- Home
- Entertainment
- Anchor Sowmya Rao: తండ్రి అంటే ఇష్టం లేదు, ఓ పెద్ద హీరో నా ఫోన్ నంబర్ తీసుకున్నారు.. యాంకర్ సౌమ్యరావు
Anchor Sowmya Rao: తండ్రి అంటే ఇష్టం లేదు, ఓ పెద్ద హీరో నా ఫోన్ నంబర్ తీసుకున్నారు.. యాంకర్ సౌమ్యరావు
యాంకర్ సౌమ్యరావు టాలీవుడ్ లో ఉన్న సిండికేట్ గురించి, వివక్ష గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా ఆమె టాలీవుడ్ ఓ పెద్ద హీరో గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

జబర్దస్త్ యాంకర్ గా సౌమ్యరావు
టాలీవుడ్ లో బ్యూటిఫుల్ ఫిమేల్ యాంకర్స్ లో సౌమ్యరావు ఒకరు. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చినప్పటికీ జబర్దస్త్ లాంటి షోలతో బాగా పాపులారిటీ సొంతం చేసుకుంది. సౌమ్యరావు బుల్లితెరపై సీరియల్స్ లో కూడా నటించారు. జబర్దస్త్ నుంచి అనసూయ ఎగ్జిట్ తర్వాత ఆ అవకాశం సౌమ్య రావుకి దక్కింది. ఆ ఛాన్స్ ని సౌమ్య రావు చాలా చక్కగా వినియోగించుకున్నారు.
అవకాశాలు రావడం లేదు
ఆమె గ్లామర్ తో యువతని కూడా ఆకర్షించింది. అయితే గ్లామర్ విషయంలో సౌమ్య రావు ఎప్పుడూ హద్దులు దాటలేదు. ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ గురించి, ఇండస్ట్రీ గురించి సౌమ్య రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరిన్ని అవకాశాలు వస్తే తెలుగు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయాలి అని నాకు ఉంది. కానీ అవకాశాలు రావడం లేదు. దేవుడు వరమిచ్చినా పూజారి ఇవ్వడు అన్నట్లు.. మనకు అవకాశాలు వచ్చినా.. కొందరు రానివ్వరు అని సౌమ్యరావు అన్నారు.
టాలీవుడ్ లో సిండికేట్ ఉంది
ఉదయభాను అక్క చెప్పినట్లు ఇక్కడ పెద్ద సిండికేట్ నడుస్తోంది అంటూ సౌమ్యరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ పెద్ద హీరో మీ ఫోన్ నంబర్ అడిగి తీసుకున్నారట నిజమేనా అని యాంకర్ అడగగా.. సౌమ్యరావు సిగ్గుపడిపోయారు. నిజమే నా నంబర్ తీసుకున్నారు. కానీ అవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్పండి అని అన్నారు. ఆ హీరో ఎవరో చెప్పొచ్చు కదా అని అంటే.. వాళ్ళు పెద్దవాళ్ళు, నాకు భయం అంటూ సౌమ్యరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సెకండ్ లీడ్ గా నటించకూడదు
సీరియల్స్ లో నటించేటప్పుడు వివక్ష ఎదుర్కొన్నాను. నాకు ఎక్కువగా సెకండ్ లీడ్, నెగిటివ్ రోల్స్ వచ్చేవి. సెకండ్ లీడ్ లో నటిస్తే అంతగా పట్టించుకోరు. ఇలాంటి పాత్రలు జీవితంలో చేయకూడదు అని నిర్ణయించుకున్నాను. అంతలా విసిగించారు అంటూ సౌమ్యరావు పేర్కొన్నారు.
మా నాన్న గురించి మాట్లాడకపోవడమే బెటర్
తన ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ నేను కర్ణాటకలో షిమోగా ప్రాంతంలోని చిన్న ఊరి నుంచి వచ్చాను. మీ నాన్న ఏం చేస్తుంటారు అని అడిగితే.. ఆయన గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఆయన గురించి మాట్లాడితే నన్ను అందరూ విలన్ లా చూస్తారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. మంచి తండ్రి దొరకడం అనేది అదృష్టం. తనకి ఆ అదృష్టం లేదు అని సౌమ్యరావు అన్నారు.

