- Home
- Entertainment
- అది చూసి మహేష్ బాబుతో ఎప్పటికీ నటించను అని చెప్పేసిన సౌందర్య, ఇద్దరి కాంబోలో మిస్సైన మూవీ ఏంటంటే
అది చూసి మహేష్ బాబుతో ఎప్పటికీ నటించను అని చెప్పేసిన సౌందర్య, ఇద్దరి కాంబోలో మిస్సైన మూవీ ఏంటంటే
Mahesh babu and Soundarya : మహేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా అనేక చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణించారు. చిన్నతనంలోనే మహేష్ బాబులో స్టార్ హీరో లక్షణాలు కనిపించేవట. షూటింగ్ లో మహేష్ బాబు చాలా యాక్టివ్ గా ఉండేవారు. మహేష్ బాబు సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం రాజకుమారుడు.

Mahesh Babu
మహేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా అనేక చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణించారు. చిన్నతనంలోనే మహేష్ బాబులో స్టార్ హీరో లక్షణాలు కనిపించేవట. షూటింగ్ లో మహేష్ బాబు చాలా యాక్టివ్ గా ఉండేవారు. మహేష్ బాబు సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం రాజకుమారుడు. ప్రీతీ జింతా, మహేష్ జంటగా నటించిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది.
రాఘవేంద్ర రావు దర్శకత్వంలో మహేష్ బాబు ఇండస్ట్రీకి సోలో హీరోగా పరిచయం అయ్యారు. తొలి చిత్రమే సూపర్ హిట్ కావడంతో మహేష్ రెండవ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. మహేష్ బాబు సెకండ్ మూవీ వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ చిత్రానికి యువరాజు అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్లు అవసరం. ఒక హీరోయిన్ పాత్రకి సాక్షి శివానంద్ ఫైనల్ అయింది.
మరొక హీరోయిన్ పాత్ర కోసం కాస్త అనుభవం ఉన్న హీరోయిన్లని పరిశీలిస్తున్నారు. ముందుగా సౌందర్య అయితే పర్ఫెక్ట్ అని అనుకున్నారట. వైవిఎస్ చౌదరి సౌందర్యకి వెళ్లి కథ చెప్పారు. సూపర్ స్టార్ కృష్ణ తనయుడి రెండవ చిత్రం కావడంతో సౌందర్య కూడా చాలా ఎగ్జైట్ అయ్యారట. వెంటనే ఆమె ఈ ప్రాజెక్ట్ కి ఒకే చెప్పారు.
Yuvaraju
దీనితో మహేష్, సౌందర్య ఇద్దరితో వైవిఎస్ చౌదరి టెస్ట్ లుక్ షూట్ ప్రారంభించారు. టెస్ట్ షూట్ లో మహేష్ పక్కనని తనని చూసుకోగానే సౌందర్యకి ఏమాత్రం నచ్చలేదు. ఎలా చూసినా తాను మహేష్ పక్కన హీరోయిన్ గా అనిపించడం లేదు అని ఫీల్ అయ్యారట. మహేష్ బాగా స్లిమ్ గా ఉండడంతో తాను అతడికి అక్కలా ఉన్నానని సౌందర్య తెలిపారు. మహేష్ కి నేను హీరోయిన్ గా సెట్ కాను. నటించిన తర్వాత డ్యామేజ్ జరగడం కంటే ముందే జాగ్రత్త పడడం బెటర్ అని సౌందర్య యువరాజు చిత్రం నుంచి తప్పుకున్నారు. వయసులో కూడా మహేష్ బాబు కంటే 3 ఏళ్ళు సౌందర్య పెద్దవారు.
Yuvaraju
ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ లోకి సిమ్రాన్ వచ్చింది. సిమ్రాన్ పేరును సిఫారసు చేసింది కూడా సౌందర్యనే అట. ఆ విధంగా మహేష్, సౌందర్య కాంబోలో సినిమా మిస్ అయింది. సూపర్ స్టార్ కృష్ణతో మాత్రం సౌందర్య అమ్మదొంగ, నంబర్ వన్ లాంటి చిత్రాల్లో నటించింది.