MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Karthika Deepam: దీపని మోసం చేసిన కార్తీక్.. చారుశీలని కలిసిన సౌందర్య?

Karthika Deepam: దీపని మోసం చేసిన కార్తీక్.. చారుశీలని కలిసిన సౌందర్య?

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ మంచి రేటింగ్ తో దూసుకెళ్తుంది. ఒకటే కథతో నిత్యం ట్విస్ట్ ల మీద ట్విస్టులతో ప్రసారమవుతున్న ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు డిసెంబర్ 17 వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. 

3 Min read
Author : Navya G
Published : Dec 17 2022, 07:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈరోజు ఎపిసోడ్ లో దీప, కార్తీక్ కి ఫోన్ చేసి డాక్టర్ బాబు మన శౌర్య అడ్రస్ దొరికింది అనడంతో కార్తీక్ షాక్ అవుతాడు. ఏం మాట్లాడుతున్నావ్ దీప అని అనగా చంద్రుడు వాళ్ళ అడ్రస్ తెలిసింది పండరి వాళ్లని చూసి గుర్తుపట్టింది. ఇద్దరము అక్కడికి వెళ్తున్నాము అనగా ఇప్పుడు ఎక్కడున్నారు అనడంతో ఆటోలో అక్కడికి వెళ్తున్నాం డాక్టర్ బాబు మీరు కూడా అక్కడికి వచ్చేయండి పండరి అడ్రస్ చెబుతుంది అని అంటుంది. అప్పుడు పండరీ కార్తిక్ కి అడ్రస్ చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. అప్పుడు కార్తీక్ టెన్షన్ పడుతూ ఉంటాడు.
 

27

తర్వాత కార్తీక్ ఇంద్రుడికి ఫోన్ చేసి అసలు విషయం చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోమని చెబుతాడు కార్తీక్. మరొకవైపు ఆనంద్ రావు, హిమ ఇద్దరు సౌందర్య గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మ నాన్నలు కనిపించారా తాతయ్య వాళ్ళని తీసుకొస్తానని వెళ్ళింది కదా ఇంతవరకు రాలేదు అని అంటుంది. అప్పుడు హిమ బాధతో అమ్మ వాళ్ళు వస్తే బాగుంటుంది. అప్పుడు ఆనంద్ రావు హిమ కి దైర్యం చెబుతుంటాడు. మరొకవైపు కార్తీక్, దీప, పండరి వాళ్ళు అందరికి వెళ్లగా అక్కడ ఇంద్రుడు కాళీ చేసి వెళ్లిపోయి ఇక్కడ ఈ ఇల్లు అమ్మబడును అని రాసి ఉంటుంది.
 

37

 అది చూసి దీప బాధ పడుతూ షాక్ అవుతుంది. అప్పుడు పండరీ పొద్దున ఉన్నారు అందులోనే ఇంతవరకు వెళ్లారు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ సమయానికి వెళ్లిపోయారు కాబట్టి సరిపోయింది లేకపోతే దొరికిపోయేవారు లేరు అని మనసులో అనుకుంటూ ఉంటాడు. మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు అని దీప బాధపడుంతుండగా ఏంటి దీపమ్మ మనం వస్తున్నట్టు ఎవరికి తెలియదు కదా మరి ఎవరు చెప్పి ఉంటారు అనడంతో మీకు తెలుసు కదా డాక్టర్ బాబు అనగా వెంటనే కార్తీక్ అదేంటి దీపా నేను వాళ్లకు చెప్పి వెళ్లిపోమని చెప్పానా అని అడుగుతాడు.

47

మీరు హాస్పిటల్ దగ్గర ఎవరితో అయినా ఈ విషయం గురించి మాట్లాడారా అక్కడ ఇంద్రుడు మనసులో ఉండి వాళ్లకు చెప్పారేమో అని దీప అనుమాన పడుతూ ఉండగా అదేమీ లేదులే దీప అని ధైర్యం చెబుతూ ఉంటాడు కార్తీక్. అప్పుడు కార్తీక్ అబద్ధాలు చెబుతూ నువ్వు హాస్పిటల్ లో వాళ్ళని చూశావు కదా మళ్ళీ ఎక్కడ పట్టుకుంటావో అని ఇక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు ఉన్నారు అని అంటాడు. అప్పుడు పండరీ వెళ్లి ఇంటి ఓనర్ ని అడుగుతాను అనగా కాదు టెన్షన్ తో వద్దు అని అడ్డుపడుతూ ఉంటాడు. మరొకవైపు చారుశీల పేషంట్లకు చెక్ చేస్తూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి సౌందర్య వస్తుంది.
 

57

అప్పుడు సౌందర్య జరిగింది మొత్తం వివరించి నా కొడుకు పేరు కార్తీక్ అని ఫోటో చూపించడంతో చారుశీల ఒక్కసారిగా షాక్ అవుతుంది. అప్పుడు చారుశీల ఆలోచిస్తూ ఇక్కడ కార్తీక్ ఏడు ఉండి ఉంటే ఈపాటికి చాలా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది అనుకుంటూ సౌందర్య కి అబద్దం చెప్పి ఇక్కడ లేడు అని అంటుంది. అప్పుడు సౌందర్య బాధపడుతూ ఉంటుంది. అప్పుడు సౌందర్య బాధపడుతూ నా కొడుకు కూడా ఎక్కడ ఉన్నారో ఏం చేస్తున్నారో అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. చారుశీల ఏవండీ మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే నాకు మీ కొడుకు కోడలు బతికే ఉన్నారని అనిపిస్తుంది.
 

67

కానీ ఇలా వెతకడం సరికాదు ఒకవేళ వాళ్ళు బతికే ఉంటే పరిస్థితులు అన్ని చక్కబడిన తర్వాత మీ ఇంటికి వస్తారు అని ధైర్యం చెబుతుంది. ఆ తర్వాత సౌందర్య అక్కడి నుంచి వెళ్తూ సౌర్య పోస్టర్ ని చూసి బాధపడుతూ ఉంటుంది. ఏం కర్మ పట్టింది సౌర్య నీకు అమ్మ నాన్న కోసం ఇన్ని పాట్లు పడుతున్నావా అని ఏడుస్తుంది సౌందర్య. నా మనవరాలు ఇది ఎవరు అంటించారు అనడంతో ఆ పాప వచ్చి అతికించింది అని చెబుతుంది. తర్వాత సౌందర్య ఆ నెంబర్ కి ఫోన్ చేయడంతో ఫోన్ పనిచేయదు. దాంతో సౌందర్య బాధపడి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు కార్తీక్ దీప తో చెప్పిన అబద్ధాలు గుర్తుతెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు.
 

77

ఇంతలోనే అక్కడికి చారుశీల వస్తుంది. ఒకసారి ఆలోచించు కార్తీక్ తప్పు చేస్తున్నావేమో నీకోసం ఇంటికి వెళ్తే దీప కంటిన్యూగా ఏడుస్తూనే ఉంది. ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకో అని అంటుంది చారుశీల. మోసం చేస్తున్నావేమో అనిపిస్తుంది అసలు వ్యాధి కంటే మనో వ్యాధి ఎక్కువ అయిపోయింది అని చారుశీల బాధగా మాట్లాడుతుంది. ఎన్ని రోజులని ఇలా దాచిపెడతావ్ కార్తీక్ ఈరోజు మీ అమ్మగారు హాస్పిటల్ కి వచ్చారు అనడంతో కార్తీక్ షాక్ అవుతాడు. అప్పుడు చారుశీల జరిగింది మొత్తం వివరించడంతో కార్తీక్ మరింత బాధపడుతూ ఉంటాడు.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijay Fitness: 50 లో కూడా 25 ఏళ్ల కుర్రాడిలా ఎలా ? దళపతి విజయ్ డైట్ సీక్రెట్ ఇదే
Recommended image2
R B Choudary: ఫిల్మ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. నిర్మాత ఆర్. బి. చౌదరి కన్నుమూత, ఏం జరిగిందంటే?
Recommended image3
Wedding Traditions: మ్యారేజ్‌లో కొత్త ట్రెండ్ సెట్ చేసిన సెలబ్రిటీలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved