MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • యాంకర్ స్రవంతి ఇనిస్ట్రా ఫొటో షూట్ చూసారా? మామూలుగా లేదుగా

యాంకర్ స్రవంతి ఇనిస్ట్రా ఫొటో షూట్ చూసారా? మామూలుగా లేదుగా

స్రవంతి చొక్కరపు పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో  బాగా వినిపిస్తున్న పేరు. ఆమె చాలా సినిమా ఈవెంట్స్ హోస్ట్ చేస్తూ అందరికీ కనపడుతూ, ..

3 Min read
Surya Prakash
Published : Aug 19 2024, 08:32 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111
Sravanthi Chokarapu, big boss, pawan kalyan

Sravanthi Chokarapu, big boss, pawan kalyan


యాంకర్ స్రవంతి చొక్కారపు ఇనిస్ట్రా రెగ్యులర్ గా చూసే వాళ్లకు బాగా పరిచయం ఉన్న పేరు. ఎప్పటికప్పుడు తన అందాలతో  టాలెంట్ చూపిస్తూండే  ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్.  తన యాంకరింగ్‌‌తో (Sravanthi Chokarapu)తో ఫ్యామిలీలను సైతం ఆకట్టుకుంటుంది. అలాగే  బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా తనలోని మల్టీ టాలెంట్‌ను చూపించింది స్రవంతి. తాజాగా ఆమె ఇనిస్ట్రా కోసం ప్రత్యేకంగా చేసిన ఫొటో షూట్ వైరల్ అవుతోంది.  ఆ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి.

211
Sravanthi Chokarapu, big boss, pawan kalyan

Sravanthi Chokarapu, big boss, pawan kalyan


స్రవంతి ఎప్పుడూ బిజీగానే ఉంటుంది.  సినిమా ఈవెంట్లు, స్పెషల్ ఇంటర్వ్యూలతో పాటు ఫొటో షూట్‌లతో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఇక ఆమె హాట్ అవతారం గురించి ప్రత్యేకంగా పరిచయం చేసేదేముంది.  ఈమె యాంకరింగ్‌ని ఇష్టపడే వాళ్లకంటే.. ఆమె హాట్ ఫొటోలు, వీడియోలు చూసి ఆనందించే వారి శాతమే ఎక్కువ కావడంతో.. వాళ్లని ఎప్పటికప్పుడు నయనానందం కలిగిస్తూ  ఉంటుంది యాంకర్ స్రవంతి. 

311
Sravanthi Chokarapu, big boss, pawan kalyan

Sravanthi Chokarapu, big boss, pawan kalyan

 స్రవంతికి ఫ్యాషన్ డిజైనింగ్‌లోనూ మంచి అనుభవం ఉండటంతో ఎలాంటి డ్రెస్‌లతో ఎలాంటి ఫోజులు పెట్టాలో ఈమెకు బాగా తెలుసు. దాంతో స్రవంతి చొక్కరపు నటి, యాంకర్, హోస్ట్ ఒకటికాదు ఆమె ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకుంది. అనుకోకుండా నటిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి తరువాత కొన్ని సినిమాలలో నటించి, తరువాత టీవిలో హోస్ట్ గా చాలా ప్రోగ్రామ్స్ చేసింది. 

411
Sravanthi Chokarapu, big boss, pawan kalyan

Sravanthi Chokarapu, big boss, pawan kalyan

ఫిల్మ్ ఈవెంట్స్ కి, అలాగే టీవిలో పలు షోలకి హోస్ట్ గా చేస్తున్న స్రవంతి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని.  "నేను పవన్ కళ్యాణ్ కి మొదటి నుండీ చాలా పెద్ద అభిమానిని. అందుకే మా అబ్బాయికి పవన్ కళ్యాణ్ కుమారుడి పేరు అయిన అకీరా నందన్ అని పేరు పెట్టాను," అని చెప్పింది స్రవంతి. అంతే కాదు తాను నడుపుతున్న బోటిక్ పేరు కూడా పవన్ కళ్యాణ్ కుమారుడు పేరు వచ్చేట్టుగా అకీరా లేబిల్ అనే పేరు పెట్టింది.
 

511
Sravanthi Chokarapu, big boss, pawan kalyan

Sravanthi Chokarapu, big boss, pawan kalyan

పవన్ అభిమాని 

అలాగే పవన్ కళ్యాణ్ కి మీ బోటిక్ నుండి ఏమైనా మంచి అవుట్ ఫిట్స్ పంపించారా అని అడిగితే, "పంపించాను, అవి అతను వేసుకున్నారు కూడా. నేను చాలా హ్యాపీగా వున్నాను," అని చెప్పారు. అయితే స్రవంతి ఇంతవరకు పవన్ కళ్యాణ్ ని కలవలేదు. కళ్యాణ్ గారు గత కొంత కాలంగా ప్రచార సభలు, ఎన్నికలు, ఆ తరువాత ఇప్పుడు రాజకీయంగా బిజీగా వున్నారు.  ఉప ముఖ్యమంత్రిగా, మంత్రిగా కూడా బాధ్యతలు తీసుకున్నారు. అతను ఇప్పుడు తన కార్యకలాపాలతో కొన్ని రోజులు బిజీగా వుంటారు, అది అయ్యాక తప్పకుండా కలుస్తా అని చెప్పింది స్రవంతి. 

611
Sravanthi Chokarapu, big boss, pawan kalyan

Sravanthi Chokarapu, big boss, pawan kalyan


  స్రవంతి నేపధ్యం ఏమిటి? 

"నేను అనంతపురం జిల్లా కదిరిలో పుట్టి అక్కడే పెరిగాను. పదవ తరగతి వరకు అక్కడే చదివాను. తరువాత చదువు అంతా హైదరాబాదులో సాగింది," అని చెప్పింది తన గురించి. సీనియర్ నటుడు రాజశేఖర్ మేనకోడలు, స్రవంతి క్లాస్ మేట్స్. "ఆమె ఒకరోజు నన్ను 'మహంకాళి' సినిమా షూటింగ్ కి తీసుకువెళ్ళింది. అప్పుడు ఎవరో ఆర్టిస్టు రాకపోతే నేను బాగున్నాను అని నన్ను తీసుకున్నారు," అని చెప్పుకొచ్చింది స్రవంతి.

711
Sravanthi Chokarapu, big boss, pawan kalyan

Sravanthi Chokarapu, big boss, pawan kalyan

అలా తను మొదటి సారిగా వెండితెరపై కనపడటం జరిగింది. అలా చదువుకుంటూ ఉండగానే సినిమాలో చాన్సు రావటం, దానికితోడు డబ్బులు కూడా రావటంతో, అలా కొన్ని సినిమాల్లో నటించింది స్రవంతి. అనుకోకుండా అలా చాన్సు వచ్చి నటిగా మారింది స్రవంతి. ఆ తరువాత ప్రశాంత్ అనే అబ్బాయితో ప్రేమలో పడింది.

811

అయితే కరెక్ట్ గా  బిజినెస్‌లో నిండా మునిగిన సమయంలో స్రవంతి ఫోన్‌ చేసి ఇంట్లో పెళ్లంటున్నారు ఏం చేయాలని భయపడిపోయిందన్నాడు. ఏం చేయాలో అర్థం కాక ఆమెను ఇంట్లో నుంచి వచ్చేయమని చెప్పి సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నామని చెప్పాడు. పెళ్లి తర్వాత ఆమెను హాస్టల్‌లో ఉంచానని, కొన్నాళ్లకు అందరినీ ఒప్పించి మళ్లీ పెళ్లి చేసుకున్నామన్నారు. శ్రవంతి చెప్పిన రెండు పెళ్లిళ్ల సీక్రేట్ అదే అన్నారు.  

911
Sravanthi Chokarapu

Sravanthi Chokarapu

 
ప్రేమ వివాహం

"మా పెద్దలు ఒప్పుకోకపోయినా, మేమిద్దరం వివాహం చేసుకున్నాం, మా వారు సాఫ్ట్ వేర్ రంగంలో పని చేస్తారు," అని చెప్పింది స్రవంతి. వీళ్ళకి ఇప్పుడు పది సంవత్సరాల బాబు వున్నాడు. "మేము చాలా సంతోషంగా ఒకరికొకరు అర్థం చేసుకుంటూ హాయిగా వున్నాం, కానీ సోషల్ మీడియా వాళ్ళకే మేము అలా ఉండటం ఇష్టం లేదు," అని నవ్వుతూ చెప్పింది,
 

1011
Sravanthi Chokarapu, big boss, pawan kalyan

Sravanthi Chokarapu, big boss, pawan kalyan


 గాసిప్స్ గురించి.
 
టీవీలో వచ్చిన తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్, ఓటిటి లో మొదటిసారిగా వచ్చినప్పుడు స్రవంతి కూడా ఆ ఇంట్లోకి అడుగు పెట్టింది. ఏడు వారాలపాటు ఇంట్లో వుంది. "రోజూ కెమెరా ముందుకు వెళ్లి నన్ను బయటకి పంపించెయ్యి బిగ్ బాస్ అని చెప్పేదాన్ని," అని చెప్పింది స్రవంతి. బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టడం ఒక మంచి అనుభూతి, ఒక అనుభవం. అంతే రెండోసారి బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లాలని అనుకోకూడదు అని చెప్పింది స్రవంతి.
 

1111
Sravanthi Chokarapu, big boss, pawan kalyan

Sravanthi Chokarapu, big boss, pawan kalyan


ఇప్పుడు ఫిల్మ్ ఈవెంట్స్ కి హోస్ట్ గా స్రవంతి చేస్తూ ఉంటుంది, అలాగే టీవీలో కూడా హోస్ట్ గా చేస్తూ వుంది. "ఈటీవీ లో 'ఫామిలీ స్టార్' అని ఒక షో మొదలైంది. నేను, సుధీర్ హోస్ట్ గా చేస్తున్నాం ఈ షో," అని చెప్పింది స్రవంతి. అలాగే తన సొంత బొటిక్ ని కూడా నిర్వహిస్తోంది స్రవంతి.

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved