- Home
- Entertainment
- హీరోయిన్ గా శ్రీలీల కెరీర్ కు ఇక గుడ్ బై..? తల్లితో కలిసి భారీ స్కెచ్ వేసిన టాలీవుడ్ బ్యూటీ..?
హీరోయిన్ గా శ్రీలీల కెరీర్ కు ఇక గుడ్ బై..? తల్లితో కలిసి భారీ స్కెచ్ వేసిన టాలీవుడ్ బ్యూటీ..?
డాక్టర్ల ఫ్యామిలీ నుంచి వచ్చి...యాక్టర్ గా మారిందిహీరోయిన్ శ్రీలీల. ప్రస్తుతం హీరోయిన్ గా దూసుకుపోతున్న ఈ బ్యూటీ.. తనతల్లితో కలిసి భారీ స్కెచ్ వేస్తోందట.

సునామీలా టాలీవుడ లోకి ఎంటర్ అయ్యింది శ్రీలీల. చేసిన ఫస్ట్ సినిమా ప్లాప్ అయినా.. తన యాక్టీంగ్ తో... అందంతో అందరిని ఆకర్షించింది. అంతే కాదు వరుస ఆపఱ్లు సాధించి.. స్టార్ హీరోల పక్కన ఛాన్స్ కొట్టేసింది బ్యూటీ. ఇక అంతటితో ఆగకుండా.. ఉప్పెనలా దూసుకువచ్చిన కృతీ శెట్టిలాంటి హీరోయిన్ల ఆఫర్లు కూడా తనఖాతాలో వేసుకుంది శ్రీలీల.
ఇక శ్రీలీలకు కెరీర్ పై హోప్స్ ఇచ్చే సినిమాలు ఉన్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన గుంటూరు కారం సినిమా చేస్తోంది బ్యూటీ. ముందుగా పూజా హెగ్డే ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేసినా.. ఆతరువాత ఆమె అనుకోని.. అనివార్య కారణాల వల్ల డ్రాప్ అయ్యింది. దాంతో అసలు ఛాన్స్ కొసరుగా అనుకున్న శ్రీలీలకుదక్కింది. దాంతో శ్రీలీల ఫుల్ జోష్ మీద ఉంది. కెరీర్ మీద హోప్ తో ఉంది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ . అయితే శ్రీ లీల త్వరలోనే సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నట్టు సోషల్ మీడియా కోడై కూస్తోంది.. ప్రస్తుతం వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం.. శ్రీలీల ఇంకొన్నాళ్లలో మూవీ కెరీర్ కు గుడ్ బై చెప్పబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దానికి కారణం కూడా లేకపోలేదే.
శ్రీ లీల ఫ్యామిలీ అంతా డాక్టర్స్ ఫ్యామిలీ.. శ్రీలీల అమెరికా పౌరసత్వం కలిగి ఉంది. అక్కడే పుట్టి పెరిగింది. ఆమె తల్లి ఫారెన్ లో ఫేమస్ గైనకాలజిస్ట్ గా పరిచేసింది. అయితే శ్రీలీల హీరోయిన్ గా బిజీ అవ్వడంతో.. బెంగళూరుకు షిప్ట్ అయ్యింది. కూతురు సినిమా కెరీర్ కోసం ఫారెన్ లో కోట్ల సంపాదన వదిలి ఇక్కడికి వచ్చారు శ్రీలీల తల్లి. ఇక తన తల్లి డాక్టర్ కావడంతో శ్రీలీలా కూడా ఎంబీబీఎస్ చదువుతోంది.
ప్రస్తుతం ఈమె ఎంబిబిఎస్ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాస్తున్నారు దీంతో కొంతకాలం పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చారు.ఈ పరీక్షలు పూర్తి కాగానే శ్రీ లీలా తిరిగి తాను కమిట్ అయిన సినిమాలు కంప్లీట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. అయితే తాను సినిమాలు చేసేది కూడాచాలా తక్కువ కాలమే అని సమాచారం. తాజాగా శ్రీ లీలకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈమె తల్లి ప్రముఖ గైనకాలజిస్ట్ కావడంతో ఈమె బెంగుళూరులో ఒక హాస్పిటల్ నిర్మించబోతున్నారని తెలుస్తుంది. శ్రీ లీల కూడా డాక్టర్ కావడంతో శ్రీ లీల తన తల్లితో కలిసి హాస్పిటల్ లో పాలు పంచుకోబోతుందట. ఇక హాస్పిటల్ నిర్మించిన తర్వాత తన తల్లి తో కలిసిహాస్పిటల్ లో ప్రాక్టీస్ చేయబోతున్నారని... అలాగే శ్రీ లీల కూడా డాక్టర్ గా స్థిరపడబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.
ఇలా ఈమె హాస్పిటల్ నిర్మాణం పూర్తి అయ్యే వరకు సినిమాలలో కొనసాగుతుందని.. తరువాత డాక్టర్ గా స్థిరపడతారని సమాచారం. ఇక ఈమె సినిమాలకు దూరమవుతున్నారనే వార్త తెలియడంతో అభిమానులు కూడా కంగారు పడుతున్నారు. మరి నిజంగానే శ్రీ లీల వైద్యురాలిగా స్థిరపడి సినిమాలకు గుడ్ బై చెబుతుందా లేక సినిమాలలో కొనసాగుతుందా అనే విషయంలో క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.