MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Chiranjeevi: కాజల్‌, తమన్నా ఎవరో నాకు తెలియదు, పూర్తిగా డిస్‌ కనెక్ట్ అయిపోయా.. చిరంజీవిలో ఇంత మార్పా?

Chiranjeevi: కాజల్‌, తమన్నా ఎవరో నాకు తెలియదు, పూర్తిగా డిస్‌ కనెక్ట్ అయిపోయా.. చిరంజీవిలో ఇంత మార్పా?

చిరంజీవి.. తాను రొమాన్స్ చేసిన కాజల్‌ అగర్వాల్‌, తమన్నా ల గురించి క్రేజీ కామెంట్‌ చేశారు. తనకు కాజల్‌, తమన్నా ఎవరో కూడా తెలియదని తెలిపారు. మరి దీని వెనుకున్న అసలు కథేంటంటే? 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jan 31 2026, 09:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మన శంకర వర ప్రసాద్‌ గారు మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన చిరంజీవి
Image Credit : X/@Shine_Screens

మన శంకర వర ప్రసాద్‌ గారు మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన చిరంజీవి

మెగాస్టార్‌ చిరంజీవి ఇటీవలే సంక్రాంతికి `మన శంకర వర ప్రసాద్‌ గారు` మూవీతో హిట్‌ కొట్టాడు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మూడు వందల కోట్లకుపైగా వసూళ్లని సాధించింది. టీమ్‌ ఇప్పటికే రూ.360కోట్లకుపైగా వసూళ్లు వచ్చినట్టు ప్రకటించారు. ఇప్పుడు మూవీ థియేటర్లలో దాదాపు క్లోజ్‌ అయ్యే పరిస్థితికి వచ్చింది. మొత్తానికి ఇది ఇండస్ట్రీ హిట్‌ గా నిలిచింది. చిరంజీవి కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లని రాబట్టిన చిత్రంగా నిలిచింది.

25
రాజకీయాల్లో సక్సెస్‌ కాలేని చిరంజీవి
Image Credit : X/@Shine_Screens

రాజకీయాల్లో సక్సెస్‌ కాలేని చిరంజీవి

ఈ క్రమంలో చిరంజీవి ఇటీవల మీడియా ప్రతినిధులతో ఇంటరాక్ట్ అవుతున్నారు. తనకు చాలా రోజుల తర్వాత సక్సెస్‌ వచ్చిన నేపథ్యంలో తన సంతోషాన్ని వ్యక్తిగతంగా పంచుకున్నారు. అందులో భాగంగా పలు ఆసక్తికర విషయాలను షేర్‌ చేశారు చిరంజీవి. అందులో భాగంగా సినిమాలకు బ్రేక్‌ ఇచ్చిన సమయంలో చోటు చేసుకున్న పరిణామాలను వెల్లడించారు. చిరంజీవి 2008 నుంచి సినిమాల నుంచి బ్రేక్‌ తీసుకున్నారు. ఆయన రాజకీయాల్లోకి వెళ్లిన విషయం తెలిసిందే. ప్రజారాజ్యం స్థాపించి ఎన్నికల్లోకి వెళ్లారు. కానీ అధికారంలోకి రాలేకపోయారు. కొన్నాళ్ల తర్వాత తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో కలిపేశారు. కేంద్ర మంత్రి అయ్యారు.

Related Articles

Related image1
Rajinikanth: `నరసింహ` వెనుక రహస్యం, ఇన్నాళ్లకి బయటపెట్టిన సూపర్‌స్టార్‌ కూతురు.. నరసింహ 2 అప్‌ డేట్‌
Related image2
Ramya Krishnan: కృష్ణవంశీకి భార్యగా కాదు, నాకు ఇలా ఉండటమే ఇష్టం.. రమ్యకృష్ణ బోల్డ్ స్టేట్‌మెంట్‌
35
అభిమానుల ఆకలి తీర్చిన మన శంకర వర ప్రసాద్‌ గారు
Image Credit : Asianet News

అభిమానుల ఆకలి తీర్చిన మన శంకర వర ప్రసాద్‌ గారు

2017 నుంచి మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు `ఖైదీ నెంబర్‌ 150` చిత్రంతో ఆయన రీఎంట్రీ ఇచ్చి అదరగొట్టారు. వరుసగా సినిమాలు చేస్తూ వచ్చారు. `సైరా`, `వాల్తేర్‌ వీరయ్య`, `గాడ్‌ ఫాదర్‌`, `భోళా శంకర్‌`, `ఆచార్య` వంటి చిత్రాల్లో నటించారు. అయినా ఏదో లోటు. ఆయన రేంజ్‌ హిట్‌ పడటం లేదనే వెలితి ఉండేది. దాన్ని ఇప్పుడు `మన శంకర వర ప్రసాద్‌ గారు` మూవీ భర్తీ చేసింది. మెగా అభిమానుల ఆకలి తీర్చింది. ఈ మూవీని అభిమానులు ఒక సెలబ్రేషన్‌లా ఫీల్‌ కావడం విశేషం.

45
కాజల్‌, తమన్నా ఎవరో తెలియదు-చిరంజీవి
Image Credit : smarty

కాజల్‌, తమన్నా ఎవరో తెలియదు-చిరంజీవి

ఇదిలా ఉంటే తాను సినిమాల నుంచి దూరమైన సందర్భాన్ని చిరంజీవి పంచుకుంటూ ఆ తర్వాతి తరం హీరోయి‌న్లు ఎవరో కూడా తనకు తెలియదని తెలిపారు. `నేను రాజకీయాల్లోకి వెళ్లాక సినిమాల నుంచి పూర్తిగా డిస్‌ కనెక్ట్ అయ్యాను. `ఖైదీ నెం 150`కి హీరోయిన్‌ కాజల్‌ అన్నప్పుడు, కాజల్‌ ఎవరు అని అడిగా. తమన్నా కూడా ఎవరో తెలిసేది కాదు. అంతలా డిస్‌ కనెక్ట్ అయిపోయా` అని తెలిపారు చిరంజీవి. కాజల్‌తో `ఖైదీ నె 150`, `ఆచార్య` చిత్రాల్లో నటించారు. కాకపోతే `ఆచార్య` నుంచి ఆమె సీన్లు తొలగించారు. ఇక తమన్నాతో `సైరా`, `భోళా శంకర్‌` చిత్రాలు చేశారు చిరు. దాదాపు 9 ఏళ్లు ఆయన సినిమాలు పూర్తిగా దూరంగా ఉన్నారు. ఒక తరానికి దూరమయ్యరు. ఇప్పుడు లేటెస్ట్ మూవీతో ఈ జనరేషన్‌కి కూడా దగ్గరయ్యారు.

55
చిరంజీవి నెక్ట్స్ మూవీస్‌
Image Credit : X/@Shine_Screens

చిరంజీవి నెక్ట్స్ మూవీస్‌

చిరంజీవి ఈ ఏడాది `విశ్వంభర` సినిమాతో రాబోతున్నారు. ఇది జులైలో విడుదల కానుంది. దీంతోపాటు బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. మార్చిలో ఇది ప్రారంభం కానుంది. అలాగే శ్రీకాంత్‌ ఓడెల దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. సందీప్‌ రెడ్డి వంగా, ప్రభాస్‌ కాంబోలో వస్తున్న `స్పిరిట్‌` మూవీలో కూడా చిరంజీవి మెరుస్తారని సమాచారం.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Triptii Dimri Movies: యానిమల్ బ్యూటీ చేతిలో 5 సినిమాలు.. రెండు నేరుగా ఓటీటీలోనే!
Recommended image2
Revathi Life Story: భర్తే గొడ్రాలని అన్నాడు.. విడాకుల తర్వాత బిడ్డకు జన్మనిచ్చిన వెంకీ హీరోయిన్ కన్నీటి కథ
Recommended image3
'ఓం శాంతి శాంతి శాంతిః' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే ?
Related Stories
Recommended image1
Rajinikanth: `నరసింహ` వెనుక రహస్యం, ఇన్నాళ్లకి బయటపెట్టిన సూపర్‌స్టార్‌ కూతురు.. నరసింహ 2 అప్‌ డేట్‌
Recommended image2
Ramya Krishnan: కృష్ణవంశీకి భార్యగా కాదు, నాకు ఇలా ఉండటమే ఇష్టం.. రమ్యకృష్ణ బోల్డ్ స్టేట్‌మెంట్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved