Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • నేను పవన్ కళ్యాణ్ ని ప్రేమించా..యాంకర్ సుమకి పిచ్చెక్కించిన శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్

నేను పవన్ కళ్యాణ్ ని ప్రేమించా..యాంకర్ సుమకి పిచ్చెక్కించిన శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీవిష్ణు ప్రస్తుతం హీరోగా రాణిస్తున్నాడు. శ్రీవిష్ణు ఖాతాలో కొన్ని హిట్స్ కూడా పడ్డాయి. దీనితో శ్రీవిష్ణు కామెడీ టచ్ ఉన్న లవ్ స్టోరీలు, ఫన్నీ రాబరీ కథలు, అలాగే కథా బలం ఉన్న ఎమోషనల్ చిత్రాలు కూడా చేస్తున్నాడు. 

tirumala AN | Published : Mar 20 2024, 08:58 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
18
Asianet Image

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీవిష్ణు ప్రస్తుతం హీరోగా రాణిస్తున్నాడు. శ్రీవిష్ణు ఖాతాలో కొన్ని హిట్స్ కూడా పడ్డాయి. దీనితో శ్రీవిష్ణు కామెడీ టచ్ ఉన్న లవ్ స్టోరీలు, ఫన్నీ రాబరీ కథలు, అలాగే కథా బలం ఉన్న ఎమోషనల్ చిత్రాలు కూడా చేస్తున్నాడు.  గత ఏడాది శ్రీవిష్ణు 'సామజవరగమన' చిత్రంతో సూపర్ హిట్ కొట్టాడు. 

28
Asianet Image

సామజవరగమన హిట్ తర్వాత శ్రీవిష్ణు తన కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు. వైవిధ్యం ఉన్న కథలతో పాటు తనకు బలం ఉన్న రొమాంటిక్ కామెడీ చిత్రాలపై ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది.  మరో రెండు రోజుల్లో శ్రీ విష్ణు తన కొత్త చిత్రంతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. 

38
Asianet Image

శ్రీవిష్ణు నటించిన లేటెస్ట్ మూవీ ఓం భీమ్ బుష్. హిలేరియస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది. కామెడీ ఎంటర్టైనర్ కావడంతో మంచి బజ్ ఉంది. ప్రచార కార్యక్రమాలు కూడా జోరుగా సాగుతున్నాయి. ఈ చిత్రంలో శ్రీవిష్ణుతో పాటు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వీళ్ళ ముగ్గురు చుట్టూనే కథ ఉంటుంది. 

48
Asianet Image

యువీ క్రియేషన్స్, వి సెల్యులాయిడ్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. యువదర్శకుడు శ్రీహర్ష ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తాజాగా దర్శకుడితో పాటు శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ సుమ అడ్డా షోలో పాల్గొన్నారు. తాజాగా విడుదలైన ప్రోమో మామూలుగా లేదు. 

58
Asianet Image

అందరిపై సెటైర్లు వేసే సుమకి శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ చుక్కలు చూపించారు. సుమ అడ్డా ప్రోమో పొట్టచెక్కలయ్యే ఫన్నీ అంశాలతో ఉంది. ముఖ్యంగా రాహుల్ రామకృష్ణ.. సుమపై వరుస సెటైర్లతో చెలరేగిపోయాడు. శ్రీవిష్ణు కూడా సుమపై కామెడీ పంచ్ లు వేశాడు. 

68
Asianet Image

మీ తొలిప్రేమ గురించి చెప్పండి అని సుమ శ్రీవిష్ణుని అడిగింది. దీనికి శ్రీవిష్ణు సమాధానం ఇస్తూ నేను ఆ సినిమాని అమలాపురం వెంకటరామ థియేటర్ లో చూశానని అంటాడు. దీనితో అంతా నవ్వేశారు. నేను అడిగేది నీ తొలిప్రేమ గురించి అండీ అంటుంది.. ఆ అవును ఆ సినిమాలోనే నేను పవన్ కళ్యాణ్ గారిని ప్రేమించా అని శ్రీవిష్ణు అంటాడు. దీనితో సుమ ఇచ్చే హావభావాలు పొట్ట చెక్కలయ్యేలా చేశాయి. 

78
Asianet Image

ఆ తర్వాత సుమ కుమారి ఆంటీలాగా మారిపోయింది. అక్కడున్న వారందరికీ భోజనం వడ్డిస్తూ కుమారి ఆంటీని మిమిక్రి చేసింది. ఏంటి నాన ఎమ్ కావాలి చెప్పండి అని అడుగుతుంది. ఈ కరీస్ ఏంటి ఇంత అందంగా ఉన్నాయి అని రాహుల్ అడుగుతాడు. ఏం లేదు నాన నేను అందంగా ఉంటాను కదా.. అప్పుడప్పుడూ నా అందం కరీస్ లో పడిపోతూ ఉంటుంది అని చెబుతుంది. దీనితో రాహుల్ రామకృష్ణ ఛీ అంటూ ప్లేట్ కింద పడేస్తాడు. 

88
Asianet Image

చివర్లో ఎమోషనల్ గా సుమ అడ్డా ప్రోమో ముగిసింది. మార్చి 22న సుమ తన పుట్టినరోజు జరుపుకోబోతున్న సంగతి తెలిసిందే. దీనితో ఓం భీమ్ బుష్ టీం సుమకి సర్ప్రైజ్ ఇచ్చారు. సుమ తన ట్రస్ట్ ద్వారా ఆశ్రమం నిర్వహిస్తోంది. ఆ ఆశ్రమంలోని వృద్దులని ఓం భీమ్ బుష్ టీం తీసుకువచ్చింది. వారి సమక్షంలో సుమ బర్త్ డే సెలెబ్రేషన్స్ నిర్వహించారు. దీనితో సుమ ఎమోషనల్ అయింది. 

tirumala AN
About the Author
tirumala AN
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది. Read More...
 
Recommended Stories
Top Stories