SSMB29 Leak: మహేష్ బాబు, రాజమౌళి సినిమా నుంచి షాకింగ్ వీడియో లీక్ అయ్యింది. హీరో, విలన్ ఎదురుపడే కీలక సీన్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. మహేష్ ఫ్యాన్స్ మాత్రం ఊగిపోతున్నారు.
SSMB29 Leak: మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో ఇప్పుడు భారీ యాక్షన మూవీ రూపొందుతుంది. ఆ మధ్యనే ఈ మూవీ ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో మెయిన్ కాస్టింగ్ పాల్గొంటుందట.
మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నెగటివ్ రోల్ చేస్తున్నారనే విషయం తెలిసిందే. ఇటీవల ఆయన సెట్‌లోకి అడుగుపెట్టారు. మరోవైపు ప్రియాంక చోప్రా కూడా ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు.
`ఎస్‌ఎస్‌ఎంబీ29` సెట్ నుంచి క్రేజీ వీడియో లీక్..
తాజాగా మహేష్ బాబు, రాజమౌళి సినిమా నుంచి క్రేజీ వీడియో లీక్ అయ్యింది. మహేష్ బాబుపై చిత్రీకరిస్తున్న కీలక సన్నివేశం లీక్ కావడం గమనార్హం. ఇందులో చూడ్డానికి అడవి లాంటి ప్రాంతంగా అనిపిస్తుంది. కాకపోతే పర్వాతలు ఉండటంతో విశాలంగానూ ఉంది.
ఓ వ్యక్తి వీల్ ఛైర్‌లో ఉన్నారు. కొందరు ప్రైవేట్ సెక్యూరిటీ మహేష్ బాబుని పట్టుకుని ఆయన ముందుకు తీసుకు వస్తున్నారు. మహేష్ తనదైన స్టయిల్‌లో నడుచుకుంటూ వచ్చాడు, ఓ సెక్యూరిటీ అతను వచ్చి కింద కూర్చోబెట్టాడు. వెనకాల చేతులు పెట్టించాడు.
`ఎస్‌ఎస్‌ఎంబీ29` మహేష్ బాబు, పృథ్వీరాజ్ సుకుమార్ ఎదురుపడే సీన్ కేక
వీల్ చైర్‌లో వ్యక్తి చూస్తున్నాడు. ఆ వీల్ ఛైర్‌లో ఉన్నది మెయిన్ విలన్‌గా తెలుస్తుంది. అతనే పృథ్వీరాజ్ సుకుమారన్‌గా అనిపిస్తుంది. ఈ ఇద్దరు ఎదురుపడే సన్నివేశంగా ఇది కనిపిస్తుంది. హీరో మహేష్‌ని విలన్ బంధించి వార్నింగ్ ఇచ్చే సన్నివేశంలా ఇది కనిపిస్తుంది. చూడ్డానికి గూస్ బంమ్స్ తెప్పిస్తుంది.
ఇందులో మహేష్ ఊరమాస్ లుక్‌లోనే ఉన్నారు. జస్ట్ లీక్ వీడియోనే ఈ రేంజ్‌లో ఉంటే అది, సినిమాలో ఆర్‌ఆర్ మిక్సింగ్‌లో ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. లుక్ లీక్ టీమ్‌ని ఇబ్బంది పెట్టినా మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం కాలర్ ఎగరేసేలా ఉంది. దీన్ని వాళ్లు సోషల్‌మీడియాలో వైరల్ చేస్తున్నారు.
టైట్ సెక్యూరిటీ `ఎస్‌ఎస్‌ఎంబీ29` నుంచి వీడియో ఎలా లీక్ అయ్యింది?
అయితే రాజమౌళి సినిమా టైట్ సెక్యూరిటీ ఉంటుంది. సెట్‌కి సెల్ ఫోన్‌లను అనుమతించరు. ఎవరికైనా ఇది మినహాయింపు కాదు, అలాంటిది ఈ సెట్‌లోకి సెల్‌ఫోన్ ఎలా వచ్చిందనేది మిస్టరీ. ఇలాంటి కీలక సన్నివేశాలు లీక్ అయితే సినిమాపైనే అది ప్రభావం పడుతుంది. మరి దీనిపై జక్కన్న టీమ్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.
కానీ ఈ వీడియో మాత్రం ఇప్పుడు ఇంటర్నెట్ ని ఊపేస్తుంది. మహేష్ హీరోగా ఈ సినిమాని ఫారెస్ట్ బేస్డ్ యాక్షన్ అడ్వెంచరస్‌గా రూపొందిస్తున్నారు రాజమౌళి. ఆఫ్రీకన్ అడవుల నేపథ్యంలో కథ సాగుతుందని, మహేష్ ప్రపంచ సాహసికుడిగా కనిపిస్తారని సమాచారం. ఈ మూవీని వచ్చే ఏడాది విడుదల చేసే అవకాశం ఉంది.
read more: జూ.ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమా ఇదే, కానీ చిన్న ట్విస్ట్.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్?
also read: జయసుధ విషయంలో విసిగిపోయిన ఎన్టీఆర్, సీరియస్ వార్నింగ్.. దెబ్బకి మళ్లీ ఆ మాట ఎత్తలేదు