- Home
- Entertainment
- టాలీవుడ్ లో శ్రీలీల మ్యానియా, ఇది వెరీ వెరీ స్పెషల్ బర్త్ డే.. పవన్, మహేష్, రామ్ ఇలా వరుసగా..
టాలీవుడ్ లో శ్రీలీల మ్యానియా, ఇది వెరీ వెరీ స్పెషల్ బర్త్ డే.. పవన్, మహేష్, రామ్ ఇలా వరుసగా..
బెంగుళూరు బ్యూటీ శ్రీలీల టాలీవుడ్ లోకి మెరుపులా దూసుకువచ్చింది. పెళ్ళిసందD చిత్రంతో పరిచయమైన ఈ కుర్రభామ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ల స్థానాలకు సైతం ఎసరు పెట్టేసింది.

బెంగుళూరు బ్యూటీ శ్రీలీల టాలీవుడ్ లోకి మెరుపులా దూసుకువచ్చింది. పెళ్ళిసందD చిత్రంతో పరిచయమైన ఈ కుర్రభామ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ల స్థానాలకు సైతం ఎసరు పెట్టేసింది. ప్రస్తుతం శ్రీలీల పవన్ , మహేష్ బాబు, బాలకృష్ణ, రామ్ పోతినేని ఇలా వరుసగా స్టార్ హీరోల చిత్రాల్లో అవకాశాలు అందుకుంటోంది.
ధమాకా చిత్రంతో అయితే శ్రీలీల ఒక ఊపు ఊపేసింది అనే చెప్పాలి. డ్యాన్స్, యాక్టింగ్, అందం ఇలా ప్రతి అంశంలో ఆమెకి తిరుగులేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న బెస్ట్ ఫిమేల్ డ్యాన్సర్లలో శ్రీలీల ఒకరు. శ్రీలీల తన అందం, చలాకీతనం, నాట్యంతో టాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోయిన్లకు ఆల్మోస్ట్ చెక్ పెట్టేసింది. ఇంతకు ముందు స్టార్ హీరోల సినిమాలంటే రష్మిక, పూజా హెగ్డే లాంటి ముద్దుగుమ్మల పేర్లు వినిపించేవి.
శ్రీలీల సునామీలా దూసుకువచ్చి వారి ప్రభావాన్ని తగ్గించేసింది. శ్రీలీల ప్రభావం అంతా ఉందా అని భావించడానికి నేడు ఆమె జరుపుకుంటున్న 22 వ పుట్టినరోజు బలమైన నిదర్శనం. శ్రీలీల వెరీ క్యూట్ గా అంతకి మించిన అందంతో కుర్రాళ్ళ హృదయాలు కొల్లగొడుతోంది. నేడు ఆమె బర్త్ డే సందర్భంగా శ్రీలీల నటిస్తున్న చిత్రాల నుంచి ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేశారు.
ఈ ఫస్ట్ లుక్స్ లో శ్రీలీల ఎంత అందంగా ఉందొ మాటల్లో వర్ణించలేం. సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన త్రివిక్రమ్ దర్శకత్వంలో శ్రీలీల గుంటూరు కారం చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఆమెకి బర్త్ డే విషెస్ చెబుతూ గుంటూరు కారం చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ఈ పోస్టర్ లో శ్రీలీల కుంకుమ రంగు లంగావోణీ ధరించి అందంగా అమాయకంగా పోజు ఇస్తోంది.
బోయపాటి, రామ్ పోతినేని చిత్రంలో కూడా హీరోయిన్ శ్రీలీలనే. ఈ చిత్రం నుంచి కూడా ఆమె కోసం బర్త్ డే విషెస్ తెలుపుతూ పోస్టర్ రిలీజ్ చేశారు. శ్రీలీల నటిస్తున్న మరో బిగ్ ప్రాజెక్ట్ ఉస్తాద్ భగత్ సింగ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఛాన్స్ కొట్టేసింది. ఏ చిత్రాన్ని మైత్రి మూవీస్ నిర్మిస్తుండగా హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం నుంచి కూడా శ్రీలీల బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు.
ఇవి కాకుండా బాలయ్య భగవంత్ కేసరిలో శ్రీలీల కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే పంజా వైష్ణవ్ తేజ్ సరసన ఆదికేశవలో.. నితిన్, వక్కంతం వంశీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా చేస్తోంది.
ఇవి కాకుండా అల్లు అర్జున్ తో ఆహా ఒరిజినల్స్ కోసం ఒక యాడ్ షూట్ చేస్తోంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి మూవీలో కూడా ఈ బెంగుళూరు బ్యూటీనే హీరోయిన్. రానున్న రోజుల్లో శ్రీలీల మ్యానియా మరింత ఎక్కువ కాబోతుంది అనే చెప్పడం లో సందేహం లేదు.