- Home
- Entertainment
- స్టార్ హీరో కొడుకుతో శ్రీలీల రొమాన్స్.. బాలీవుడ్ ఎంట్రీకి లైన్ క్లీయర్..? అక్కడా ఊపేస్తుందా?
స్టార్ హీరో కొడుకుతో శ్రీలీల రొమాన్స్.. బాలీవుడ్ ఎంట్రీకి లైన్ క్లీయర్..? అక్కడా ఊపేస్తుందా?
తెలుగు యంగ్ సెన్సేషన్ శ్రీలీల తెలుగులో కెరటంలా లేచి పడిపోయింది. ఇప్పుడు కొత్త అవకాశాల కోసం స్ట్రగుల్ అవుతుంది. ఈ క్రమంలో ఆమెకి బాలీవుడ్ ఛాన్స్ వరించిందట.

Sreeleela
టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీల ఒక్క ఏడాది టాలీవుడ్‌ని షేక్ చేసింది. ఊహించని క్రేజ్‌తోపాటు అవకాశాలు కూడా కుప్పలు తెప్పలుగా వచ్చాయి. స్టార్ హీరోల సినిమాల్లోనూ నటించే అవకాశాలను అందుకుంది. రెండేళ్లపాటు శ్రీలీల పేరు తెలుగులో మారు మోగింది. స్టార్ హీరోయిన్లు సైతం శ్రీలీల దెబ్బకి కుదేల్ అయ్యారు. చాలా మంది హీరోయిన్ల ఆఫర్లని తను సొంతం చేసుకుంది శ్రీలీల.
కానీ ఆమెకి ఏడాది గ్యాప్ లోనే ఊహించని షాక్ తగిలింది. వరుసగా సినిమాలు పరాజయం కావడంతో ఎంత ఫాస్ట్ గా క్రేజ్‌ని సొంతం చేసుకుందో అంతే వేగంగా పడిపోయంది. ఓ కెరటంలా పడిపోయినట్టయ్యింది శ్రీలీల కెరీర్. అధికారికంగా శ్రీలీల చేతిలో `ఉస్తాద్ భగత్ సింగ్`, నితిన్ `రాబిన్‌హుడ్` చిత్రాలున్నాయి. పవన్ కళ్యాణ్ ఈ సినిమా ఎప్పుడు చేస్తాడో తెలియదు. దీంతో నితిన్ సినిమా ఒక్కటే ఆమె చేతిలో ఉంది. మరి నితిన్ ముంచుతాడు లేపుతాడా అనేది చూడాలి.
అయితే శ్రీలీల కొత్త ప్రాజెక్ట్ లకు సైన్ చేసిందనే వార్తలు చాలా రోజులుగా వస్తున్నాయి. స్టార్ హీరోల సినిమాల్లో ఎంపికైందని, టాక్స్ జరుగుతున్నాయని అంటున్నారు. రవితేజతో మరోసారి జోడీ కడుతుంది. వీరి కాంబోలో వచ్చిన `ధమాఖా` దుమ్ములేపిన విసయం తెలిసిందే. ఈ సినిమాతోనే శ్రీలీల స్టార్ అయిపోయింది. ఇప్పుడు డౌన్ అయిన శ్రీలీలకి రవితేజ లైఫ్ ఇస్తాడనే ప్రచారం జరుగుతుంది.
ఇదిలా ఉంటే తమిళంలోనూ ఇద్దరు స్టార్ హీరోలతో సినిమాలు చేయబోతుందట. విజయ్, అజిత్‌ల సినిమాలకు చర్చలుజరుగుతున్నాయనే పుకార్లు వచ్చాయి. కానీ ఎలాంటి అప్ డేట్ లేదు. ఈ నేపథ్యంలో శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ కన్ఫమ్ అయ్యిందనే వార్తలు వస్తున్నాయి. ఆమె ఓ స్టార్ హీరో కొడుకుతో రొమాన్స్ కి ఓకే చెప్పిందని సమాచారం.
బాలీవుడ్ విలక్షణ నటుడు సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్‌ని హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమా తెరకెక్కుతుంది. కునల్ దేశ్ ముఖ్ దర్శకుడిగా, మడాక్ ఫిల్మ్స్ ఓ సినిమాని రూపొందిస్తుంది. దీనికి `డైలర్` అనే పేరును అనుకుంటున్నారట. ఇందులో శ్రీలీలని హీరోయిన్‌గా ఎంపిక చేశారని తెలుస్తుంది. ఈ యంగ్ సెన్సేషన్ కూడా ఈ మూవీకి ఓకే చెప్పిందనే ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించిన సమాచారం రావాల్సి ఉంది.
sreeleela
ఇదే నిజమైతే బాలీవుడ్‌లోనూ శ్రీలీలకి మంచి ఎంట్రీ అవుతుందని చెప్పొచ్చు. స్టార్ హీరో కొడుకుని హీరోగా పరిచయం చేస్తూ సినిమా కాబట్టి అందరి అటెన్షన్ ఉంటుంది. అది శ్రీలీల పై టర్న్ అవుతుంది. హిందీలో మరిన్ని ఆఫర్లు రావడానికి అది హెల్ప్ అవుతుంది. మరి ఇది ఎంత వరకు వర్కౌట్ అవుతుంది, శ్రీలీల తెలుగులో ఫల్టీ కొట్టింది. అక్కడైనా జాగ్రత్తగా కెరీర్‌ని ప్లాన్ చేసుకుంటుందా అనేది చూడాలి. అయితే ప్రస్తుతం శ్రీలీల ఎంబీబీఎస్ చదువుతుంది. ఎగ్జామ్స్ కోసం కొంత గ్యాప్ తీసుకున్నట్టు టాక్.