బాలీవుడ్‌కి నో చెప్పిన సౌత్ స్టార్స్ ఎవరో తెలుసా?
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది టాలెంటెడ్ యాక్టర్స్ ఉన్నారు. వీరికి బాలీవుడ్ నుంచి భారీ ఆఫర్లు వచ్చినా.. సౌత్ సినిమాను వదిలి వెళ్ళడానికి ఇష్టపడలేదు. బాలీవుడ్ ఆఫర్లకు నో చెప్పిన సౌత్ స్టార్స్ ఎవరో తెలుసా?

అనుష్క శెట్టి
ఈ లిస్ట్ లో ముుందుంది అనుష్క శెట్టి. (Anushka Shetty). బాహుబలి, అరుంధతి వంటి సినిమాల్లో అద్భుత నటనతో పేరు తెచ్చుకున్న ఈ టాలీవుడ్ బ్యూటీకి బాలీవుడ్ నుండి అనేక అవకాశాలు వచ్చాయి. కానీ, వాటిని తిరస్కరించి తెలుగు, తమిళ సినిమాల్లోనే కొనసాగుతుంది అనుష్క. బాలీవుడ్ పై ఆసక్తి లేదని, దక్షిణాది సినిమాలే ఇష్టమని ఆమె పలు సందర్భాల్లో అన్నది.
సౌత్ స్టార్ హీరో కార్తికి కూడా బాలీవుడ్‌లో చాలా అవకాశాలు వచ్చాయి. నటనతో పాటు మంచి మనిషిగా పేరుంది కార్తీకి. కాని ఆయన బాలీవుడ్ కు వెళ్ళడానికి ఇష్టపడలేదు. తమిళంతో పాటు తెలుగులో నటించడానికి తాను సిద్దంగా ఉన్నానని. బాలీవుడ్ కు వెళ్ళే ఆలోచన లేదన్నారు కార్తి.
నటి నిత్యామీనన్
నిత్యా మీనన్(Nithya Menen) బాలీవుడ్ అవకాశాలు వచ్చినా, దక్షిణాది సినిమాల్లోనే సంతోషంగా ఉన్నానని, ఇక్కడే వైవిధ్యమైన పాత్రలు చేయగలనని, ప్రాంతీయ సినిమాలే ఇష్టమని చెప్పారు.
సూర్య(Suriya)కి బాలీవుడ్ నుండి అవకాశాలు వచ్చినా, దక్షిణాది సినిమాలకే పరిమితమయ్యారు. తనకు నచ్చిన సినిమాల్లోనే నటిస్తానని చెప్పారు. కాని ఇప్పుడిప్పుడే బాలీవుడ్ వైపు ఆయన వెళ్తున్నట్టు తెలుస్తోంది.
చియాన్ విక్రమ్(chiyaan vikram):బాలీవుడ్ ఆఫర్‌లను తీసుకోకుండా, తమిళ సినిమాల్లోనే సంతోషంగా ఉన్నానని, ఇక్కడే సృజనాత్మక స్వేచ్ఛ ఉందని చెప్పారు. అందుకే బాలీవుడ్ వైపు చూడలేదు స్టార్ హీరో.