- Home
- Entertainment
- Karthika Deepam: హిమకు పెళ్లి చేయాలి అనుకుంటున్న సౌందర్య.. కోపంతో రగిలిపోతున్న స్వప్న?
Karthika Deepam: హిమకు పెళ్లి చేయాలి అనుకుంటున్న సౌందర్య.. కోపంతో రగిలిపోతున్న స్వప్న?
Karthika Deepam: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం(karthika Deepam)సీరియల్ కుటుంబ కథా నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. కాగా ఈ రోజు ఏప్రిల్ 26 వ ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో హిమ మామిడితోటలో మామిడికాయలు కోయడానికి ప్రయత్నిస్తూ ఉండగా ఇంతలో అక్కడికి వచ్చిన నిరూపమ్(Nirupam) హిమ ను ఎత్తుకొని మామిడి కాయలు కోయిస్తాడు. ఇక నిరూపమ్ ని చూసిన హిమ(hima) ఆశ్చర్యపోతుంది.ఇదంతా ఒక చాటు నుంచి చూసిన స్వప్న(swapna) వీరిద్దరి ఆగడాలు రోజురోజుకూ ఎక్కువ అవుతున్నాయి అంటూ హిమ పై సీరియస్ అవుతుంది.
మరొకవైపు సౌందర్య(soundarya) ఆనందరావు లు కలిసి కారులో వెళ్తూ ఉండగా అప్పుడు ఆనందరావు(anand rao)నాకు సౌర్య దొరికినట్టు కల వచ్చింది అని చెబుతాడు. ఈ కల నిజమైతే ఎంత బాగుండు అని అనడంతో సౌందర్య కూడా అవును అని ఉంటుంది. ఇంతలోనే జ్వాలా (jwala) వెనక వైపు నుంచి వచ్చి కారుని ఢీ కొడుతుంది.
అప్పుడు సౌందర్య(soundarya) చూసుకొని నడపవచ్చు కదా అని కోప్పడుతుంది. అప్పుడు జ్వాలా(jwala) సీనియర్ సిటిజెన్ అని అనడంతో ఆనంద్ రావ్ నవ్వుతూ ఉంటాడు. అలా వారిద్దరూ కొద్దిసేపు ఫన్నీగా పోట్లాడుకుంటూ ఉంటారు.
ఆటో డ్యామేజ్ అయినందుకు ఎంత అవుతుందో చెప్పు నేను ఇస్తాను అని సౌందర్య అనగా, అప్పుడు జ్వాలా నువ్వేంటి నాకు ఇచ్చేది నీ కారు డ్యామేజ్ కీ ఎంతవుతుందో చెప్పు నేనే నీకు ఇస్తాను అని అంటుంది. అప్పుడు జ్వాలా(jwala)ని చూసి ఆనంద్ రావు(anand rao)నిన్ను చూస్తే నా మనవరాలు గుర్తుకు వస్తుంది అంటూ బాధపడతాడు.
మరొకవైపు స్వప్న (Swapna) జరిగినంతా తలుచుకుని కోపంతో రగిలిపోతూ ఉంటుంది.ఇంతలో ఆనందరావు అక్కడికి రావడంతో నా బాధ ఎవరికి చెప్పుకోవాలో, ఎవరి మీద చూపించాలో అర్థం కావడం లేదు డాడీ అని అంటుంది. ఒకవైపు ఆ జ్వాలా మరొకవైపు హిమ(hima) నా కొడుకుని మోసం చేయాలని చూస్తున్నారు.
వారి పప్పులు నా దగ్గర ఉడకవు వారి ప్లాన్ లను చిత్తుచిత్తు చేస్తాను అని కోపంగా వెళ్ళిపోతుంది స్వప్న(swapna). ఆ తరువాత జ్వాలా ఎక్కడ వున్నావే అంటు హిమ ను తలచుకొని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంతలో ఒక ఆమె వచ్చి లిఫ్ట్ అడిగి జ్వాలా(jwala)ని పరిచయం చేసుకుంటుంది. ఆ తర్వాత సౌందర్య, సౌర్య ఫొటో ని గీయించడం కోసం ఒక ఆఫీస్ కి వెళుతుంది. ఇంతలో అక్కడికి జ్వలా వస్తుంది.
సౌందర్య(soundarya) అక్కడికి ఎందుకు వచ్చిందా అని వివరాలు అడిగి తెలుసుకుంటుంది. అప్పుడు జ్వాలా అడిగిన ప్రశ్నలకు సౌందర్య సీరియస్ అవుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా సౌందర్య హిమ కి పెళ్లి చేయాలని చూస్తుంది. అంతేకాకుండా సౌర్య(sourya)చిన్నప్పటి ఫోటో ని గొప్ప ఆర్టిస్ట్ గీస్తోంది. దానిద్వారా ఎక్కడ ఉందో కనిపెట్టే వచ్చు అని అంటుంది సౌందర్య.