MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • Naveen Polishetty: వందల ఆడిషన్స్ రిజెక్ట్ అయిన నవీన్‌ పొలిశెట్టి.. డబ్బుల కోసం సూపర్‌ ఐడియా

Naveen Polishetty: వందల ఆడిషన్స్ రిజెక్ట్ అయిన నవీన్‌ పొలిశెట్టి.. డబ్బుల కోసం సూపర్‌ ఐడియా

నవీన్‌ పొలిశెట్టి సినిమాల్లోకి రాకముందు తాను ఎన్నో కష్టాలు పడ్డట్టు తెలిపాడు. వందల ఆడిషన్స్ రిజెక్ట్ అయ్యాడట. ఇప్పుడు స్టార్‌గా రాణిస్తున్న ఆయన డబ్బుల కోసం కొత్త లోన్‌ యాప్‌ని పరిచయం చేశాడు.

3 Min read
Author : Aithagoni Raju
Published : Jul 27 2026, 11:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా వచ్చి స్టార్‌గా నవీన్‌ పొలిశెట్టి
Image Credit : Asianet News

బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా వచ్చి స్టార్‌గా నవీన్‌ పొలిశెట్టి

నవీన్‌ పొలిశెట్టి ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా సినిమాల్లోకి వచ్చాడు. తనని తాను నిరూపించుకున్నాడు. ఇప్పుడు ఆల్మోస్ట్ స్టార్‌ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. `ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ` మూవీతో హిట్‌ కొట్టిన ఆయన ఆ తర్వాత `జాతిరత్నాలు`, `మిస్‌ శెట్టి మిస్టర్ పొలిశెట్టి`, ఇటీవల `అనగనగా ఒక రాజు` చిత్రాలతో విజయాలు అందుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాతో రాబోతున్నారు. దానికి సంబంధించిన ప్లానింగ్‌లో ఉన్నాడు. ఇంతలో సడెన్‌గా మెరిశాడు నవీన్‌. తన కష్టాలు చెప్పుకున్నాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
వందల ఆడిషన్స్ రిజెక్షన్‌
Image Credit : Asianet News

వందల ఆడిషన్స్ రిజెక్షన్‌

నవీన్‌ పొలిశెట్టి తాను సినిమాల్లోకి రావడానికి ముందు పడ్డ కష్టాన్ని వెల్లడించారు. డబ్బుల కోసం ఇబ్బందులు పడ్డాడట. `సినిమాల్లోకి ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా వచ్చాను. ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాను. వందల ఆడిషన్స్ రిజెక్ట్ అయ్యాను. కానీ ఈ రోజు సూపర్‌ హిట్‌ సినిమాలను ఇచ్చి స్టార్‌ అయ్యాను, ఇది నా స్టోరీ` అని తెలిపాడు నవీన్‌ పొలిశెట్టి. అయితే ఇప్పుడు ఆ ఇబ్బందులు అవసరం లేదు, క్రెడిట్‌ కోసం ఈజీ మార్గం ఉందని, `ఎంపాకెట్‌`ని వాడుకొని ఈజీగా మనీ పొంది మీరు కావాల్సిన అవకాశాలను అందిపుచ్చుకోవాలని, కావాల్సిన వ్యాపారాలను చేసుకోవచ్చని చెబుతున్నాడు నవీన్‌ పొలిశెట్టి.

Related Articles

Related image1
Ram Charan Health Update: ప్రపంచంలోనే బెస్ట్ డాక్టర్స్ తో‌ రామ్‌ చరణ్‌కి ఆపరేషన్, హెల్త్ ఎలా ఉందంటే?
Related image2
Ntr Injury: అభిమానులకు షాక్‌, ఎన్టీఆర్‌ కి గాయాలు.. 8 వారాలు బెడ్‌ రెస్ట్.. ఏం జరిగిందంటే?
34
వెంటనే డబ్బుల కోసం కొత్త యాప్‌ ని పరిచయం చేసిన నవీన్‌ పొలిశెట్టి
Image Credit : Asianet News

వెంటనే డబ్బుల కోసం కొత్త యాప్‌ ని పరిచయం చేసిన నవీన్‌ పొలిశెట్టి

నవీన్‌ పొలిశెట్టి యాడ్స్ చేయడం చాలా అరుదు. చాలా సెక్టీవ్‌గానే యాడ్స్ చేస్తుంటారు. తాజాగా ఆయన `ఎం పాకెట్‌`(mPokket) యాడ్‌ చేశాడు. ఇందులో తన లైఫ్‌ గురించి చెప్పారు. ఇది రెగ్యూలర్‌ ఎండార్స్ మెంట్లకు భిన్నంగా ఉండటం విశేషం. ఏదో హడావుడిగా, ఆర్టిఫీషియల్‌గా కాకుండా, తన రియల్‌ లైఫ్‌ని ఆవిష్కరిస్తూ, తన ఇన్‌స్పైరింగ్‌ జర్నీ గురించి చెబుతూ ఈ యాడ్‌ ని పరిచయం చేయడం విశేషం. ఈ లోన్‌ యాప్‌ ద్వారా క్షణాల్లో డబ్బులు పొందొచ్చు, అవసరాలు తీర్చుకోవచ్చు అని చెప్పారు. ఇతర ఫ్రాడ్ యాడ్స్ మాదిరిగా ఇది కాదనే విషయాన్ని, దీన్ని నమ్మొచ్చు అనే విషయాన్ని నవీన్‌ భరోసా ఇస్తున్నారు.

44
నవీన్‌ పొలిశెట్టి రియల్‌ లైఫ్‌కి దగ్గరగా యాప్‌
Image Credit : Asianet News

నవీన్‌ పొలిశెట్టి రియల్‌ లైఫ్‌కి దగ్గరగా యాప్‌

నటుడు నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ, `mPokket లక్ష్యం గురించి తెలుసుకున్నప్పుడు అది నాకు చాలా వ్యక్తిగతంగా అనిపించింది. ఎన్నో సంవత్సరాలు ఆడిషన్లకు వెళ్లి, మళ్లీ మళ్లీ నా ప్రతిభను నిరూపించుకోవాల్సి వచ్చింది. మనలాంటి వారి కోసం వ్యవస్థ ఎప్పుడూ అనుకూలంగా ఉండదనే విషయం నాకు ప్రత్యక్ష అనుభవం. భారతదేశంలోని చాలా మంది యువత కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వారిలో ప్రతిభ ఉంది, కష్టపడే తత్వం ఉంది, పెద్ద లక్ష్యాలు ఉన్నాయి. కానీ తదుపరి అడుగు వేయడానికి అవసరమైన క్రెడిట్ కావాల్సిన సమయంలో అవకాశాల తలుపులు వారి ముందే మూసుకుపోతాయి. ఆ పరిస్థితిని మార్చేదే mPokket. అనవసరమైన నిరూపణలు కోరకుండా, యువతకు నిజమైన అవకాశాన్ని అందిస్తుంది. ఆ ఆలోచనను నేను హృదయపూర్వకంగా విశ్వసిస్తున్నాను. అందుకే ఈ భాగస్వామ్యం నాకు ఎంతో సహజంగా అనిపించింది` అని వెల్లడించారు.

ఈజీ లోన్‌ కోసం ఎంపాకెట్‌ యాప్‌

mPokket వ్యవస్థాపకుడు, CEO గౌరవ్ జలాన్ మాట్లాడుతూ, `భారతదేశంలోని యువత ఎంతో కష్టపడి పనిచేస్తూ, మంచి ఫలితాలు సాధిస్తూ, ప్రతిరోజూ ముందుకు సాగుతున్నారు. అయినప్పటికీ, వారికి అత్యంత అవసరమైన సమయంలో క్రెడిట్ అందుబాటులో లేకపోవడం వల్ల అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఆ పరిస్థితిని మార్చాలనే లక్ష్యంతోనే mPokket‌ను ప్రారంభించాం. ఇప్పటివరకు మా ప్లాట్‌ఫారమ్ ద్వారా 65 లక్షల మంది భారతీయులు తమ జీవితంలో మొదటిసారిగా అధికారిక రుణాన్ని పొందారు. విశేషమేమిటంటే, ఈ న్యూ-టు-క్రెడిట్ (NTC) రుణగ్రహీతల్లో దాదాపు 79 శాతం మంది తమ తొలి రుణాన్ని తీసుకున్నప్పుడు 25 ఏళ్లలోపే ఉన్నారు. లక్షలాది మంది భారత యువతకు వారి ఆర్థిక గుర్తింపు ప్రారంభమైన మొదటి అడుగు mPokket ద్వారానే పడింది. నవీన్ ఎన్నో సంవత్సరాల పాటు తన ప్రతిభను నిరూపిస్తూ ముందుకు సాగినా, సినీ పరిశ్రమ ఆయనను మళ్లీ మళ్లీ తనను తాను నిరూపించుకోవాల్సిన పరిస్థితిలో ఉంచింది. ఒక వ్యక్తి సామర్థ్యానికి, ప్రపంచం అతనిపై ఉంచే నమ్మకానికి మధ్య గ్యాప్‌ని తగ్గించడానికే mPokket ఏర్పడింది. ఈ ప్రచారం కేవలం ఒక రూపకం కాదు. మేము mPokket‌ను ఎందుకు ప్రారంభించామో అత్యంత నిజాయితీగా చెప్పే కథ ఇది` అని ఆయన తెలిపారు. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan: పవన్‌ వల్లే ఉదయ్‌ కిరణ్‌ ఫోటోలు లీక్‌.. సుస్మిత ఎంగేజ్‌మెంట్‌ క్యాన్సిల్‌ వెనుక జరిగింది ఇదే
Recommended image2
Reshma Rathore: సినిమాలకు గుడ్‌ బై చెప్పి కోర్ట్ మెట్లు ఎక్కుతున్న టాలీవుడ్‌ హీరోయిన్‌.. డేరింగ్‌ స్టెప్‌
Recommended image3
Vijay Deverakonda: మందు, అమ్మాయి, బ్రేకప్‌ ఇప్పుడు పెళ్లి.. తన లైఫ్ సీక్రెట్స్ అన్నీ చెప్పేసిన రౌడీ బాయ్
Related Stories
Recommended image1
Ram Charan Health Update: ప్రపంచంలోనే బెస్ట్ డాక్టర్స్ తో‌ రామ్‌ చరణ్‌కి ఆపరేషన్, హెల్త్ ఎలా ఉందంటే?
Recommended image2
Ntr Injury: అభిమానులకు షాక్‌, ఎన్టీఆర్‌ కి గాయాలు.. 8 వారాలు బెడ్‌ రెస్ట్.. ఏం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved