MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Demon Pavan Love Story: తాను ప్రేమిస్తే ఫ్రెండ్‌తో జంప్‌.. గుండె బరువెక్కించే డీమాన్‌ పవన్‌ ఫ్యామిలీ స్టోరీ

Demon Pavan Love Story: తాను ప్రేమిస్తే ఫ్రెండ్‌తో జంప్‌.. గుండె బరువెక్కించే డీమాన్‌ పవన్‌ ఫ్యామిలీ స్టోరీ

Demon Pavan Love Story: డీమాన్‌ పవన్‌ బిగ్‌ బాస్‌ షోతో గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన తన లవ్‌ స్టోరీని బయటపెట్టాడు. మతిపోయేలా ఆయన ప్రేమ కథ సాగడం విశేషం. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jan 30 2026, 08:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
బిగ్‌ బాస్‌ షోతో పాపులర్‌ అయిన డీమాన్‌ పవన్‌
Image Credit : youtube/@@BIGTVPlus

బిగ్‌ బాస్‌ షోతో పాపులర్‌ అయిన డీమాన్‌ పవన్‌

బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోతో గుర్తింపు తెచ్చుకున్నాడు డీమాన్‌ పవన్‌. కామనర్‌గా ఎంట్రీ ఇచ్చి `అగ్నిపరీక్ష`లో విజయం సాధించి బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి వచ్చాడు. ఇందులో తనదైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. టాప్‌ 5 కంటెస్టెంట్‌గా నిలిచాడు. టాప్‌ 3లో 20లక్షల సూట్‌ కేసు తీసుకుని వెళ్లిపోయాడు. అదిరిపోయే జాక్‌ పాట్‌ కొట్టాడు. దీంతో డీమాన్‌ పవన్‌ అందరి దృష్టిని ఆకర్షించాడు. 

24
విమర్శలను తట్టుకొని నిలబడ్డ రీతూ, డీమాన్‌ పవన్‌ జంట
Image Credit : starmaa

విమర్శలను తట్టుకొని నిలబడ్డ రీతూ, డీమాన్‌ పవన్‌ జంట

డీమాన్‌ పవన్‌ బిగ్‌ బాస్‌ షోలో రీతూ చౌదరీతో బాండింగ్‌ని కొనసాగించిన విషయం తెలిసిందే. ఇద్దరూ పులిహోర కలుపుకున్నారు. లవర్స్ గా కలర్‌ ఇచ్చారు. కెమిస్ట్రీ పండించారు. క్రేజీ జోడీగా నిలిచారు. చాలా రోజులు సర్వైవ్‌ అయ్యారు. నిజంగానే ప్రేమికులుగా వ్యవహరించారు. అదే వీరికి కలిసి వచ్చింది. అయితే వీరి బాండింగ్‌కి సంబంధించి అనేక విమర్శలు వచ్చాయి. ఎవరు ఏమన్నా, తమ రిలేషన్‌ కొనసాగించారు. షో నుంచి బయటకు వచ్చాక కూడా దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. మంచి స్నేహితులుగా రాణిస్తున్నారు. 

Related Articles

Related image1
Devagudi Movie Review: దేవగుడి మూవీ రివ్యూ.. రాయలసీమ ఫ్యాక్షన్‌ నేపథ్యంలో సాగే లవ్‌ స్టోరీ ఎలా ఉందంటే?
Related image2
Varanasi Release Date: మహేష్‌ బాబు `వారణాసి` మూవీ రిలీజ్‌ డేట్‌ వచ్చింది.. రాజమౌళి మైండ్‌ బ్లోయింగ్‌ స్కెచ్‌
34
డీమాన్‌ పవన్‌ లవ్‌ స్టోరీ
Image Credit : youtube/@@BIGTVPlus

డీమాన్‌ పవన్‌ లవ్‌ స్టోరీ

ఈ క్రమంలో డీమాన్‌ పవన్‌ తన సొంత లవ్‌ స్టోరీ చెప్పాడు. బ్రేకప్‌ స్టోరీని బయటపెట్టి షాకిచ్చాడు. తాజాగా ఆయన బిగ్‌ టీవీలో జబర్దస్త్ వర్ష నిర్వహిస్తున్న కిస్సిక్‌ టాక్స్ లో పాల్గొన్నారు. దీని ప్రోమో విడుదలయ్యింది. ఇందులో లవ్‌ స్టోరీ గురించి అడగ్గా షాకిచ్చే స్టోరీ చెప్పాడు పవన్‌. తాను ఒక అమ్మాయిని ప్రేమించాడట. కొన్నాళ్లు బాగానే ప్రేమించిందట. కానీ ఆమె తన ఫ్రెండ్‌కి కనెక్ట్ అయ్యిందట. దీంతో ఆయనతో జంప్‌ అయ్యిందని చెప్పాడు పవన్‌. పవన్‌ చెప్పిన తీరు కామెడీగా ఉంది. కానీ అందులో చాలా పెయిన్‌ ఉందని చెప్పొచ్చు.

44
గుండెని బరువెక్కించే డీమాన్‌ పవన్‌ ఫ్యామిలీ స్టోరీ
Image Credit : youtube/@@BIGTVPlus

గుండెని బరువెక్కించే డీమాన్‌ పవన్‌ ఫ్యామిలీ స్టోరీ

ఇదిలా ఉంటే ఇందులో తన ఫ్యామిలీ స్టోరీని పంచుకున్నాడు పవన్‌. తన నాన్న పరిస్థితిని వెల్లడించారు. తాను బిగ్‌ బాస్‌ షోకి రావడానికి నెల రోజుల ముందే నాన్నకి క్యాన్సర్‌ అని తేలిందట. నాలుకకి క్యాన్సర్‌ వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం ట్రీట్‌మెంట్‌ జరుగుతుందని చెప్పాడు. తనకు పెద్దగా ఆస్తులు లేవని, చాలా పేదరికం నుంచి వచ్చినట్టు చెప్పాడు. ఇప్పుడు తాను ధరించే డ్రెస్‌ ధర కూడా తక్కువే అని చెప్పాడు. లోపల ధరించిన టీషర్ట్ ధర రెండు వందల రూపాయలే అని చెప్పి షాకిచ్చాడు. ఒకప్పుడు పంప్లెట్లు పంచేవాడట. పాలు కూడా వేశాడట. చిన్నప్పుడు చాలా చూసి వచ్చానని తెలిపాడు. దేవుడు భరించే వారికే బాధ్యతలు ఇస్తాడు. భరించే శక్తి ఉంది కాబట్టే అన్ని బాధ్యతలు ఇచ్చాడని చెప్పాడు పవన్‌. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
KH vs RK: కమల్‌ హాసన్‌, రజనీకాంత్‌ స్వాగ్‌కి పూనకాలే.. కోలీవుడ్‌లో ఫస్ట్ 1000 కోట్ల మూవీ లోడింగ్‌, ఇంతకి హీరో ఎవరు
Recommended image2
Meena : రెండో పెళ్లిపై మీనా సంచలన కామెంట్స్, ధనుష్ తో వచ్చిన వార్తలపై క్లారిటీ..
Recommended image3
ఒక‌ప్పుడు తెలుగు వారిని గుక్క‌పెట్టి ఏడిపించిన ఈ హీరోయిన్‌ ఎవ‌రో గుర్తుప‌ట్టారా.?
Related Stories
Recommended image1
Devagudi Movie Review: దేవగుడి మూవీ రివ్యూ.. రాయలసీమ ఫ్యాక్షన్‌ నేపథ్యంలో సాగే లవ్‌ స్టోరీ ఎలా ఉందంటే?
Recommended image2
Varanasi Release Date: మహేష్‌ బాబు `వారణాసి` మూవీ రిలీజ్‌ డేట్‌ వచ్చింది.. రాజమౌళి మైండ్‌ బ్లోయింగ్‌ స్కెచ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved