MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Karthika Deepam: చారుశీలని హెల్ప్ చేయమని అడిగిన శౌర్య.. శౌర్య దగ్గరికి వెళ్తున్న పండరి, దీప?

Karthika Deepam: చారుశీలని హెల్ప్ చేయమని అడిగిన శౌర్య.. శౌర్య దగ్గరికి వెళ్తున్న పండరి, దీప?

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ మంచి రేటింగ్ తో దూసుకెళ్తుంది. ఒకటే కథతో నిత్యం ట్విస్ట్ ల మీద ట్విస్టులతో ప్రసారమవుతున్న ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు డిసెంబర్ 16వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. 

4 Min read
Author : Navya G
| Updated : Dec 16 2022, 07:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈరోజు ఎపిసోడ్ లో చారుశీల పేషెంట్లను చూస్తూ ఉండగా ఇంతలోనే సౌర్య అక్కడికి వస్తుంది. సౌర్య రావడం చూసిన చారుశీల ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇప్పుడు శౌర్య చూస్తే చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది ఎలా అయినా కార్తీక్ వచ్చేలోపు పంపించాలి అని సౌర్య దగ్గరికి వెళ్లి ఏంటి జ్వాలా ఇలా వచ్చావు అని అడగగా మీ దగ్గరికి వచ్చాను డాక్టర్ అనడంతో ఎందుకు మళ్ళీ నొప్పిగా ఉందా అని అడుగుతుంది. మీరు నాకు హెల్ప్ చేయాలి డాక్టర్ అని శౌర్య తన చేతిలో ఉన్న పోస్టర్ ని చారుశీలకు ఇస్తుంది. అప్పుడు చారుశీల ఆ పోస్టర్ ని చూసి ఆశ్చర్య పోతుంది. మా అమ్మ నాన్న కనిపించడం లేదు ఎక్కడ ఉన్నారు తెలియదు వాళ్ళు కూడా నాలాగే వెతుకుతున్నారు.

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

 మీది చాలా పెద్ద హాస్పిటల్ కదా డాక్టర్ ఈ పోస్టర్ని మీ హాస్పిటల్ లో అతికించండి ఈ పోస్టర్ ను చూస్తే మా అమ్మ వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు నన్ను కలుస్తారు అని అంటుంది శౌర్య. అప్పుడు చారుశీల మీ నాన్న ఇక్కడే ఉన్నారని నీకు ఎలా చెప్పనమ్మా అని మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడు ప్లీజ్ డాక్టర్ నాకు హెల్ప్ చేస్తారు కదా అనడంతో సరే తప్పకుండా హెల్ప్ చేస్తాను అని అబద్ధం చెబుతుంది చారుశీల. ఆ తర్వాత చారుశీల సిస్టర్ కి పోస్టర్ ఇచ్చి దానిని అతికించమని చెబుతుంది. అప్పుడు సౌర్య ఇక్కడ మాత్రమే కాదు డాక్టర్ ఊరు మొత్తం పోస్టర్లు అతికించాను అని అంటుంది. ఇంతవరకు ఎవరి ఫోన్ చేయలేదు అనగా మీ అమ్మ వాళ్ళు ఇక్కడ లేరేమో శౌర్య అనడంతో లేదు వాళ్ళు ఇక్కడే ఉన్నారు అని అంటుంది సౌర్య.
 

37

 అప్పుడు శౌర్య బాధని చూసిన కన్నీళ్లు పెట్టుకొని కార్తీక్ వచ్చేలోపు తొందరగా పంపించేయాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు చారుశీల పక్కనే ఉన్న ఒక అతన్ని  పిలిచి సౌర్య ఇంటి దగ్గర దిగిబెట్టి రమ్మని చెప్పి పంపిస్తుంది. ఆ తర్వాత సౌందర్య దీప కోసం వెతికి వెతికి నిరాశగా వస్తుంది. అప్పుడు డ్రైవర్ అంజి కనిపించారా మేడం అనడంతో లేదు అంజి అని బాధతో మాట్లాడుతుంది సౌందర్య. అంత తొందరగా దొరికితే దేవుడు ఎందుకు అవుతాడు అంజి ఇంకా మమ్మల్ని ఎన్ని కష్టాలు పెడతాడు అనుకుంటూ ఉంటుంది సౌందర్య. అప్పుడు సౌందర్య బాధను చూసిన అంజి బాధపడకండి మేడం ఎలా అయినా కార్తీక్ సార్ దీప మేడమ్ ఎదురు దొరుకుతారు అని అంటాడు.

47

 మరొకవైపు కార్తీక్ హాస్పిటల్ లో సౌర్య అతికించిన పోస్టర్ ని చూసి కన్నీళ్లు పెట్టుకుంటాడు. చూసావా చారుశీల ఈ వయసులో నా కూతురు మా కోసం ఎంతలా కష్టపడుతుందో ఇలాంటి కష్టమే ఏ తల్లి తండ్రికి రాకూడదు అని కన్నీళ్లు పెట్టుకుంటాడు కార్తీక్. నాకు కొంచెం కూడా దయ లేదు చారుశీల కళ్ళముందు కూతురు కనిపిస్తున్నా కూడా తనని కష్టపడుతున్నాను అని అంటాడు. అలా మాట్లాడకు కార్తీక్ నీకు ఎంత కష్టం ఉంటే ఇలా బిడ్డ విషయంలో ఇంత కఠినమైన నిర్ణయం తీసుకున్నావు అని అంటుంది. కఠినమైన నిర్ణయం తీసుకున్నానో లేకపోతే నేనే కఠినంగా మారానో అర్థం కావడం లేదు అని బాధపడతాడు కార్తీక్.

57

ఇక్కడ సూర్య మా కోసం వెతుకుతుంది అక్కడ దీపా శౌర్య కోసం వెతికి వెతికి అలసిపోతోంది ఏడుస్తోంది. తల్లి కూతురు ఒకరి కోసం ఒకరు ఎంతలా అరాటపడుతున్న నేను ఏమీ చేయలేకపోతున్నాను అని అంటాడు కార్తీక్. మరి చెప్పేయండి డాక్టర్ మరి ఎందుకు ఇంతలా బాధపడుతున్నారు అనగా కార్తీక్ ఆశ్చర్యపోతాడు. మీరు చెప్పకూడదు అనుకున్నారు కాబట్టి మంచి అని చెప్పడం లేదు కదా కాబట్టి మీరు ఎక్కువగా ఆలోచించి బాధపడకండి అని చారుశీల ధైర్యం చెబుతుంది. మరొకవైపు దీపకి పండరి టాబ్లెట్స్ ఇవ్వడానికి రాగా దీప దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు ఏంటి దీపమ్మ ఎప్పుడూ ఇలాగే కూర్చుని బాధపడుతూ ఉంటావు అని అడగగా నా కూతురు గురించి ఆలోచిస్తున్నాను అనగా అలా అని ఎప్పుడు ఇలాగే ఉంటే ఎలా దీపమ్మ అని అంటుంది.

67

ఇవన్నీ వద్దు నాకు నువ్వు నా కూతురిని వెతకడంలో హెల్ప్ చేయి చాలు నాకు ఆరోగ్యం బాగోలేదని డాక్టర్ బాబు నన్ను బయటికి పంపించడం లేదు నువ్వు నా కూతురు కోసం వెతుకు పండరి అని అంటుంది దీప. అప్పుడు నువ్వు రావాల్సిన అవసరం లేదు దీపమ్మ పాప ఫోటో చూపించు నేనే ఊరంతా జల్లెడ పట్టి మరి వెతుకుతాను అని అంటుంది. ఇంతలోనే దీప లోపలికి వెళ్లి సౌర్య ఫోటో తీసుకువచ్చి చూపిస్తుంది. సౌర్య ఫోటోని చూసిన పండరి పాప చాలా చక్కగా ఉంది అని అంటుంది. ఇప్పుడు పండరి వీళ్ళు నాకు తెలుసు చంద్రమ్మ ఇంద్రుడు వీళ్ళు ఈ మధ్యనే మా ఇంటికి దగ్గరలో దిగారు వీళ్ళని నేను చూశాను అని అనడంతో దీప సంతోషపడుతుంది. సరే ఫస్ట్ నువ్వు అక్కడికి తీసుకొని వెళ్ళు అని అంటుంది దీప.

77

అప్పుడు వారిద్దరు కలిసి బయలుదేరుతారు. మరొకవైపు కార్తీక్ కోసం హాస్పిటల్స్ మొత్తం వెతుకుతూ ఉంటారు సౌందర్య అంజి. ఇంతలోనే డాక్టర్స్ రావడంతో వాళ్ళను అడిగి కార్తీక్ గురించి ఎంక్వయిరీ చేస్తూ ఉంటుంది సౌందర్య. అప్పుడు మరొక హాస్పిటల్ కి వెళ్దాం రండి అని అక్కడికి వెళ్తారు. మరొకవైపు దీప పండరీ ఇద్దరు కలిసి సౌర్య దగ్గరికి వెళుతూ ఉంటారు. అప్పుడు గతంలో చంద్రుడు వాళ్ళు చేసిన పనులు అన్నీ పండరీకి చెబుతూ ఉంటుంది దీప. మరొకవైపు కార్తీక్, సౌర్య అతికించిన పోస్టర్ను చూసి బాధపడుతూ ఉంటాడు. ఇంతలోనే దీప కార్తీక్ కి ఫోన్ చేసి బాబు మన శౌర్య ఎక్కడుందో తెలిసింది అనడంతో కార్తీక్ షాక్ అవుతాడు. ఇంద్రుడు వాళ్ళ అడ్రస్ దొరికింది నేను అక్కడికే వెళ్తున్నాను ఆడంతో కార్తీక్ షాక్ అవుతాడు. అప్పుడు పండరీకి ఫోన్ ఇచ్చి అడ్రస్ చెబుతుంది అక్కడికి వచ్చేయండి అని అంటుంది.

About the Author

NG
Navya G
Latest Videos
Recommended Stories
Recommended image1
Naveen Polishetty: వందల ఆడిషన్స్ రిజెక్ట్ అయిన నవీన్‌ పొలిశెట్టి.. డబ్బుల కోసం సూపర్‌ ఐడియా
Recommended image2
Ntr Injury: అభిమానులకు షాక్‌, ఎన్టీఆర్‌ కి గాయాలు.. 8 వారాలు బెడ్‌ రెస్ట్.. ఏం జరిగిందంటే?
Recommended image3
Ram Charan Health Update: ప్రపంచంలోనే బెస్ట్ డాక్టర్స్ తో‌ రామ్‌ చరణ్‌కి ఆపరేషన్, హెల్త్ ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved