- Home
- Entertainment
- Rajinikanth: `నరసింహ` వెనుక రహస్యం, ఇన్నాళ్లకి బయటపెట్టిన సూపర్‌స్టార్ కూతురు.. నరసింహ 2 అప్ డేట్
Rajinikanth: `నరసింహ` వెనుక రహస్యం, ఇన్నాళ్లకి బయటపెట్టిన సూపర్‌స్టార్ కూతురు.. నరసింహ 2 అప్ డేట్
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన `నరసంహ` మూవీకి సంబంధించిన ఒక రహస్యాన్ని ఆయన కూతురు సౌందర్య వెల్లడించారు. అంతేకాదు `నరసింహ 2` మూవీ అప్ డేట్ కూడా ఇచ్చారు.

తండ్రి రజనీకాంత్ గురించి సౌందర్య కామెంట్స్
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం `జైలర్ 2`లో నటిస్తున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతుంది. ఇందులో మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్ వంటి వారు కనిపించబోతున్నారు. ఈ క్రమంలో ఇటీవల రజనీకాంత్‌కి సంబంధించిన ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ఆయన కూతురు సౌందర్య రంజనీకాంత్ ఎవరికీ తెలియని విషయాలను పంచుకున్నారు. ఆమె నిర్మించిన `విత్ లవ్` మూవీ వచ్చే వారం విడుదల కాబోతుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొన్న సౌందర్య నాన్నకి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
రజనీకాంత్ ఆటోబయోగ్రఫీ
రజనీకాంత్ తన ఆటోబయోగ్రఫీ రాసుకుంటున్నారని తెలిపారు. చాలా రోజులుగా ఆయన ఈ ఆటోబయోగ్రఫీ రాసుకుంటున్నాడట. ఇది ఎండింగ్‌కి చేరుకుందని చెప్పారు. దీన్ని ఏం చేయాలనేది ఇంకా నిర్ణయించలేదని, ఇందులో అనేక సంచలన విషయాలు ఉన్నాయని చెప్పారు. సినిమాగా తీయాలా? లేదా అనేది ఇంకా నిర్ణయించలేదని, తీస్తే సంచలనాలకు కేరాఫ్‌గా నిలుస్తుందన్నారు. ఈ క్రమంలో మరో ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు సౌందర్య రజనీకాంత్. `పడయప్పా` స్టోరీ కూడా రజనీకాంత్ రాస్తున్నారట.
నరసింహ మూవీ తెరవెనుక కథ
రజనీకాంత్, రమ్యకృష్ణ, సౌందర్య కలిసి నటించిన `పడయప్పా`(నరసింహ) ఎంతటి సంచలనాలు సృష్టించిన విషయం తెలిసిందే. ఇది తెలుగులో `నరసింహ`గా 1999లో విడుదలైంది. కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించారు. అప్పట్లో ఇది ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. రజనీకాంత్ స్టయిల్, యాక్షన్‌కి రమ్యకృష్ణ నటన తోడు కావడంతో సినిమా వేరే స్థాయికి వెళ్లిపోయింది. సౌందర్య గ్లామర్, ఆమె నటన కూడా కలిసి వచ్చింది. రజనీకాంత్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఇదొక చిత్రంగా నిలిచింది. అయితే ఈ మూవీని కథని రజనీకాంత్ రాశారట. మూలకథని నాన్ననే రాశాడని సౌందర్య వెల్లడించారు.
నరసింహ 2 అప్ డేట్
ఈ అతిపెద్ద రహస్యాన్ని సౌందర్య దాదాపు 27ఏళ్ల తర్వాత వెల్లడించడం విశేషం. అంతేకాదు ఇప్పుడు `పడయప్పా 2` స్టోరీ కూడా రాస్తున్నారట. కథ రెడీ అయ్యిందట. చాలా బాగా వచ్చిందని తెలిపింది. అయితే దీనికి ఎవరు దర్శకత్వం వహిస్తారు, సినిమా ఎప్పుడు ఉంటుందనేది ఇంకా నిర్ణయించలేదని చెప్పింది సౌందర్య. ఇప్పుడు ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సౌందర్య రజనీకాంత్ నిర్మించిన `విత్ లవ్` మూవీలో అభిషన్ జీవింత్ హీరోగా నటించగా, అనస్వర రాజన్ హీరోయిన్‌గా చేసింది. ఫిబ్రవరి 6న విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా సౌందర్య హైదరాబాద్‌లో సందడి చేసింది.

