- Home
- Entertainment
- 2027 Summer: వచ్చే ఏడాది సమ్మర్‌లో బాక్సాఫీసు రణరంగమే.. ఇండియన్ సినిమాని రూల్ చేయనున్న నాలుగు సినిమాలు
2027 Summer: వచ్చే ఏడాది సమ్మర్‌లో బాక్సాఫీసు రణరంగమే.. ఇండియన్ సినిమాని రూల్ చేయనున్న నాలుగు సినిమాలు
2027 Summer: వచ్చే ఏడాది సమ్మర్‌కి నాలుగు భారీ పాన్ ఇండియా చిత్రాలు విడుదల కాబోతున్నాయి. బాక్సాఫీసుపై దండయాత్రకి రెడీ అవుతున్నాయి. అదే సమయంలో భారతీయ సినిమాని రూల్ చేసేందుకు వస్తున్నాయి.

2027 సమ్మర్‌కి బాక్సాఫీసుపై నాలుగు సినిమాలు దండయాత్ర
ఇటీవల కాలంలో సమ్మర్‌కి సినిమాలు తగ్గిపోయాయి. ఒకప్పుడు చాలా పెద్ద పెద్ద సినిమాలు విడుదలయ్యేవి. బాగా ఆడేవి. హాలీడేస్‌ని బాగా క్యాష్ చేసుకునే వాళ్లు మేకర్స్. కానీ రాను రాను సమ్మర్ డ్రైగా మారుతుంది. చిన్న సినిమాలు తప్ప, భారీ చిత్రాలు రావడం లేదు. అయితే ఈ ఏడాది రెండుమూడు సినిమాలకు స్కోప్ ఉంది. రామ్ చరణ్ `పెద్ది`, నాని `పారడైజ్`, పవన్ `ఉస్తాద్ భగత్ సింగ్` వచ్చే అవకాశం ఉంది. ఇంకా క్లారిటీ లేదు. కానీ వచ్చే ఏడాది సమ్మర్ మాత్రం మోత మోగబోతుంది. తెలుగు సినిమా చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా భారీ పాన్ ఇండియా సినిమాలు బాక్సాఫీసుపై దండయాత్రకి రెడీ అవుతున్నాయి. ఏకంగా నాలుగు భారీ పాన్ ఇండియా సినిమాలు రాబోతున్నాయి.
`స్పిరిట్`తో బాక్సాఫీసు ఊచకోత ప్రారంభం
వచ్చే ఏడాది సమ్మర్‌ని మొదటగా టార్గెట్ చేసిన మూవీ `స్పిరిట్`. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతుంది. డిమ్రీ తృప్తి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ సమ్మర్ స్పెషల్‌గా మార్చి 5న రిలీజ్ కాబోతుంది. ఇందులో చిరంజీవి, విజయ్ దేవరకొండలు కనిపిస్తారనే వార్తలువినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే ఇది బాక్సాఫీసు వద్ద ఊచకోతే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
`వారణాసి`తో సమ్మర్ హీటు పెరిగిపోబోతుంది
ఈ సినిమా వచ్చిన నెల రోజులకు మహేష్ బాబు దిగుతున్నారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న `వారణాసి` రిలీజ్ కాబోతుంది. గ్లోబల్ ట్రోటర్‌గా, టైమ్ ట్రోటర్‌గా రూపొందుతున్న ఈ భారీ ఫాంటసీ యాక్షన్ మూవీ ఏప్రిల్ 7న విడుదల కాబోతుంది. శుక్రవారమే ఈ రిలీజ్ డేట్‌ని ప్రకటించారు. సమ్మర్ మొత్తాన్ని పిండేయడానికి రాజమౌళి భారీ ప్లాన్ చేశారు. వరుసగా హాలీడేస్ ఉండేలా ప్లాన్ చేసుకుని ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు. ఈ రెండు సినిమాల కోసం తెలుగు ఆడియన్సే కాదు, భారతీయ ప్రేక్షకులు కూడా ఆతృతగా వెయిట్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఇందులో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
అల్లు అర్జున్, అట్లీ మూవీతో బాక్సాఫీసు వద్ద విస్పోటనమే
వీటితోపాటు మరో రెండు భారీ సినిమాలు సమ్మర్‌నే టార్గెట్ చేశాయట. అందులో ఒకటి అల్లు అర్జున్ మూవీ. అట్లీ దర్శకత్వంలో బన్నీ ఈ మూవీలో నటిస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్, సూపర్ హీరో ఎలిమెంట్లతో యాక్షన్ మూవీగా దీన్ని రూపొందిస్తున్నారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ కాబోతుంది. `వారణాసి` స్థాయిలో ఈ మూవీని కూడా గ్లోబల్ ఫిల్మ్ గా రూపొందిస్తున్నారు. ఈ సినిమా కూడా వచ్చే ఏడాది సమ్మర్‌ని టార్గెట్ చేశారట. దీనికి సంబంధించిన హింట్ ఇస్తూ వస్తున్నారు. ఈ లెక్కన ఈ చిత్రం ఏప్రిల్ చివరి వారంలోగానీ, మేలో గానీ రావాల్సి ఉంటుంది. రిలీజ్ డేట్‌పై క్లారిటీ రావాల్సి ఉంది. ఇందులో దీపికా పదుకొనె హీరోయిన్‌గా కీలక పాత్రలో నటిస్తుంది. ఆమెతోపాటు మరో ముగ్గురు హీరోయిన్లు కనిపిస్తారని సమాచారం.
డ్రాగన్‌తో బాక్సాఫీసు వేటకు ఎన్టీఆర్, నీల్ ప్లాన్
అలాగే మరో భారీ పాన్ ఇండియా మూవీ `డ్రాగన్` మేకర్స్ కూడా వచ్చే ఏడాది సమ్మర్‌నే టార్గెట్ చేశారు. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతుంది. గ్యాంగ్ స్టర్ కథతో రూపొందే పీరియాడికల్ యాక్షన్ మూవీ ఇది. 1970 బెంగాల్ బ్యాక్ డ్రాప్‌లో సాగుతుంది. ప్రశాంత్ నీల్ మార్క్ కథాంశంతో సినిమా సాగుతుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని కూడా వచ్చే ఏడాది సమ్మర్‌కి విడుదల చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. మరి ఇంతటి టైట్‌లో దీన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది చూడాలి. ఈ నాలుగు సినిమాలు ఎప్పుడు రిలీజ్ అయినా బాక్సాఫీసు రణరంగమే అని చెప్పొచ్చు. కాసుల వేటలో పోటీ పడబోతాయని చెప్పొచ్చు. అదే సమయంలో వచ్చే ఏడాది తెలుగు సినిమా భారతీయ మూవీని రూల్ చేయబోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

