- Home
- Entertainment
- సౌందర్య ఇండస్ట్రీలోకి రావడానికి కారణం ఎవరో తెలుసా? సీక్రెట్ చెప్పిన అలనాటి అందాల తార.. రేర్ వీడియో వైరల్
సౌందర్య ఇండస్ట్రీలోకి రావడానికి కారణం ఎవరో తెలుసా? సీక్రెట్ చెప్పిన అలనాటి అందాల తార.. రేర్ వీడియో వైరల్
సౌందర్య టాలీవుడ్‌కి పరిచయం కావడానికి ప్రధానంగా ఓ వ్యక్తి కారణమట. ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పిన వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

సౌందర్య.. అద్భుతమైన నటి. అందానికి అందం, అభినయంతో ఇండియన్ సినిమాని దశాబ్దంపాటు అలరించింది. తెలుగులో తిరుగులేని స్టార్ హీరోయిన్‌గా రాణించింది. ఓ రకంగా ఆమె లేడీ సూపర్ స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. ఆమె నటించిన మహిళా ప్రధాన చిత్రాలు హీరోలకు దీటుగా ఆడాయంటే అతిశయోక్తి కాదు. సహజ నటిగా నిలిచిన సౌందర్య.. హఠాన్మరణం పెద్ద షాక్ అనే చెప్పాలి. 2004లో ఆమె ఎన్నికల ప్రచార నిమిత్తం ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆమె కన్నుమూశారు.
ఆమె చనిపోయి దాదాపు 19ఏళ్లు అవుతుంది. సౌందర్య తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆమె తెలుగులో అత్యధిక సినిమాలు చేసింది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీలోనూ సినిమాలు చేశారు. కన్నడకి చెందిన సౌందర్య.. తెలుగు తర్వాత ఎక్కువగా కన్నడలో నటించింది. టాలీవుడ్‌లో ఆమె హీరోల స్థాయి ఇమేజ్‌తో రాణించింది. ఓ వెలుగు వెలిగింది.
అయితే సౌందర్య టాలీవుడ్‌కి పరిచయం కావడానికి ప్రధానంగా ఓ వ్యక్తి కారణమట. ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పిన వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అతని వల్లే తాను సినిమా పరిశ్రమలో ఉన్నానని, ఈ స్థాయికి చేరుకున్నానని సౌందర్య చెప్పింది. ఈ వీడియో క్లిప్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
మరి సౌందర్య చెప్పిన ఆ వ్యక్తి ఎవరంటే.. ప్రముఖ రైటర్, నిర్మాత త్రిపురనేని మహారథి. ఆయన అనేక బ్లాక్ బస్టర్ చిత్రాలకు కథ అందివ్వడంతోపాటు స్క్రీన్‌ప్లే, డైలాగ్‌లు అందించారు. అలా ఆయన రైటర్‌గా పనిచేసినవాటిలో `అల్లూరి సీతారామరాజు`తోపాటు `కంచుకోట`, `రణభేరి`, `సింహాసనం`, `దేవుడు చేసిన మనుషులు`, `బందిపోటు`, `దేశోద్దారకుడు`, `పాడి పంటలు`, `కురుక్షేత్రం`, `ప్రజారాజ్యం`, `శాంతి సందేశం` వంటి దాదాపు రెండు వందల చిత్రాలకు ఆయన పనిచేశారు. ఎక్కువగా ఆయన సూపర్‌స్టార్ కృష్ణ సినిమాలకు వర్క్ చేశారు. అప్పట్లో గొప్ప రైటర్‌గా పేరుతెచ్చుకున్నారు.
దీంతోపాటు ఆయన `దేశమంటే మనుషులోయ్`, `బోగిమంటలు`, `రైతు భారతం`, `మంచిని పెంచాలి` అనే సినిమాలను నిర్మించారు. ఇందులో `రైతు భారతం` సినిమాతో సౌందర్య టాలీవుడ్‌కి పరిచయం అయ్యిందట. అయితే తనకు మొదటి ఛాన్స్ ఇచ్చింది మాత్రం త్రిపురనేని మహారథి అని, ఆయన నిర్మించిన `రైతు భారతం` సినిమాతోనే టాలీవుడ్‌కి పరిచయం అయ్యానని సౌందర్య ఈ వైరల్ వీడియోలో తెలిపింది. ఆ సినిమా ఫస్ట్ రిలీజ్ కాకపోయినా, అదే తన మొదటి సినిమా అని, ఆయన వల్లే తాను ఈ ఇండస్ట్రీలో ఉన్నానని ఇందులో సౌందర్య వెల్లడించింది. ఆయనకు ధన్యవాదాలు తెలిపింది.
1972లో జన్మించిన సౌందర్య.. 1993లో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. రిలీజ్ పరంగా `మనవరాలి పెళ్లి` ఆమె తొలి చిత్రం. తర్వాత `రాజేంద్రుడు గజేంద్రుడు`, `మాయలోడు`, `అల్లరి ప్రేమికుడు`, `మేడం`, `పెదరాయుడు`, `భలే బుల్లోడు`, `అమ్మోరు`, `ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు`, `పవిత్రబంధం`, `అంతపురం`, `రాజా`, `చూడాలని వుంది`, `శ్రీ రాములయ్య`, `అన్నయ్య`, `రవన్న`, `అజాద్`, `దేవి పుత్రుడు`, `ఎదురులేని మనిషి, `సీతయ్య`, `స్వేతనాగు` వంటి చిత్రాలు చేసింది. చివరగా ఆమె `శివశంకర్` చిత్రంలో నటించారు. `నర్తనశాల` లేట్‌గా రిలీజ్ అయ్యింది.