీ ఇక్కడ కూడానా అంటూ సెటైర్ వేశారు.
Sridevi Drama company
ఇక రష్మీ (Rashmi Gautam)డాన్స్ షోకి హైలెట్ గా నిలిచింది. ఆమె తెలుగును ఉద్దేశిస్తూ హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్ జోకులు వేశారు. శ్రీదేవి డ్రామా కంపెనీ యాంకర్ గా ఆమె చేస్తున్న ప్రమాణస్వీకారంలో తెలుగు తప్పులు, పలకలేక తిప్పలు నవ్వు తెప్పించాయి.
Sridevi Drama company
లేటెస్ట్ ఎపిసోడ్ కోసం జబర్దస్త్ లో లేడీ గెటప్స్ వేసిన మగాళ్లను ప్రత్యేకంగా పిలిచారు. లేడీ గెటప్స్ అవకాశాలు ఈ మధ్య రావడం లేదని, బుల్లితెరపై కనిపించకపోవడంతో బయట ఈవెంట్స్ కి ఎవరూ పిలవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే లేడీ గెటప్స్ వేసేవాళ్లను సమాజంలో చులకనగా చూస్తున్నారంటూ బాధపడ్డారు.
Sridevi Drama company
ఇదిలా ఉండగా షో చివర్లో ఓ సీరియస్ పరిణామం చోటు చేసుకుంది. పూర్ణ (Purna) వేదికపై మాట్లాడుతుండగా పక్కనే ఉన్న ఇమ్మానియేల్ ఆమెను తాకాడు. దీంతో పూర్ణ ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. నన్ను అలా తాకడానికి నువ్వు ఎవరు? నీకెంత ధైర్యం అంటూ మండిపడ్డారు.
Sridevi Drama company
పూర్ణ అలా రియాక్ట్ కావడంతో అందరూ షాక్ అయ్యారు. గతంలో అనేక ఈవెంట్స్ లో పూర్ణ ఇలాంటి విషయాలను చాలా జోక్ గా తీసుకున్నారు. ఓ హీరోయిన్ హోదాలో ఉండి కూడా హగ్గులు, ముద్దులు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇమ్మానియేల్ విషయంలో మాత్రం పూర్ణ చాలా సీరియస్ అయ్యారు. అతడిని తిట్టి వేదికపై నుండి వెళ్లిపోయారు.
Sridevi Drama company
ఈ గొడవ జరుగుతున్నప్పుడు వేదిక మీదే ఉన్న రష్మీ ఒక్కసారిగా కూలిపోయారు. పక్కనే ఉన్న రామ్ ప్రసాద ఆమెను క్రింద పడిపోకుండా పట్టుకున్నాడు. రష్మీ సొమ్మసిల్లి పడిపోవడానికి కారణం ఏమిటో అర్థం కాలేదు. పూర్ణ-ఇమ్మానియేల్ గొడవ కారణంగా ఆమె అప్సెట్ అయ్యారా? అనే అనుమానం కలుగుతుంది.
Sridevi Drama company
లేటెస్ట్ శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమోలో ఈ ఆసక్తికర విషయాలు చోటు చేసుకున్నాయి. ఇవి ఎప్పటిలాగే హైప్ కోసం సృష్టించిన సంఘటనలా లేక నిజంగానే జరిగాయా అనేది వచ్చే వారం ఎపిసోడ్ చూస్తే కానీ తెలియదు. కొత్తగా పూర్ణ, రష్మీ ఈ షోకి విచేసినట్లు తెలుస్తుంది.