- Home
- Entertainment
- Karthika Deepam: హిమను అసహ్యించుకుంటున్న జ్వాల.. శౌర్యకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన సౌందర్య?
Karthika Deepam: హిమను అసహ్యించుకుంటున్న జ్వాల.. శౌర్యకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన సౌందర్య?
Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ కుటుంబ కథా నేపథ్యం లో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జూన్ 27 వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ లో హిమ(hima) నిలబడి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అక్కడికి జ్వాలా వస్తుంది. హిమ ను అక్కడ చూసి నీ ముఖం నాకు చూపించకు అంటూ చిరాకు పడుతుంది. అప్పుడు సహిమ మాట్లాడాలని ప్రయత్నించినా కూడా జ్వాలా(jwala)హిమను మాట్లాడనివ్వకుండా కోప్పడుతుంది. నువ్వు తింగరివి కాదు మోసకారివీ అంటూ హిమ ను అపార్థం చేసుకుంటుంది.
అప్పుడు హిమ,జ్వాలా(jwala) దగ్గరికి వెళ్లడానికి ప్రయత్నించగా అప్పుడు జ్వాలా దగ్గరికి రావద్దు అంటుంది హిమను కసురుకుంటుంది. అప్పుడు జ్వాలా నీ పేరు ఏంటో చెప్పవే నీ పేరు కూడా పచ్చబొట్టు పొడిపించుకుంటాను అని చెప్పి అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. మరుసటి రోజు హిమ(hima) జ్వాలా గురించి ఆలోచిస్తూ జ్వాలా అన్న మాటలు తలుచుకొని బాధపడుతూ దీనికంతటికీ కారణం ఆ శోభనే అని శోభ పై కోపంతో రగిలి పోతూ ఉంటుంది.
ఇంతలో అక్కడికి ఆనంద్ రావ్ (anand rao)అక్కడి వచ్చి హిమతో మాట్లాడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి నిరుపమ్, స్వప్న(swapna)మొదటి పెళ్లి పత్రిక తీసుకొనివచ్చి హిమకు చూపించడంతో హిమకు షాక్ అవుతుంది. ఆ తరువాత పెళ్లి పత్రిక ను ఆనంద్ రావుకు ఇచ్చి అక్కడనుంచి వెళ్ళి పోతారు. మరొకవైపు సౌందర్య, జ్వాలా ఇంటికి వెళ్తుంది. మరోవైపు హిమ పెళ్లి పత్రిక చూసి బాధపడుతూ ఉంటుంది.
సౌందర్య(soundarya)జ్వాలా ఇంటికి వెళ్లి చూడగా అక్కడ ఇల్లంతా చిందరవందరగా ఉండడంతోపాటు హిమ, నిరుపమ్ ఫోటోలను చింపివేసి ఉంటుంది. అప్పుడు జ్వాలా పడుకొని ఉండగా సౌందర్య నిద్రలేపకుండా ఇళ్లు మొత్తం క్లీన్ చేసి జ్వాలా(jwala) ఇంటి ముందు ముగ్గు వేస్తుంది. మరొకవైపు ఆనంద్ రావు, హిమ లు జరిగిన విషయాలను తలుచుకుని బాధ పడుతూ ఉంటారు.
అప్పుడు శోభ(shobha) గురించి ఆనంద్ రావ్ కి చెబుతుంది. అప్పుడు ఎలా అయిన జ్వాలాకి బావ కి పెళ్లి చేద్దాం అని అంటుంది. మరొకవైపు జ్వాలా (jwala)నిద్రలేచి చూసి సౌందర్య ఇల్లు మొత్తం క్లీన్ చేయడంతో ఆశ్చర్యపోతుంది. అప్పుడు వారిద్దరు ఒకరికొకరు ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు. రేపటి ఎపిసోడ్ లో జ్వలా ఆటోనీ తీసుకొని వెళ్లు నిరుపమ్ కి అప్పగిస్తుంది.