MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Klin Kaara: రామ్‌ చరణ్‌ పేరు మర్చిపోయిన క్లీంకార.. వార్నింగ్‌ ఇచ్చినా వదలని చిరంజీవి మనవరాలు

Klin Kaara: రామ్‌ చరణ్‌ పేరు మర్చిపోయిన క్లీంకార.. వార్నింగ్‌ ఇచ్చినా వదలని చిరంజీవి మనవరాలు

రామ్‌ చరణ్‌ `పెద్ది` సినిమాలో నటించిన నేపథ్యంలో ఇప్పుడు అంతా తన ఒరిజినల్‌ నేమ్‌ని మర్చిపోతున్నారని, తన కూతురు క్లీంకారనే పేరు మర్చిపోయి `పెద్ది` అని పిలుస్తుందని తెలిపారు చరణ్‌. 

3 Min read
Author : Aithagoni Raju
Published : Jun 24 2026, 08:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పెద్ది మూవీ బ్లాక్‌ బస్టర్‌ ఈవెంట్‌
Image Credit : Asianet News

పెద్ది మూవీ బ్లాక్‌ బస్టర్‌ ఈవెంట్‌

రామ్‌ చరణ్‌ ఇటీవల `పెద్ది` సినిమాలో నటించిన విషయం తెలిసిందే. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటించగా, జగపతిబాబు, శివరాజ్‌ కుమార్‌ కీలక పాత్రలు పోషించారు. వెంకట్‌ సతీష్‌ కిలారు నిర్మించిన ఈ చిత్రం జూన్‌ 4న విడుదలై బాక్సాఫీసు వద్ద విజయం సాధించింది. టాక్‌ తో సంబంధం లేకుండా మంచి వసూళ్లని రాబట్టింది. దీంతో మంగళవారం పెద్ది మూవీ బ్లాక్‌ బస్టర్ ఈవెంట్‌ని నిర్వహించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రామ్‌ చరణ్‌ పేరు మర్చిపోయిన క్లీంకార
Image Credit : upasanakaminenikonidela

రామ్‌ చరణ్‌ పేరు మర్చిపోయిన క్లీంకార

ఈ సందర్భంగా రామ్‌ చరణ్‌ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఇప్పుడు జనాలు అంతా తనని పెద్ది అనే పిలుస్తున్నారని, రామ్‌ చరణ్‌ అనే పేరుని మర్చిపోయారని తెలిపారు. తన ఇంట్లోనే ఇలాంటి సంఘటన చోటు చేసుకుందని, తన కూతురు క్లీంకార కూడా తనని పెద్ది అనే పిలుస్తుందని చెప్పారు. `బయటే కాదు ఇంట్లో కూడా నా పేరుని మర్చిపోయారు. మా బుడ్డది క్లీంకార.. `పెద్ది`కి ముందు నాన్న నాన్న అని పిలిచేది. కానీ పెద్ది చూశాక.. `ఏయ్‌ పెద్ది` అని పిలుస్తోంది. తప్పు అమ్మ.. నాన్నని అలా పిలవొద్దు అని చెప్పినా వినడం లేదు. అంతగా తన పాత్రని అందరు హోన్‌ చేసుకున్నారు` అని తెలిపారు రామ్‌ చరణ్‌.

Related Articles

Related image1
Chiranjeevi: రామ్‌ చరణ్‌ న్యూ ఏజ్‌ మెగాస్టార్‌.. చిరంజీవి సంచలన స్టేట్‌మెంట్‌, జాతీయ అవార్డుపై సెటైర్లు
Related image2
RC17: మీరు ఎంతైనా ఊహించుకోండి, రామ్‌ చరణ్‌తో మూవీపై అంచనాలు పెంచిన సుకుమార్‌.. అదిరిపోయే హింట్‌
35
పెద్ది జీవితాంతం నా గుండెల్లో దాచుకునే జ్ఞాపకం
Image Credit : Asianet News

పెద్ది జీవితాంతం నా గుండెల్లో దాచుకునే జ్ఞాపకం

ఆయన ఇంకా మాట్లాడుతూ, `కొన్ని విజయాలు మనల్ని ఆనందపరుస్తాయి. కొన్ని విజయాల గురించి ఆలోచిస్తే మనసుకు చాలా తృప్తిని ఇస్తాయి. `పెద్ది` విజయం మాత్రం నా జీవితాన్నే మార్చేసింది. పెద్ది లాంటి అనుభూతి నాకు ఇంతకుముందు ఎప్పుడూ రాలేదు. అలాంటి గొప్ప అనుభూతిని ప్రేక్షకులు నాకు అందించారు. ఈ సినిమా ద్వారా నా గుండెల్లో జీవితాంతం దాచుకునే జ్ఞాపకాన్ని ఇచ్చారు. అందుకే ముందుగా మీ అందరికీ థాంక్యూ. నేను సోషల్ మీడియాలో రీల్స్ చూస్తుంటే చాలా కొత్త ఆడియన్స్ థియేటర్లకు వచ్చినట్లు అనిపించింది. చిన్న పిల్లలు ‘మస్సా మస్సా’ పాటకు డ్యాన్స్ చేస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. పేరెంట్స్ ఎంత నమ్మకం పెడితే తమ పిల్లలను కూడా థియేటర్లకు తీసుకొస్తారో అది ఈ సినిమా ద్వారా తెలిసింది. అది బుచ్చిబాబు చేసిన ప్రయత్నానికి దక్కిన గొప్ప గౌరవం. చిన్నవాళ్లతో పాటు పెద్దవాళ్లు కూడా లుంగీలు కట్టుకుని, తెల్ల జుట్టుతో డ్యాన్స్ చేస్తూ కనిపించడం నాకు చాలా కొత్త అనుభూతిని ఇచ్చింది. మళ్లీ ఇలాంటి అనుభూతి వస్తుందో లేదో తెలియదు. ఈ సినిమాను మీరు ఎంతగా ఆదరించారంటే, రామ్ చరణ్‌ను మర్చిపోయి పెద్దినే గుర్తుపెట్టుకుంటారేమో అనిపిస్తోంది. ఇంత అందమైన జ్ఞాపకాన్ని ఇచ్చిన బుచ్చిబాబుకు చాలా థాంక్స్.

45
సుకుమార్‌ నాకు గురువులాంటివారు
Image Credit : Asianet News

సుకుమార్‌ నాకు గురువులాంటివారు

సుకుమార్ గారు నా ఫేవరెట్ పర్సన్. నా జీవితంలో ఎప్పుడైనా చిన్న డౌన్ మూమెంట్ వచ్చినా, నాన్నగారి తర్వాత నేను ఫస్ట్ ఫోన్ చేసే వ్యక్తి సుకుమార్ గారే. ఆయన లెక్చరర్‌గా ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దారు. నన్ను కూడా ఒక స్టూడెంట్‌లా చూసి గైడ్ చేయాలని నేను ఎప్పుడూ అడుగుతుంటాను. నిర్మాత సతీష్ గారు పెద్ది సినిమాకు ఒక బలమైన పిల్లర్‌లా నిలబడ్డారు. తొలి సినిమాకే నాకు ఇంత సపోర్ట్ ఇచ్చి, ఎక్కడా రాజీ పడకుండా నిలిచిన ఆయనకు ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. రత్నవేలు గారు ఈ సినిమాకు అద్భుతమైన విజువల్స్ అందించారు. ఆయన సినిమాటోగ్రఫీ నిజంగా మాస్టర్‌పీస్. రెహమాన్ గారు తన సంగీతంతో ఈ సినిమాకు ప్రాణం పోశారు. అలాగే మా టీమ్‌లోని డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌తో పాటు అన్ని విభాగాల్లో పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు.

55
ఒక్కసారి ప్రేమిస్తే చనిపోయేంత వరకు ప్రేమిస్తూనే ఉంటారు
Image Credit : Asianet News

ఒక్కసారి ప్రేమిస్తే చనిపోయేంత వరకు ప్రేమిస్తూనే ఉంటారు

ఠాగూర్ సినిమాలో ఒక డైలాగ్ గుర్తొస్తోంది. ‘తెలుగు ప్రేక్షకులు అంత ఈజీగా ఎవరినీ ఇష్టపడరు. ఒకసారి ఇష్టపడితే చనిపోయే వరకు ప్రేమిస్తూనే ఉంటారు.’ అదే ప్రేమను మీరు పెద్దిపై చూపించారు. ప్రేక్షకులు ఈ సినిమాను తమ సినిమాగా భావించి తమ భుజాలపై మోసుకుని ఘన విజయాన్ని ఇచ్చారు. ఈ సినిమాలోని మంచిని గుర్తించి ఆదరించిన ప్రతి ప్రేక్షక దేవుడికి నా సెల్యూట్. ఈ సినిమాకు రివ్యూలు ఇచ్చిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. జాన్వీ కపూర్‌కు, అలాగే ఈ సినిమాలో అద్భుతమైన పాట చేసిన  శ్రుతి హాసన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు` అని తెలిపారు రామ్‌ చరణ్‌. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు, సినిమాటోగ్రఫీ మంత్రులకు ఆయన థ్యాంక్స్ చెప్పారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
రామ్ చరణ్ కొణిదెల
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Maa Inti Bangaram 5 Days Collections: బాక్సాఫీసు వద్ద సమంత ర్యాంపేజ్‌.. 5 రోజుల్లో మా ఇంటి బంగారంకి అదిరిపోయే వసూళ్లు
Recommended image2
RC17: మీరు ఎంతైనా ఊహించుకోండి, రామ్‌ చరణ్‌తో మూవీపై అంచనాలు పెంచిన సుకుమార్‌.. అదిరిపోయే హింట్‌
Recommended image3
Chiranjeevi: రామ్‌ చరణ్‌ న్యూ ఏజ్‌ మెగాస్టార్‌.. చిరంజీవి సంచలన స్టేట్‌మెంట్‌, జాతీయ అవార్డుపై సెటైర్లు
Related Stories
Recommended image1
Chiranjeevi: రామ్‌ చరణ్‌ న్యూ ఏజ్‌ మెగాస్టార్‌.. చిరంజీవి సంచలన స్టేట్‌మెంట్‌, జాతీయ అవార్డుపై సెటైర్లు
Recommended image2
RC17: మీరు ఎంతైనా ఊహించుకోండి, రామ్‌ చరణ్‌తో మూవీపై అంచనాలు పెంచిన సుకుమార్‌.. అదిరిపోయే హింట్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved