MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఎస్పీ బాలు హీరోగా రిజెక్ట్ చేసిన మూవీ ఏంటో తెలుసా? బ్లాక్‌ బస్టర్‌ మిస్‌.. గాన గంధర్వుడి గురించి తెలియని విషయాలు

ఎస్పీ బాలు హీరోగా రిజెక్ట్ చేసిన మూవీ ఏంటో తెలుసా? బ్లాక్‌ బస్టర్‌ మిస్‌.. గాన గంధర్వుడి గురించి తెలియని విషయాలు

లెజెండరీ సింగర్‌ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం 79వ జయంతి నేడు. ఆయన గురించి కొన్నిఅరుదైన విషయాలు ఇక్కడ చూడండి.

2 Min read
Author : Aithagoni Raju
Published : Jun 04 2025, 10:19 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఎస్పీ బాలసుబ్రమణ్యం గురించి అరుదైన విషయాలు
Image Credit : Google

ఎస్పీ బాలసుబ్రమణ్యం గురించి అరుదైన విషయాలు

గాన గంధర్వుడు ఎస్పీ బాలు తన అద్భుతమైన గాత్రంతో యావత్‌ భారత శ్రోతలను అలరించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ వంటి అనేక భాషల్లోనూ పాటలు పాడి మెప్పించారు. 

దాదాపు మూడు, నాలుగు తరాలను ఆయన తన గాత్రంతో అలరించారు. ఇప్పటికీ ఆయన పాటలు ఇప్పటి తరం, రాబోయే తరాన్ని కూడా అలరిస్తూనే ఉన్నాయి. 

దాదాపు ఐదున్నదశాబ్దాల పాటలు తన గొంతుతో మాయ చేసిన ఎస్పీ బాలసుబ్రమణ్యం 79వ జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం. హీరోగా ఛాన్స్ ని మిస్‌ చేసుకున్న విషయం ఏంటో చూద్దాం. 

25
ఇంజనీరింగ్‌ చేయాలని పేరెంట్స్ ఒత్తిడి, ఎస్పీబీ ఏం చేశాడంటే?
Image Credit : Google

ఇంజనీరింగ్‌ చేయాలని పేరెంట్స్ ఒత్తిడి, ఎస్పీబీ ఏం చేశాడంటే?

* ఎస్పీబాలు.. సంపమూర్తి - శకుంతల దంపతులకు 1946 జూన్‌ 4న జన్మించారు. ఆయనకు ఇద్దరు సోదరులు, ఐదుగురు సోదరీమణులు. ఆయన చెల్లెలు శైలజ కూడా ఐదు వేలకు పైగా పాటలు పాడారు.

* చిన్నప్పటి నుంచే గాయకుడు కావాలని బాలు కోరిక. కానీ, ఆయన తల్లిదండ్రులు ఇంజనీర్ కావాలని అనుకున్నారు. చివరికి సంగీతమే గెలిచింది. బాలు చేసిన పనికి వాళ్లు ఒప్పుకోక తప్పలేదు.

* ఎస్పీ బాలు తొలినాళ్లలో ఒక సంగీత బృందం నడిపారు. ఆ బృందంలో ఇళయరాజా, గంగా అమరన్ కూడా ఉన్నారు.

Related Articles

Related image1
చిన్మయి సింగర్‌గా బ్యాన్ చేయడానికి కారణమేంటి? ఆ స్టార్‌ రైటర్‌తో గొడవే కారణమా?
Related image2
నారా రోహిత్‌ మిస్‌ చేసుకున్న 100 కోట్ల మూవీ ఏంటో తెలుసా? పడితే పాన్‌ ఇండియా స్టారే
35
కర్ణాటక సంగీతం తెలియకపోయినా `శంకరాభరణం`తో సంచలనం
Image Credit : Google

కర్ణాటక సంగీతం తెలియకపోయినా `శంకరాభరణం`తో సంచలనం

* 1979లో వచ్చిన `శంకరాభరణం` సినిమాలోని పాటలన్నీ కర్ణాటక సంగీతాన్ని పోలి ఉన్నాయి. ఎస్పీ బాలు కర్ణాటక సంగీతం నేర్చుకోకపోయినా, `శంకరాభరణం` పాటలు అద్భుతంగా పాడారు. ఈ సినిమాకు ఆయనకు జాతీయ అవార్డు వచ్చింది.

* రజనీకాంత్, ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ, శోభన్‌ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌ ఇలా సీనియర్లనుంచి, ఆ తర్వాత తరం, మూడో తరం, నాల్గో తరం హీరోలకు కూడా ఆయన పాటలు పాడారు. ఎస్పీబీ పాడిన పాటలు చాలావరకు విజయవంతమయ్యాయి.

* గాయని జానకి ద్వారా ఎస్పీబీకి సినిమాల్లో పాడే అవకాశం వచ్చింది. ఆ తర్వాత వెనక్కి తిరిగిచూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఓ రకంగా సంగీత ప్రపంచాన్ని ఆయన శాసించారు.

45
ఇళయరాజా - ఎస్పీబీ బెస్ట్ కాంబినేషన్‌
Image Credit : our own

ఇళయరాజా - ఎస్పీబీ బెస్ట్ కాంబినేషన్‌

* 1983లో వచ్చిన `సాగరసంగమం` సినిమాకు ఇళయరాజా సంగీతం అందించగా, ఎస్పీబీ పాటలు పాడారు. ఈ సినిమాకు ఇద్దరికీ జాతీయ అవార్డులు వచ్చాయి.

* 1988లో వచ్చిన `రుద్రవీణ` సినిమాకు కూడా వీరిద్దరికీ జాతీయ అవార్డులు వచ్చాయి.

* 40 వేలకు పైగా పాటలు పాడిన ఎస్పీబీ, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించారు.

55
హీరో ఛాన్స్ ని రిజెక్ట్ చేసిన బాలు
Image Credit : our own

హీరో ఛాన్స్ ని రిజెక్ట్ చేసిన బాలు

* ఆరు సార్లు ఉత్తమ గాయకుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు ఎస్పీ బాలు.

* భారతీరాజా దర్శకత్వం వహించిన `ముతల్‌ మర్యాదల్‌` సినిమాలో మొదట హీరోగా ఎస్పీబీని అనుకున్నారు. కానీ, ఆ పాత్ర తనకు సరిపోదని చెప్పి తిరస్కరించారు బాలు. ఆ తర్వాత శివాజీ గణేషన్ హీరోగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. 

ఆ తర్వాత కొన్ని సినిమాల్లో ప్రధాన పాత్రల్లో,  కీలక పాత్రల్లో నటించినా, హీరోగా మాత్రం మంచి ఛాన్స్ ని మిస్‌ చేసుకున్నారు బాలు.  ఒకవేళ ఆ మూవీ చేసి ఉంటే హీరోగా బిజీ అయ్యేవారేమో. మనం బాలులోని మరో కోణాన్ని చూసేవాళ్లం.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Ustaad Bhagat Singh Business: పవన్‌ కళ్యాణ్‌ `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` కలెక్షన్ల టార్గెట్‌.. `ఓజీ` జోరు మిస్‌ అయ్యిందా?
Recommended image2
ఒక్క హీరో, ఆరుగురు హీరోయిన్లతో లవ్ ఎఫైర్.. ఎవరిని ఎక్కువగా ప్రేమించాడో తెలుసా ?
Recommended image3
Golmaal 5: గోల్‌మాల్ 5లో భారీ ట్విస్ట్! అజయ్ దేవగణ్ సినిమాలో ఆ కొత్త హీరోయిన్ ఎవరు?
Related Stories
Recommended image1
చిన్మయి సింగర్‌గా బ్యాన్ చేయడానికి కారణమేంటి? ఆ స్టార్‌ రైటర్‌తో గొడవే కారణమా?
Recommended image2
నారా రోహిత్‌ మిస్‌ చేసుకున్న 100 కోట్ల మూవీ ఏంటో తెలుసా? పడితే పాన్‌ ఇండియా స్టారే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved