MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • Karthika Deepam: శౌర్య చెంప పగలగొట్టిన సౌందర్య.. వారణాసి ఎంట్రీ.. ముసలి వంటలక్క ఎంట్రీ?

Karthika Deepam: శౌర్య చెంప పగలగొట్టిన సౌందర్య.. వారణాసి ఎంట్రీ.. ముసలి వంటలక్క ఎంట్రీ?

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్, కుటుంబ కథా నేపథ్యంతో కొనసాగుతూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు ఆగస్ట్ 13వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం...  

3 Min read
Author : Navya G
Published : Aug 13 2022, 08:09 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... ప్రేమ్, శౌర్య దగ్గరికి వచ్చి ఎక్కడికి వెళ్తున్నావ్ హిమా?   సారీ ఎందుకు? అని అడుగుతాడు. అప్పుడు శౌర్య గుడికి బయలుదేరుమని నానమ్మ కట్టుకోమంటుంది. ఈ పెళ్లిని ఆపడానికి ఆలోచిస్తా అన్నావు ఏమైంది బావ? అని హిమా అడగగ, ప్రేమ్ మనసులో, అసలు నువ్వే నన్ను పెళ్లి చేసుకుంటే ఇక్కడి పెళ్లి ఆగిపోద్ది కదా! కానీ నువ్వు ఆ వీడియో చూసినా కూడా సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు అని మనసులో అనుకుంటాడు. నా దగ్గర ఒక బ్రహ్మాండమైన ఆలోచన ఉంది హిమా అని అంటాడు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఒకవేళ అది తేడా కొడితే అని హిమా అనగా అప్పుడు బ్రహ్మాస్త్రం వాడడమే అని ప్రేమ్ అంటాడు. ఈ లోగ సౌందర్య అక్కడికి వచ్చి గుడికి బయలుదేరాలి అని చెప్పాను కదా వెళ్లి తయారవు అని తిడుతుంది. ఆ తర్వాత సీన్లో సౌర్యా చీర కట్టుకొని గుడికి తయారవుతుంది. ఈలోగా ఆనందరావు అక్కడికి వచ్చి శౌర్య నీ పొగుడుతూ ఉంటాడ. శౌర్య అప్పుడు, నాకు పొగడ్తలు నచ్చవు తాతయ్య అని అంటుంది. అప్పుడు ఆనందరావు నువ్వు చీర కట్టుకొని ఇలా ఉంటే ఆటో నడుపుతున్నావని ఎవరూ అనుకోరు. అవును ఇంతకీ ఆటో నీ జీవితంలోకి ఎలా వచ్చింది అని అడగగా శౌర్య గతంలో జరిగిన సంఘటన చెబుతుంది.
 

37

గతంలో ఒకరోజు శౌర్య చిన్నప్పుడు రోడ్డుమీద నడుస్తూ ఉండగా వారణాసి అక్కడికి వస్తాడు. అప్పుడు సౌర్య వారణాసి నీ నిన్ను ఎవరు పంపించారు వారణాసి అని అనగా ఆనందరావు గారు పంపించారు అంటే నాతో మాట్లాడటం మానేస్తాది అని మనసులో అనుకొని నువ్వు మీ అమ్మానాన్నల కోసం ఎలా వెతకడానికి వచ్చావో నేను మా అక్క బావల కోసం అలాగే వెతకడానికి వచ్చాను. వాళ్లకి ఆ ప్రమాదం జరిగింది శవాలు కూడా లేవు అంటే నాకు ఎక్కడో చిన్న ఆశ తో వాళ్ళని వెతకడానికి వచ్చాను. ప్రతిరోజు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాను. ఎక్కడైనా వాళ్ళు ఉన్నారేమో అని అంటాడు.
 

47

అప్పుడు శౌర్య, నువ్వు నా గురించి ఎక్కడున్నావు? ఏంటి? అని అడగను అంటే నేను నీతో పాటు హాస్పిటల్ కి వస్తాను అని అంటుంది. అప్పుడు వారణాసి, వద్దు నేనే నా గుండెలు పట్టుకొని అన్ని చూస్తున్నాను నువ్వు తట్టుకోలేవు అని అనగా తీసుకెళ్ళు అని అంటుంది శౌర్య గట్టిగా.ఈ లోగా శౌర్య ఎప్పటికైనా నువ్వే నాకు ఆటో నేర్పించాలి అని అంటుంది నువ్వు అందరిని వదిలి ఆటో నేర్చుకోవడం ఏంటమ్మా అని అనగా గట్టిగా తిట్టి నువ్వు నాకు ఆటో నేర్పిస్తున్నావు అంతే అని అంటుంది. దాని తర్వాత సౌర్య వారణాసి హాస్పిటల్ కి వెళ్తారు. అక్కడ మార్చురీ గదిలోని వాళ్ల శవాలు దొరకవు అప్పుడు శౌర్య బయటకి వచ్చి ఇక్కడ అమ్మానాన్నలు లేరంటే ఎక్కడో బతికే ఉన్నారని కదా అర్థం.
 

57

ఇక్కడే ఉంటారా? ఈ ఊర్లోనే ఉంటారా? అని అంటుంది. త్వరగా నా కళ్ళు ముందు కనిపించండి అని బాధపడుతూ ఉంటుంది. సౌర్య ఇలా జరిగిందంతా ఆనందరావు చెబుతుంది. అప్పుడు ఆనందరావు కొంచెం వెనక్కి వెళ్లి నువ్వు ఏమీ అనను అంటే నేను నీకు ఒక విషయం చెప్తాను వారణాసిని నేనే నీ దగ్గరికి పంపించాను అని అంటాడు. శౌర్య కోపంతో అయితే చిన్నప్పటి నుంచే మీరు నన్ను మోసం చేయడం మొదలు పెట్టారా అని అనగా సౌందర్య వచ్చి సౌర్యని గట్టిగా కొడుతుంది. చిన్నప్పుడే నేను నిన్ను కాలు మీద పడి వేడుకున్నాను ఇంటికి రమ్మని చెప్పాను. కానీ నువ్వే వద్దన్నావు ఇప్పుడు మోసం చేస్తున్నాము అంటున్నావా అని అనగా ఇప్పుడు కొట్టినట్టు చిన్నప్పుడు కూడా నన్ను కొట్టి అలాగే ఇంటికి తీసుకెళ్తే నేను ఇక్కడ చదువుకొని అమ్మ ఆశ నిరవెర్చి కలెక్టర్ అయ్యేదాన్ని కదా నానమ్మ అని అంటుంది.
 

67

అప్పుడు హిమ నాకు నీ బాధ అర్థం అవుతుంది శౌర్య అని అంటుంది.ఇక్కడ జరిగింది చాలు గుడికి త్వరగా బయలుదేరండి ఎవరైనా రాను అని అంటే చెంప పగులుద్ది అని సౌందర్య అంటుంది. గుడికి బయలుదేరేముందు కిందున్న అమ్మానాన్న ఫోటోలు దండం పెట్టుకో అని అంటుంది సౌందర్య. ఈలోగా హాల్లో కార్తీక్ దీపాల ఫోటోలకు ఎవరో దండలు తీసేస్తారు. కిందకు వెళ్లి వీళ్ళు దండం పెట్టుకున్నప్పుడు ఈ దండలు ఏమయ్యాయి అని సౌందర్య అడుగుతుంది. ఈలోగా స్వప్న ఫోన్ చేసి బయలుదేరండి అని అంటుంది అందరూ బయలుదేరుతారు. తర్వాత సీన్ లో నిరుపమ్ హిమగురించి ఆలోచిస్తూ హిమ చివరి వరకు ప్రయత్నిస్తు నా మనసు మార్చాలని ఏమైనా చూస్తుందా? అసలు ఏం జరుగుతుంది నాకు భయమేస్తుంది అని అనుకోగా ప్రేమ్ అక్కడికి వస్తాడు.
 

77

అప్పుడు ప్రేమ్ మనసులో,ఇప్పుడు వీడికి కనపడితే ఎందుకు అలాగున్నావేంటి అని అడుగుతాడు వెళ్లిపోవడం బెస్ట్ అని వెళ్ళిపోతున్న సమయంలో నిరూపం వచ్చి ఏమైంది అని అడగగా హెడేక్ అని అంటాడు.టాబ్లెట్ ఏమైనా కావాలా అంటే లేదు మనసులో ఒక చిన్న బాధ తగ్గిపోద్దిలే అని అంటాడు ప్రేమ్ అప్పుడు నిరులమ్ ,పెళ్లి అయ్యేక అందరం కూర్చుని నీ సమస్య గురించి చర్చిద్దాము అని అంటాడు. నీ పెళ్ళే నాకు సమస్య అని నీకు ఎలా చెప్పాలి రా అని మనసులో అనుకుంటూ ఉంటాడు ప్రేమ్. ఈలోగా నిరూపమ్ కి హిమ ఫోన్ చేస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. ఎపిసోడ్ చివరిలో ఒక హాస్పటల్ గదిలో నుంచి జరిగిన కార్ ప్రమాదం అంతా గుర్తుతెచ్చుకుంటూ "డాక్టర్ బాబు" అని దీప నిద్రలో నుంచి లెగడం చూపిస్తారు.తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!!

About the Author

NG
Navya G
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Netflix Top 10 Movies: నెట్‌ఫ్లిక్స్‌లో దుమ్మురేపుతున్న టాప్ 10 సినిమాలు.. సూర్య, తాప్సి, వరుణ్ తేజ్ హవా
Recommended image2
Chiranjeevi: రూ.25000 పెట్టలేం, స్టార్ ని పక్కన పెట్టి చిరంజీవితో మూవీ..నిర్మాతకు తెలియకుండానే సూపర్ హిట్
Recommended image3
Epic 5 Days Collections: ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్యకి పెద్ద షాక్‌.. దారుణంగా పడిపోయిన ఎపిక్‌ కలెక్షన్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved