Karthika Deepam: ఈ భూమి మీద శౌర్య ఎక్కడున్నా వెతికి పట్టుకొస్తా.. సౌందర్య శపధం!
Karthika Deepam: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం(karthika Deepam)సీరియల్ అక్క చెల్లెలు కథా నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. కాగా ఈ రోజు ఏప్రిల్ 27వ తేదీ ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... సౌందర్య నుంచి హిమ వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంది.. మీరు అందరూ హ్యాపీగా ఉన్నారు... ఒకరు పారిపోయారు అంటూ సౌందర్య ను బాధ పెట్టేలా మాట్లాడుతుంది. ఎందుకే అంటూ తిట్టాగా సౌర్యా సౌందర్య ఇద్దరు గొడవపడుతారు.
నీ మానవరాలే నాలాంటి అమ్మాయ్ అవుతే ఏం చేస్తావ్ అంటూ సౌందర్యను ప్రశ్నించగా.. నువ్వే నా మనవరాలు అవుతే అమ్మ వెళ్ళిపో అని చెప్తా.. నిన్ను 5 నిమిషాలే భరించలేకపోతున్న అంటుంది. దీంతో శౌర్య అక్కడ నుంచి సైలెంట్ గా వెళ్ళిపోతుంది. హిమ శౌర్య కోసం వాళ్ళ ఇంట్లో ఎదురుచూస్తుంటుంది.
ఇక శౌర్య రాగానే హిమ ఎక్కడికైనా బయటకు వెళదాం అంటే వొద్దు అంటుంది.. మీ డాక్టర్ సాబ్ తో కలిసి నాగార్జున సాగర్ కు వెళ్లి వొద్దాం అంటుంది. డాక్టర్ సాబ్ వస్తాడా అనుకుంటూ శౌర్య వెళ్ళడానికి సిద్ధం అవుతుంది. హిమ, శౌర్య ఇద్దరు మాట్లాడుకొని వెళ్ళడానికి రెడీ అవుతారు.
మరోవైపు.. హిమకు శౌర్య షాక్ ఇస్తుంది. హిమ దొరికే సమయం ఆసన్నమైంది.. ఆర్టిస్ట్ కు చిన్నప్పటి పోలికలు చెప్పి ఇప్పుడు ఎలా ఉంటుందో బొమ్మ గియస్తాను అని షాక్ ఇస్తుంది. ఇక సీన్ కట్ చేస్తే ప్రేమ్ హిమ ఫోటో చూస్తూ మురిసిపోతు ఉంటాడు.. ఆ టైమ్ లోనే సత్య వచ్చి ఫోన్ లాక్కొని నిరూపమ్ కు పెళ్లి సంబంధం చూస్తుంది అంటాడు.
అవునా త్వరగా పెళ్లి చేసెయ్యమానండి డాడీ.. అంటాడు. ఇంకో సీన్ లో స్వప్న నిరూపమ్ కోసం ఫ్రాన్స్ బిర్యానీ చేశాను తిందురా అని అంటుంది.. మరోవైపు ఆలా ఎలా పెళ్లి చేస్తుంది అంటూ సౌందర్య ఫైర్ అవుతుంటుంది. నిరూపమ్ ను ఇల్లరికం తెచ్చుకోవడానికి సిద్ధం అంటూ షాక్ ఇస్తుంది.
ఆ మాటలు విన్న హిమ... నా పెళ్లి ఏంటి అని అడిగితే.. శౌర్య ఉంటేనే పెళ్లి చేసుకుంటా అని చెప్పా అంటే శౌర్య దొరికింది కదా అని అంటుంది. దీంతో శౌర్య, సౌందర్య ఇద్దరు ఒకేలా ఆలోచిస్తున్నారు అంటూ అనుకుంటుంది. అనంతరం శౌర్య ఈ భూమి మీద ఎక్కడ ఉన్న తెలుసుకొని మరీ నీకు పెళ్లి చేస్తా అంటుంది.
మరో సీన్ లో నిరూపమ్ కు ప్రాన్స్ బిర్యానీ పెట్టి కొన్ని తియ్యి తియ్యని మాటలు మాట్లాడుతుంది. అప్పుడే ప్రేమ్, సత్య గురించి మాట్లాడితే అగ్గి మీద గుగ్గిళంలా ఫైర్ అవుతుంది. ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు అంటూ సీరియస్ అవుతుంది.. వాళ్ళు ఇక్కడే ఉంటే బాగుంటుంది అనే సమయనికి ఎపిసోడ్ పూర్తవుతుంది. మరీ రేపటి భాగంలో ఏం జరుగుతుందో చూడాలి.