- Home
- Entertainment
- Karthika deepam: మా అమ్మనాన్న తిరిగొస్తారు.. వంటలక్క, డాక్టర్ బాబు కోసం ఎదురుచూస్తున్న శౌర్య!
Karthika deepam: మా అమ్మనాన్న తిరిగొస్తారు.. వంటలక్క, డాక్టర్ బాబు కోసం ఎదురుచూస్తున్న శౌర్య!
Karthika deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్,కుటుంబ కథా నేపథ్యంతో కొనసాగుతూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు ఆగస్ట్ 11వ తేదీన ఏం జరుగుతుందో తెలుసుకుందాం...

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.... స్వప్న సత్యం దగ్గరికి వెళ్లి నన్ను క్షమించండి. ఈ మాట నేను చాలా ఏళ్ళ ముందే అడగాల్సింది తప్పు చేశాను అని అంటుంది. అప్పుడు సత్యం, ఇప్పటికైనా నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు కాకపోతే చాలా ఏళ్ల అయిపోయింది. అయినా నీకు ఒక నిజం చెప్పాలి నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిత్య విషయంలో నా తప్పేమీ లేదు, తను నన్ను ఇష్టపడింది కానీ నేను తనని ఎప్పుడు ఇష్టపడలేదు.మా ఇద్దరి మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమే.
కొన్ని విషయాలకు రుజువు చేయాల్సిన అవసరం ఉండదు. మనసుతో నమ్మాలి అంతే అని అంటాడు సత్యం. నేను నమ్ముతున్నాను అని స్వప్న అంటుంది. దాని తర్వాత సీన్లో,సౌర్య కూర్చొని ఉంటుంది. అప్పుడు నిరూపం వెనకాతల నుంచి సౌర్య కళ్ళు కప్పుతాడు.ఎవరు అని ఆటపాటిస్తాడు ,అప్పుడు శౌర్య డాక్టర్ సాబ్ అని అంటుంది. అంత కరెక్ట్ గా ఎలా చెప్పావు? నేను రావడం చూసావా? అంటే ఇది కూడా చెప్పలేనా అని అంటుంది శౌర్య . దాని తర్వాత శౌర్య,శోభ విషయంలో మీకు సహాయం చేసినందుకు వచ్చి థాంక్స్ అని చెప్పి నటిస్తారు అనుకున్నాను.
చెప్పలేదు బతికించారు అని అంటుంది. అప్పుడు నిరుపమ్, చెప్పడం మర్చిపోయాను ఆ విషయంలో నాకు సహాయం చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు అని చెప్పి సౌర్య చేయి పట్టుకుంటాడు. శౌర్య ఆ చేతిని తీసి లేని ప్రేమలో నటించొద్దు. మీరు సంతోషంగానే ఉన్నారు కదా మీ పెళ్లి విషయంలో,ఇంక నన్ను వదిలేస్తే నాకు మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సీన్లో నైల్ పోలీస్ పెట్టుకుంటూ ఉంటుంది శౌర్య. అంతట్లో స్వప్న, సౌర్య దగ్గరకు వచ్చి గోరింటాకు పెడతాను మంచి మొగుడు వస్తాడు అని అంటుంది.
అప్పుడు సౌర్య అరుస్తూ నాకు మంచి మొగుడు అవసరం లేదు,హిమకు వస్తున్నాడు కదా మంచి మొగుడు.నాకు అవసరం లేదు, ఇన్నాళ్లు లేనిది కొత్తగా నామీద ఎవరు ప్రేమ చూపాల్సిన అవసరం లేదు అని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇలా ఎందుకు తయారవుతుంది శౌర్య అని ఇంట్లో వాళ్ళందరూ బాధపడుతూ ఉంటారు. ఆ తర్వాత సీన్లో బ్యాంక్ ఆఫీసర్లు ఏవో లెక్కలు వేసి అప్పు తీసుకుని తిరిగి కట్టకపోగా,నోటీస్ కి జవాబులు ఇవ్వలేదు కనుక మీ ఇంటిని మేము తీసుకుంటున్నాము.
అలాగే మీ హాస్పిటల్ కూడా సీజ్ చేస్తున్నాము అని చెప్పి శోభ సంతకం తీసుకుంటారు. శోభ కోపంతో రగిలిపోయి సౌర్యా!! అని గట్టిగా అరుస్తుంది. ఆ తర్వాత శౌర్య వాళ్ళ ఇంటి గార్డెన్ లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. ఈ లోగా సౌందర్య అక్కడికి వచ్చి అందరూ ఒక దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ఇంకో దగ్గర ఉంటున్నావు? అసలు ఎందుకు మమ్మల్ని నీ సొంత వాళ్ళలా చూడలేకపోతున్నావు అందరితో కలు అని అన్నప్పుడు,శౌర్య, కొత్తగా మీరు ఎవరూ లేని ప్రేమ నా దగ్గర చూపించాల్సిన అవసరం లేదు.
మీ అందరికీ హిమ అంటేనే ఇష్టము. చిన్నప్పుడు నేను తప్పిపోయినప్పుడు నన్ను వెతకడానికి కూడా మీరు రాలేదు. ఇప్పుడు నేను జ్వాల కాదు శౌర్య అని తెలిసిన వెంటనే ఎక్కడా లేని ప్రేమని చూపిస్తున్నారు. అవేవీ నాకు అవసరం లేదు. చిన్నప్పుడు నేను వెళ్లిపోయినప్పుడు కనీసం నన్ను వెతకడానికి కూడా మీరు ప్రయత్నించలేదు. ప్రయత్నిస్తే వెతకనంత దూరం యేమినేని ఎగిరిపోలేదు. వెతికితే దొరికే అంత దగ్గరలోనే ఉన్నాను మీరు కనీసం ప్రయత్నం కూడా చేయలేదు అని అంటుంది. అప్పుడు గతంలో జరిగిన ఒక సందర్భాన్ని గుర్తు తెచ్చుకుంటుంది.
అక్కడ శౌర్య చిన్నప్పుడు వాళ్ళ పిన్ని బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఒక్కతే కూర్చొని ఉంటుంది. అప్పుడు సౌందర్య కారులో అలా వెళ్తుండగా సౌర్యను చూసి ఆపి సౌర్య ఎలా ఉన్నావు? అని ఏడుస్తుంది. అప్పుడు శౌర్య మీరు ఇక్కడికి రావద్దు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఎందుకు వచ్చారు? మీకు నాకన్నా హిమే ఎక్కువ.అమ్మానాన్నలు ఎప్పుడైనా వస్తారు అని నాకు నమ్మకం ఉన్నది. నేను వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఇక్కడ ఉంటున్నాను దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని అంటుంది. సౌందర్య, ఇంటికి రా శౌర్య కాలు పట్టుకుంటాను అని అనగా శౌర్య,హిమ ఉన్న ఇంటికి నేను రాను నేను ఇక్కడే ఉంటాను.
దయచేసి నన్ను వదిలేయండి అని అరుస్తుంది. అప్పుడు సౌందర్య తన పర్సు తీసుకొచ్చి శౌర్యకి డబ్బులు ఇస్తుంది. అప్పుడు శౌర్య, నాకు మీరు వద్దు, మీ ప్రేమ వద్దు మీ డబ్బులు అంతకన్నా వద్దు. ఇప్పుడు ఈ డబ్బు తీసుకెళ్తే, మీరు ఇక్కడికి వచ్చారని, మా పిన్ని బాబాయ్ నన్ను మీకు అప్పజెప్పేస్తారు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని వేడుకుంటుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది తరువాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!!