పదహారణాల తెలుగు అందంలా శ్రీలీల..నది ఒడ్డున ఉయ్యాల ఊగుతూ, ఈమెని ఇలా చూస్తే హార్ట్ స్కిప్
రీసెంట్ గా శ్రీలీల గుంటూరు కారం చిత్రంలో మహేష్ బాబుకి జోడిగా నటించింది. ఎప్పటిలాగే డ్యాన్స్ ఇరగదీసింది. అయితే ఆశించిన స్థాయిలో గుంటూరు కారం చిత్రం బాక్సాఫీస్ వద్ద రాణించలేదు.
బెంగుళూరు బ్యూటీ శ్రీలీల టాలీవుడ్ లోకి మెరుపులా దూసుకువచ్చింది. పెళ్ళిసందD చిత్రంతో పరిచయమైన ఈ కుర్రభామ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ల స్థానాలకు సైతం ఎసరు పెట్టేసింది.
ధమాకా చిత్రంతో అయితే శ్రీలీల ఒక ఊపు ఊపేసింది అనే చెప్పాలి. డ్యాన్స్, యాక్టింగ్, అందం ఇలా ప్రతి అంశంలో ఆమెకి తిరుగులేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న బెస్ట్ ఫిమేల్ డ్యాన్సర్లలో శ్రీలీల ఒకరు. శ్రీలీల తన అందం, చలాకీతనం, నాట్యంతో టాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోయిన్లకు ఆల్మోస్ట్ చెక్ పెట్టేసింది.
ఇంతకు ముందు స్టార్ హీరోల సినిమాలంటే రష్మిక, పూజా హెగ్డే లాంటి ముద్దుగుమ్మల పేర్లు వినిపించేవి. శ్రీలీల సునామీలా దూసుకువచ్చి వారి ప్రభావాన్ని తగ్గించేసింది.
ఆమె గ్లామర్, డ్యాన్స్ స్కిల్స్ చూస్తుంటే ఫ్యూచర్ లో టాలీవుడ్ ని ఏలడం ఖాయం అని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నాయి.
రీసెంట్ గా శ్రీలీల గుంటూరు కారం చిత్రంలో మహేష్ బాబుకి జోడిగా నటించింది. ఎప్పటిలాగే డ్యాన్స్ ఇరగదీసింది. అయితే ఆశించిన స్థాయిలో గుంటూరు కారం చిత్రం బాక్సాఫీస్ వద్ద రాణించలేదు.
తాజాగా శ్రీలీల పదహారణాల తెలుగు పిల్లలా లంగా ఓణీలో కొలను ఒడ్డున ఉయ్యాలా ఊగుతూ కనిపించింది. శ్రీలీల నిలువెత్తు సొగసుతో మురిపించే విధంగా ఫోజులు ఇచ్చింది. క్యూట్ స్మైల్, చిరకత్తుల్లాంటి చూపులకు కుర్రకారు వెర్రెత్తిపోతున్నారు. అంత హాట్ గా శ్రీలీల ఈ పిక్స్ లో మెరిసింది.
శ్రీలీల తన నేచురల్ అందంతో కట్టిపడేస్తుంది. ఈ ఫొటోస్ చూస్తుంటే శ్రీలీల చిలిపిగా, క్యూట్ గా మెస్మరైజ్ చేసే పిక్స్ తో కుర్ర హృదయాల్ని ఆడుకుంటోంది.
అసలు శ్రీలీల ఏం తింటోంది ? ఇంత అందంగా ఉంటే కుర్రాళ్ళ పరిస్థితి ఏంటి ? అంటూ నెటిజన్లు చిలిపి కామెంట్స్ పెడుతున్నారు. శ్రీలీల మైండ్ బ్లోయింగ్ లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వుతున్నాయి. ఆమె సొగసు గురించి ఎంత వర్ణించినా తక్కువే. శ్రీలీల క్యూట్ లుక్స్, అమాయకమైన చూపులకు యువత ఫిదా అవుతున్నారు. పెదవుల అందంతో ఊరిస్తూ శ్రీలీల ప్రీ రిలీజ్ వేడుకలో మెరుపులు మెరిపించింది.