మోసంతో కాదు నమ్మకంతో అవుతుంది... కళ్యాణ్ దేవ్ ఆసక్తికర పోస్ట్!
నటుడు కళ్యాణ్ దేవ్ లేటెస్ట్ సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతుంది. ఆయన నర్మగర్భంగా ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు.

Kalyan Dev
చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ సోషల్ మీడియాలో యాక్టివ్. కళ్యాణ్ దేవ్ పోస్ట్స్ ఆసక్తిరేపుతుంటాయి. ఆయన భార్య శ్రీజతో విడిపోయిన నేపథ్యంలో ఆయన పోస్ట్స్ ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. పరోక్షంగా ఆయన శ్రీజను టార్గెట్ చేస్తున్నారని నెటిజెన్స్ అభిప్రాయపడుతూ ఉంటారు.
Kalyan Dev
తాజాగా కళ్యాణ్ దేవ్ ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో... 'మనం ఎలాంటి ప్రపంచంలో బ్రతుకుతున్నాం అంటే మోసం ఎప్పటికీ, ఎవరినీ ఆశ్చర్య పరచలేదు. కానీ నమ్మకం ఆ పని చేయగలదు' అని పోస్ట్ చేశాడు. మోసం, నమ్మకం అంటూ కళ్యాణ్ దేవ్ ఎవరినో టార్గెట్ చేస్తున్నాడని పలువురి అభిప్రాయం.
Sreeja-Kalyan Dev
సోషల్ మీడియాలో శ్రీజ-కళ్యాణ్ దేవ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తూ ఉంటుంది. గతంలో కళ్యాణ్ దేవ్... శ్రీజ తనకు గౌరవం ఇవ్వడం లేదని అర్థం వచ్చేలా ఒక పోస్ట్ పెట్టాడు. దానికి కౌంటర్ గా శ్రీజ... ప్రేమను ప్రతిదాంట్లో వెతుక్కోకూడదు. దాన్ని గుర్తించాలి అంటూ శ్రీజ ఇండైరెక్ట్ కామెంట్ పోస్ట్ చేశారు. శ్రీజ-కళ్యాణ్ దేవ్ విడిపోయినట్లు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. అయితే వారు దూరంగా ఉంటున్నారు.
Kalyan Dev-Sreeja
శ్రీజ రెండో వివాహంగా కళ్యాణ్ దేవ్ ని చేసుకున్నారు. 2016లో వీరికి వివాహం కాగా ఓ పాప ఉంది. ఆ పాప పేరు నవిష్క. చిరంజీవి అల్లుడయ్యాక కళ్యాణ్ దేవ్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. విజేత మూవీతో వెండితెరకు పరిచయమయ్యాడు. మెగా ఫ్యామిలీ ఆయనకు మద్దతు ఇచ్చారు. ఆ సినిమా పర్లేదు అనిపించుకుంది.
ఇక శ్రీజ- కళ్యాణ్ దేవ్ రెండేళ్లకు పైగా విడివిడిగా ఉంటున్నారు. కూతురు నవిష్క తల్లి వద్దే పెరుగుతుంది. అప్పుడప్పుడు కూతురిని కలిసే అవకాశం కళ్యాణ్ దేవ్ కి ఇచ్చారు. నవిష్క తనతో ఉన్న హ్యాపీ మూమెంట్స్ కళ్యాణ్ దేవ్ సోషల్ మీడియాలో షేర్ చేస్తారు.
శ్రీజకు దూరమయ్యాక కళ్యాణ్ దేవ్ రెండు సినిమాలు చేశాడు. ఆ చిత్రాలకు మెగా ఫ్యామిలీ నుండి మద్దతు లభించలేదు. సూపర్ మచ్చి 2022 సంక్రాంతి కానుకగా విడుదలైంది. కిన్నెరసాని టైటిల్ తో చేసిన మరొక చిత్రం డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల చేశారు. నటుడిగా కళ్యాణ్ దేవ్ కెరీర్ ముగిసిన సూచనలు కనిపిస్తున్నాయి.