- Home
- Entertainment
- శ్రీలీల పిలిచే `ఓజీ` ఎవరో తెలుసా? ఉమెన్స్ డే రోజు సర్‌ప్రైజ్, అన్‌లిమిటెడ్ ఫుడ్.. పోస్ట్ వైరల్
శ్రీలీల పిలిచే `ఓజీ` ఎవరో తెలుసా? ఉమెన్స్ డే రోజు సర్‌ప్రైజ్, అన్‌లిమిటెడ్ ఫుడ్.. పోస్ట్ వైరల్
శ్రీలీల తన ఓజీని కలిసింది. ఉమెన్స్ డే సందర్భంగా తాను ఓజీగా పిలుచుకునే హీరోని కలిసింది. ఆయన శ్రీలీలకి ఊహించని విధంగా సర్‌ప్రైజ్ చేయడం విశేషం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
sreeleela
Sreeleela: యంగ్ సెన్సేషన్ శ్రీలీలా డాన్సులతో పాపులర్ అయ్యింది. క్రేజీ హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి దూసుకొచ్చింది. ఓవర్ నైట్‌లో స్టార్ అయిపోయి వరుస పరాజయాల అనంతరం ఇప్పుడు మళ్లీ పుంజుకుంటుంది.
తాజాగా ఆమె `ఓజీ`ని కలిసింది. `ఓజీ` అంటే పవన్ కళ్యాణ్ కాదు, తాను భావించే `ఓజీ`, తాను పిలిచుకునే `ఓజీ`ని కలిసింది. ఆయన అదిరిపోయే గిఫ్ట్, కడుపునిండా ఫుడ్‌తో సర్‌ప్రైజ్ చేశారు. ఆ కథేంటో చూస్తే.
chiranjeevi, sreeleela
శ్రీలీల మెగాస్టార్ చిరంజీవిని కలిసింది. మహిళా దినోత్సవం సందర్భంగా చిరుని కలవడం విశేషం. తాను చిరంజీవిని ఓజీ అని పిలుకుంటుందట. తన శంకర్ దాదా అంటూ ఆయనపై ప్రశంసలు కురిపించింది.
మరి ఎక్కడ కలిసిందనేది చూస్తే. చిరంజీవి నటిస్తున్న `విశ్వంభర` మూవీ చిత్రీకరణ ప్రస్తుతం అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్ లో జరుగుతుంది. అందులోనే శ్రీలీల నటిస్తున్న సినిమా షూటింగ్ కూడా జరుగుతుంది.
chiranjeevi, sreeleela
చిరంజీవి అంటే ఎంతో అభిమానం శ్రీలీలకి. మెగాస్టార్ సెట్‌లోనే ఉన్నారని శ్రీలీలకి తెలిసింది. దీంతో ఆయన వద్దకు వెళ్లిపోయింది. శ్రీలీలని రావడంతో చిరు కూడా ఆమెని సర్ప్రైజ్ చేశారు.
మహిళా దినోత్సవం కావడంతో ఏదైనా స్పెషల్‌గా ఉండాలని భావించారు. అందుకోసం శ్రీలీలని శాలువాతో సత్కరించారు. అంతేకాదు దుర్గాదేవి రూపం ముద్రించిన శంఖాన్ని ప్రత్యేకంగా తెప్పించి ఆమెకి గిఫ్ట్ గా ఇచ్చారు.
chiranjeevi, sreeleela
చిరంజీవి ఇచ్చిన ఈ గిఫ్ట్ కి సంతోషించిన శ్రీలీల సోషల్ మీడియా ద్వారా దీన్ని పంచుకుంది. చిరంజీవితో దిగిన ఫోటోలను పంచుకుంటూ `ఓజీ`తో. నా శంకర్ దాదా ఎంబీబీఎస్. ఆయనొక సినిమా వేడుక. ఉమెన్స్ డే సందర్భంగా చిరంజీవి నుంచి స్వీట్ గెస్చర్` అని పేర్కొంది.
ఆయనకు ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పింది. అంతేకాదు కడుపునిండా భోజనం పెట్టించారని, ఉప్మా, దోశాలు విపరీతంగా తిన్నట్టు చెప్పింది శ్రీలీల. ప్రస్తుతం ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది.
chiranjeevi, sreeleela
ఇక చిరంజీవి `విశ్వంభర`లో నటిస్తుండగా, దీనికి వశిష్ట దర్శకుడు. త్రిష ఇందులో హీరోయిన్. యూవీ క్రియేషన్స్ దీన్ని నిర్మిస్తుంది. మరోవైపు శ్రీలీలా ప్రస్తుతం నితిన్‌తో `రాబిన్‌హుడ్`, రవితేజతో `మాస్ జాతర` చిత్రాల్లో నటిస్తుంది. త్వరలో `రాబిన్‌హుడ్` ఆడియెన్స్ ముందుకు రాబోతుంది.
also read: జూ.ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమా ఇదే, కానీ చిన్న ట్విస్ట్.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్?