- Home
- Entertainment
- విజయ్ దేవరకొండ, రామ్ పోతినేని, దుల్కర్ సల్మాన్ మాత్రమే కాదు.. అఖిల్ తో కూడా యంగ్ హీరోయిన్ రొమాన్స్
విజయ్ దేవరకొండ, రామ్ పోతినేని, దుల్కర్ సల్మాన్ మాత్రమే కాదు.. అఖిల్ తో కూడా యంగ్ హీరోయిన్ రొమాన్స్
అక్కినేని అఖిల్ నటిస్తున్న కొత్త సినిమా ‘లెనిన్’ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. డైరెక్టర్ మురళి కిషోర్ ఈ చిత్రాన్ని రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో లవ్ అండ్ యాక్షన్ చిత్రం గా రూపొందిస్తున్నారు.

అఖిల్ లెనిన్ మూవీ
అక్కినేని అఖిల్ నటిస్తున్న కొత్త సినిమా ‘లెనిన్’ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఈ చిత్రానికి మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. సీతార ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎస్‌ఎస్ థమన్ పనిచేస్తున్నారు. పెళ్లి అయిన తర్వాత అఖిల్ నుంచి వస్తున్న తొలి చిత్రం కావడంతో ఈ మూవీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే బిగినింగ్ లోనే ఈ చిత్రానికి షాక్ తప్పలేదు. ఈ చిత్రం నుంచి హీరోయిన్ గా శ్రీలీల తప్పుకున్నట్లు ఇప్పటికే తెలియజేశాం. ఇప్పుడు కొత్త హీరోయిన్ గా మరో క్రేజీ బ్యూటీ ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి.
అఖిల్ మూవీ నుంచి శ్రీలీల అవుట్
మొదట ఈ చిత్రానికి కథానాయికగా శ్రీలీలను ఎంపిక చేశారు. ఆమెపై కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించారు. అయితే తాజా సమాచారం ప్రకారం డేట్ ఇష్యూస్ కారణంగా ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు టాలీవుడ్ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఆమె సినిమా నుంచి పూర్తిగా వైదొలిగినట్టు తెలుస్తోంది.
అఖిల్ తో భాగ్యశ్రీ రొమాన్స్
శ్రీలీల స్థానంలో ఇప్పుడు మరో క్రేజీ నటి భాగ్యశ్రీ బోర్సే వస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఆమె ఇటీవలే రవితేజ నటించిన ‘మిస్టర్ బచ్చన్’ చిత్రం ద్వారా గుర్తింపు పొందారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిజాస్టర్ అయినప్పటికీ భాగ్య శ్రీ గ్లామర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. యువతలో ఆమెకి బాగా ఫాలోయింగ్ పెరిగింది. ప్రస్తుతం భాగ్యశ్రీ దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘కాంతా’ చిత్రంతో పాటు రామ్ పోతినేని నటిస్తున్న ‘ఆంధ్ర కింగ్ తాలుకా’ చిత్రంలో కూడా నటిస్తున్నారు. అదే విధంగా విజయ్ దేవరకొండ కింగ్ డమ్ చిత్రంలో కూడా భాగ్యశ్రీ నటిస్తోంది.
టాలీవుడ్ లో కొత్త స్టార్ హీరోయిన్
భాగ్యశ్రీ అఖిల్ లెనిన్ చిత్రంలో నటించబోతున్నట్లు ఇంకా అధికారికంగా నిర్మాతల నుంచి ప్రకటన రాలేదు. అయితే పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం ఆమె పాత్ర ఖరారైనట్టు భావిస్తున్నారు. భాగ్య శ్రీ జోరు చూస్తుంటే టాలీవుడ్ కొత్త స్టార్ హీరోయిన్ అవతరించింది అని విశ్లేషకులు అంటున్నారు.
రాయలసీమ నేపథ్యంలో ప్రేమ కథ
ఈ ఏడాది ఏప్రిల్‌లో ‘లెనిన్’ టీజర్ విడుదలై మంచి స్పందనను తెచ్చుకుంది. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామా ప్రస్తుతం రిలీజ్ డేట్‌ను ఖరారు చేయాల్సి ఉంది. డైరెక్టర్ మురళి కిషోర్ ఈ చిత్రాన్ని రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో లవ్ అండ్ యాక్షన్ చిత్రం గా రూపొందిస్తున్నారు. పెళ్లి తర్వాత అఖిల్ రఫ్ అండ్ రగ్గడ్ లుక్ లో కనిపించబోతున్నాడు.