- Home
- Entertainment
- South India movie shootings in Ukraine: ట్రిపుల్ ఆర్ సహా ఉక్రెయిన్ లో మన సినిమాల షూటింగ్స్...
South India movie shootings in Ukraine: ట్రిపుల్ ఆర్ సహా ఉక్రెయిన్ లో మన సినిమాల షూటింగ్స్...
ప్రస్తుతం రష్యా దాడులతో విలవిలలాడుతున్న ఉక్రేయిన్ మనకు తెలుసు. కాని మన సినిమాల షూటింగ్స్ కోసం అక్కడికి వెళ్ళేంత అందమైన దేశం ఉక్రేయిన్ అని ఎంత మందికి తెలుసు. అవును మన ట్రిపుల్ ఆర్ తో సహా చాలా సినిమాల షూటింగ్స్ అక్కడ జరిగాయి.

యుద్ధమేఘాలు కమ్ముకుని ఉన్న ఉక్రేయిన్ లో ప్రజలంతా బిక్కు బిక్కుమని బ్రతుకుతున్నారు. ఈ దేశం చాలా అందమైన దేశం.. ఎన్నో అద్భతమైన లొకేషన్లున్న దేశం. ముఖ్యంగా ఉక్రేయిన్ రాజధాని కైప్ తో పాటు మరి కొన్ని నగరాలు సినిమా షూటింగ్ లకు చాలా అనుగుణంగా ఉంటాయి. అక్కడ ఎన్నో అద్భుతమైన, అందమైన ప్రదేశాలు ఉన్నాయి.
ఉక్రెయిన్ లో ఎప్పట్నుంచో హాలీవుడ్ సినిమాలు షూట్ చేస్తున్నాయి. చాలా హాలీవుడ్ సినిమాలు యుక్రెయిన్ లో షూటింగ్స్ జరుపుకున్నాయి. ఇంకా జరుపుకుంటున్నాయి. అక్కడ ఉన్న లొకేషన్స్, మంచు కురిసే ప్రదేశాలు, ఖాళీ మైదానాలు, సముద్ర తీరాలు, ఆయన్స్ ను మెస్మరైజ్ చేస్తాయి. అంతే కాదు తక్కువ ఖర్చుతో షూటింగ్ చేసుకునే వెసులుబాటు ఆధారంగా చేసుకొని చాలా మంది షూటింగ్స్ ఇక్కడ నిర్వహించడానికి ఇష్టపడుతున్నారు.
మన సినిమాలు ఈ మధ్య చాలా వరకూ ఉక్రేయిన్ లోనే షూటింగ్స్ చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు దేశం మొత్తం ఎదురు చూస్తున్న ట్రిపుల్ ఆర్ సినిమా కూడా యుక్రెయిన్ లో షూటింగ్ జరుపుకుంది. గతంలో ట్రిపుల్ ఆర్ టీమ లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ కి వెళ్తున్నట్టు ట్వీట్ చేశారు. భారత స్వాతంత్ర్య సమరయోధులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజుకు సంబంధించిన కల్పిత పాత్రల షూటింగ్ అక్కడే జరిగింది. ఇంకా ఇక్కడ ట్రిపుల్ ఆర్ మేజర్ షూటింగ్ జరిగినట్టు తెలుస్తోంది.
ఇప్పటికే చాలా ఇండియన్ సినిమాలు ఉక్రేయిన్ లో షూటింగ్ కోసం వెంపర్లాడుతున్నాయి కొన్ని షూటింగ్స్ జరిగిపోయాయి కూడా. ఇండియన్ సినిమాలు ముఖ్యంగా మన తెలుగు సినిమాలు ఉక్రేయిన్ లొకేషన్స్ కోసం ఉత్సాహం చూపిస్తున్నాయి. అయితే అక్కడ షూటింగ్ జరుపుకున్న తొలి భారతీయ సినిమా మాత్రం మన తెలుగు సినిమానే. సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన విన్నర్. ఈ సినిమాలోని కొన్ని పాటలని యుక్రెయిన్ లో షూట్ చేశారు.
మన తెలుగు సినిమాలే కాదు తమిళ సినిమాల షూటింగ్స్ కూడా ఉక్రేయిన్ లో జరుగుతున్నాయి. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వం లో వచ్చిన రోబో 2.0 కూడా యుక్రెయిన్ లో షూటింగ్ జరుపుకుంది. అసలే శంకర్ సినిమాలు అంటే దేశ విదేశాల్లో ఎక్కువగా షూటింగ్స్ చేస్తుంటారు. అందమైన లొకేషన్లు వెతికి మరీ శంకర్ సాంగ్స్ ను చిత్రీకరిస్తారు. ఇక ఈ సినిమాలో కూడా ఒక పాటని ఉక్రెయిన్ లోనే షూట్ చేశారు.
అంతే కాదు తమిళంలో నుంచి మరికొన్ని సినిమాలు షూటింగ్ ఈ దేశంలోను అందమైన లొకేషన్స్ లో జరిగాయి. సూర్యతమ్ముడు కార్తీ హీరోగా నటించిన దేవ్ సినిమాలో చాలా సన్నివేశాలని, పాటలని యుక్రెయిన్ లో షూట్ చేశారు. ఇక్కడి అందమైన లొకేషన్లలో.. కార్తీ,. రకుల్ ప్రీత్ సింగ్ మధ్య పాటల అదరగొట్టారు. కాని ఈ సినిమా వర్కౌట్ అవ్వలేదు కార్తీకి.
ఆస్కార్ అవార్డు గ్రహీత.. స్టార్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్వయంగా రాసి, తీసిన 99 సాంగ్స్ షూటింగ్ అంతా కూడా ఉక్రెయిన్ లోనే జరిగింది. సూపర్ స్టార్ రజనీకాంత్, అమీ జాక్సన్ డ్యుయట్ సాంగ్ ‘రోజా కాదల్’ను ఉక్రెయిన్ లోని టన్నెల్ ఆఫ్ లవ్ వద్ద చిత్రీకరించారు. దీనికి ఏఆర్ రెహమాన్ స్వరాలు అందించారు
ఇలా ఇటీవల చాలా సినిమా యూనిట్స్ యుక్రెయిన్ వైపు ద్రుష్టి సారించాయి. అద్భుతమైన లొకేషన్స్ ఉండటంతో చిత్ర యూనిట్లు యుక్రెయిన్ వైపు పరుగులు తీస్తున్నారు. కానీ ప్రస్తుతం యుద్ద మేఘాలు చుట్టు ముట్టడంతో ఇప్పట్లో ఉక్రెయిన్ లో సినిమా షూటింగ్స్ చేసే పరిస్థితి కనపడట్లేదు.యుద్దం వల్ల ఉక్రేయిన్ లో అందమైన ప్రదేశాలు నాశనం అయ్యే ప్రమాదం ఉంది. దీంతో సినిమా రంగం వైపు నుంచి కూడా వచ్చే ఆదాయాన్ని ఉక్రెయిన్ కోల్పోనుంది. అంతే కాక అక్కడి అందమైన ప్రదేశాలని మనం చూసే అవకాశం కూడా లేకుండా పోతుంది.