MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Maa Inti Bangaram 5 Days Collections: బాక్సాఫీసు వద్ద మా ఇంటి బంగారం ర్యాంపేజ్‌.. సమంత మూవీకి ఎన్నికోట్ల లాభం అంటే

Maa Inti Bangaram 5 Days Collections: బాక్సాఫీసు వద్ద మా ఇంటి బంగారం ర్యాంపేజ్‌.. సమంత మూవీకి ఎన్నికోట్ల లాభం అంటే

సమంత కమ్‌ బ్యాక్‌ ఇస్తూ నటించిన లేటెస్ట్ మూవీ `మా ఇంటి బంగారం`. ఈ చిత్రం థియేటర్లో విజయవంతంగా రన్‌ అవుతోంది. కలెక్షన్ల పరంగా దుమ్ములేపుతోంది. బాక్సాఫీస్‌ని షేక్‌ చేస్తోంది. 

3 Min read
Author : Aithagoni Raju
Published : Jun 24 2026, 07:27 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బాక్సాఫీసు వద్ద సమంత ర్యాంపేజ్‌
Image Credit : others

బాక్సాఫీసు వద్ద సమంత ర్యాంపేజ్‌

సమంత కమ్‌ బ్యాక్‌ ఇస్తూ నటించిన `మా ఇంటి బంగారం` మూవీ ఊహించని విధంగా దూసుకుపోతుంది. సినిమాకి మిక్స్‌ డ్‌ టాక్‌ వచ్చినా అదిరిపోయే కలెక్షన్లని రాబడుతోంది. ఈ మూవీ ప్రారంభం నుంచి బాక్సాఫీసు వద్ద సత్తా చాటుతోంది. ఇప్పుడు రెండో వారంలో దుమ్మురేపుతోంది. మంచి వసూళ్లతో రన్‌ అవుతుంది. సోమవారం నుంచి కలెక్షన్లు స్టడీగా ఉన్నాయి. మంగళవారం కూడా డీసెంట్‌ నెంబర్స్ రావడం విశేషం. మరి ఐదు రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ఇప్పటి వరకు ఎంత కలెక్షన్లు వచ్చాయి? ఇంకా ఎంత రావాలి అనేది చూస్తే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మా ఇంటి బంగారం మూవీ ఐదు రోజుల కలెక్షన్లు
Image Credit : Asianet News

మా ఇంటి బంగారం మూవీ ఐదు రోజుల కలెక్షన్లు

సమంత హీరోగా నటించిన `మా ఇంటి బంగారం` ఐదు రోజుల్లో రూ.51.32కోట్లు రాబట్టినట్టు ప్రముఖ కలెక్షన్ల సైట్‌ `సాక్నిల్క్` వెల్లడించింది. దీనికి మంగళవారం మూడున్నర కోట్లు రావడం విశేషం. సోమవారం రూ.4.10కోట్లు రాగా, మంగళవారం అరవై లక్షలు తగ్గాయి. ఆదివారం పది కోట్లు వసూలు చేయగా, సోమవారానికి 60శాతం పడిపోయింది. కానీ ఈ స్థాయిలో వసూళ్లు రావడం విశేషమనే చెప్పాలి. ఇది సినిమా సక్సెస్‌కి నిదర్శనంగా నిలుస్తోంది.

35
రెండో వారంలోనూ అదిరిపోయే వసూళ్లు
Image Credit : Asianet News

రెండో వారంలోనూ అదిరిపోయే వసూళ్లు

`మా ఇంటి బంగారం` మూవీకి మొదటి రోజు రూ.5.35కోట్లు, రెండో రోజు రూ.7.65కోట్లు, మూడో రోజు రూ.10.10కోట్లు వచ్చాయి. మొదటి మూడు రోజుల్లో క్రమంగా కలెక్షన్లు పెరిగాయి. మౌత్‌ టాక్‌తో సినిమాకి పాజిటివిటీ పెరిగింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. దీంతో వాళ్లు సినిమా చూసేందుకు ఆసక్తి చూపిస్తుంది. ఇది సినిమా సక్సెస్ కి కారణమైందని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ఈ మూవీకి నాలుగు రోజుల్లో రూ.50కోట్లు కలెక్ట్ చేసినట్టు టీమ్‌ వెల్లడించింది. ఐదు రోజుల్లో రూ.55కోట్ల పోస్టర్‌ని రిలీజ్‌ చేయనున్నారు.

45
సమంత మూవీకి లాభాల పంట
Image Credit : Asianet News

సమంత మూవీకి లాభాల పంట

సమంత మూడేళ్ల తర్వాత కమ్‌ బ్యాక్‌ ఇచ్చిన `మా ఇంటి బంగారం` మూవీతో బ్లాక్‌ బస్టర్ దిశగా వెళ్తోంది. ఈ మూవీకి సుమారు రూ.30కోట్ల బడ్జెట్‌ అయ్యిందని సమాచారం. ఓటీటీ రైట్స్, శాటిలైట్‌ రైట్స్, ఆడియో రైట్స్ రూపంలో రూ.35కోట్లు వచ్చాయట. దీంతో రిలీజ్‌కి ముందే సినిమా ప్రాఫిట్‌లో ఉంది. ఇక థియేట్రికల్‌ బిజినెస్‌ విషయానికి వస్తే సొంతంగానే రిలీజ్‌ చేశారు. కాకపోతే రూ.30కోట్ల బిజినెస్‌గా లెక్క కట్టినట్టు సమాచారం. ఈ లెక్కన ఈ మూవీకి ఇప్పటికే సుమారు రూ.27కోట్ల షేర్‌ సాధించింది. ఈ వారం కొత్తగా వచ్చే సినిమాలేవి లేవు, వచ్చే వారం కూడా పోటీ లేదు. దీంతో ఈ రెండు వారాలు `మా ఇంటి బంగారం`కి తిరుగులేదు. ఓవరాల్‌గా ఈ సినిమా రూ.70-80కోట్ల వరకు వసూలు చేసే అవకాశం ఉంది. ఇది సమంత కెరీర్లోనే అత్యధికమని చెప్పొచ్చు. అదే సమయంలో ఈ సినిమా ద్వారా సమంత ఏకంగా రూ.30-40కోట్ల లాభాలు గడించే అవకాశం ఉంది. ఇది ఓ రకంగా రికార్డుగా చెప్పొచ్చు. ఇటీవల కాలంలో స్థాయిలో ఒక సినిమా లాభాలను గడించడం చాలా అరుదు. `మన శంకర వర ప్రసాద్‌` మూవీకి మంచి లాభాలు వచ్చాయి. ఆ తర్వాత `మా ఇంటి బంగారం` మూవీ నిలుస్తుందని చెప్పొచ్చు.

55
ఒక అనాథ అమ్మాయి ఫ్యామిలీ కోసం పోరాటం
Image Credit : Asianet News

ఒక అనాథ అమ్మాయి ఫ్యామిలీ కోసం పోరాటం

నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సమంతతోపాటు కన్నడ నటులు గుల్షన్‌ దేవయ్య, దిగంత్‌ అలాగే శ్రీముఖి, మంజుష, గౌతమి, చైతన్య కృష్ణ, వెన్నెల కిశోర్‌ వంటి వారు కీలకపాత్రలు పోషించారు. ఇందులో సమంంత అనాథ. చిన్నప్పుడు అనేక ఇబ్బందులు పడుతుంది. ఎంతో స్ట్రగుల్స్ అనంతరం తిరుగుబాటు చేస్తుంది. అడవిలోకి వెళ్లి తుపాకులు పడుతుంది. అక్కడ కూడా తనకు మోసమే జరుగుతుంది. దీంతో అడవిలోనూ తిరుగుబాటు చేసి మళ్లీ సాధారణ లైఫ్‌ స్టార్ట్ చేస్తుంది. ఒక పెద్దింటి అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని హ్యాపీగా లైఫ్‌ని లీడ్‌ చేస్తున్న క్రమంలో మళ్లీ తన గతం వెంటాడుతుంటుంది. దాని వల్ల ఫ్యామిలీకి ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో కుటుంబం కోసం సమంత చేసిన పోరాటమే ఈ మూవీ. నటన పరంగా సమంత ఇరగదీసింది. ఇన్నోసెంట్‌గా నవ్వులు పూయించింది. యాక్షన్‌తో మైండ్‌ బ్లాక్ చేసింది. మొత్తంగా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టింది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
సమంత రూత్ ప్రభు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image2
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image3
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Related Stories
Recommended image1
Maa Inti Bangaram Review: మా ఇంటి బంగారం మూవీ రివ్యూ.. సమంత కమ్‌ బ్యాక్‌ ఫిల్మ్ ఎలా ఉందంటే?
Recommended image2
Raj Nidimoru: మా ఇద్దరి మధ్య భలే సింక్ కుదిరింది, సమంతపై రాజ్ నిడిమోరు ప్రశంసలు.. ఆమె సెల్ఫ్‌ మేడ్‌ యాక్టర్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved