- Home
- Entertainment
- ఎస్పీ చరణ్ మూడో పెళ్లి..? సోనియా అగర్వాల్‌తో ఫోటో వైరల్.. షాకిచ్చిన సింగర్.. హాట్ టాపిక్
ఎస్పీ చరణ్ మూడో పెళ్లి..? సోనియా అగర్వాల్‌తో ఫోటో వైరల్.. షాకిచ్చిన సింగర్.. హాట్ టాపిక్
గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం తనయుడు ఎస్పీ చరణ్ మరోసారి పెళ్లి చేసుకోబోతున్న వార్తలు ఊపందుకున్నాయి. ఆయన మాజీ హీరోయిన్‌ని వివాహం చేసుకోవడానికి రెడీ అయినట్టు సోషల్ మీడియాలో వార్తలు ఊపందుకున్నాయి.

ఎస్పీ బాలు తనయుడు ఎస్పీ చరణ్ గాయకుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా రాణిస్తున్నారు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకునేందుకు తపిస్తున్నాయి. వరుస షోలు నిర్వహిస్తూ, పాటలు పాడుతూ అలరిస్తున్నారు. తెలుగులో ఈటీవీలో `పాడుతా తీయగా` పాటల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తమిళంలోనూ పలు షోస్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా ఆయన ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. బ్రేకింగ్ లాంటి వార్తతో ఆయన మీడియాలో హాట్ టాపిక్ కావడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎస్పీ చరణ్ మళ్లీ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారట. అంతేకాదు ఏకంగా ఓ హీరోయిన్‌ని వివాహం చేసుకునేందుకు రెడీ కావడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది.
ఎస్పీ చరణ్.. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకోగా, ఇప్పుడు మూడో పెళ్లికి రెడీ అయ్యాడని, `7/జి బృందావన కాలనీ` ఫేమ్ నటి సోనియా అగర్వాల్‌ని ఆయన మ్యారేజ్ చేసుకునేందుకు రెడీ అయినట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. సోనియా అగర్వాల్‌తో క్లోజ్‌గా ఎస్పీ చరణ్ దిగిన ఫోటో సైతం వైరల్ అవుతుంది. ఇందులో ఎస్పీ చరణ్.. సోనియా అగర్వాల్‌పై చేయి వేసి, ఇద్దరు చాలా క్లోజ్‌గా ఉన్నారీ ఫోటోలు. అంతేకాదు `కొత్తగా ఏదో జరగబోతుంది` అని పోస్ట్ పెట్టారు. దీంతో రూమర్స్ ఊపందుకున్నాయి.
ఇది చూసిన నెటిజన్లు కంగ్రాచ్యూలేషన్స్ చెబుతున్నారు. చరణ్ మూడో పెళ్లికి ఆల్ ది బెస్ట్ అని, సోనియాకి రెండో పెళ్లికి ఆల్ ది బెస్ట్ అంటున్నారు. వారి ఫోటోలనువైరల్ చేస్తున్నారు. దీంతో విషయం గ్రహించిన ఎస్పీ చరణ్ దీనికి కౌంటర్‌గా మరో ఫోటోని పంచుకున్నారు. ఇందులో చరణ్‌తోపాటు సోనియా అగర్వాల్, అంజలి, పక్కన మరో నటుడు ఉన్నారు. కొత్తగా వెబ్ సిరీస్ లాంచ్ చేయబోతున్నట్టు తెలిపారు. ఆ వార్తలకు ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు.
కానీ నెటిజన్లు మాత్రం ఆగడం లేదు. లాజిక్కులకు పదును పెడుతున్నారు. పక్కన హీరోయిన్ అంజలి ఉండగా, మీ ఇద్దరి ఫోటోనే ఎందుకు పోస్ట్ చేసినట్టు అని ప్రశ్నిస్తున్నారు. అంజలి, పక్కన మరో వ్యక్తి విడివిడిగా ఉన్నారు, మీరు మాత్రం అంత క్లోజ్‌గా ఉన్నారేంటి? అంటూ ప్రశ్నలు సందిస్తున్నారు. ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. చూడబోతుంటే వెబ్ సిరీస్ పేరుతో పరోక్షంగా ఎస్పీ చరణ్ తాను మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాననే సంకేతాలను ఈ రూపంలో ఇచ్చారా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఏదేమైనా చరణ్ ఇప్పుడు వార్తల్లో నిలవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
ఇదిలా ఉంటే ఎస్పీ బాలసుబ్రమణ్యం 2020 సెప్టెంబర్‌లో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన నెల రోజులకుపైగా కరోనాతో పోరాడి, దాన్నుంచి కోలుకుని, ఊపిరితిత్తులు ఇన్‌ఫెక్షన్‌తో కన్నుమూశారు. సంగీత ప్రియులను శోకసంద్రంలో ముంచెత్తారు. ఆ తర్వాత తండ్రి బాటలో ముందుకు సాగుతున్నారు చరణ్.
మరోవైపు `7/జి బృందావన కాలనీ` చిత్రంతో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది సోనియా అగర్వాల్. ఆమె వరుస ఆఫర్లతో మంచి విజయాలు అందుకున్నాయి. అప్పట్లో క్రేజీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. తమిళంలో బిజీ హీరోయిన్ అయ్యింది. ఈ క్రమంలో ఆమె `7/జి బృందావన కాలనీ` డైరెక్టర్ సెల్వరాఘవన్ ప్రేమలో పడింది. ఇద్దరు 2006లో పెళ్లి చేసుకున్నారు.నాలుగేండ్లకే విడిపోయారు. అప్పట్నుంచి ఒంటరిగానే ఉంటుంది సోనియా.
ఇటీవల ఆమె మళ్లీ పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు ఊపందుకున్నాయి. దీంతో ఆమె చేసుకోబోయేది ఎస్పీ చరణ్ నేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఇదిలా ఉంటే ఇటీవల చిత్ర పరిశ్రమలో సెలబ్రిటీలు బ్రేకప్ వార్తలు, సీక్రెట్ పెళ్లిళ్లు, లవ్ మ్యారేజ్ వార్తలు తరచూ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.