Karthika Deepam: సౌందర్య వాళ్ళను కలుసుకున్న కార్తీక్, దీప.. బాధపడుతున్న శౌర్య?
Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ మంచి రేటింగ్ తో దూసుకెళ్తుంది. ఒకటే కథతో నిత్యం ట్విస్ట్ ల మీద ట్విస్టులతో ప్రసారమవుతున్న ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు డిసెంబర్ 8వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
ఈరోజు ఎపిసోడ్ లో చంద్రమ్మ గండా మాటలు కాదనలేక జ్వాలమ్మ ను పంపించడానికి ఒప్పుకున్నాను. కానీ జ్వాలమ్మ లేకుండా నేను ఉండగలనా, వాళ్ళ అమ్మ నాన్న ఉండరులే ఏదో పసిది నమ్ముతుంది అనుకున్నాను. కానీ వాళ్ళ అమ్మానాన్నలు ఉన్నారని అని అనుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి ఇంద్రుడు రావడంతో గండా వాళ్ళ అమ్మ నాన్న కనిపించారా అని అనడంతో లేదు చంద్రమ్మ అని అంటాడు. ఆరోజు ఆ తల్లి రోడ్డు మీద అలా పడి ఉండడం చూసి నా గుండె బరువెక్కిపోయింది అనడంతో అప్పుడు చంద్రమ్మ ఒకటి చెప్తాను గండా ఆ దేవుడు రాసిన రాత్రి నువ్వు నేను చెప్పగలమా అని అంటుంది.
అప్పుడు చంద్రమ్మ సౌర్యనే తన అమ్మానాన్నలకు ఇవ్వడం ఇష్టం లేదు అన్నట్టుగా మాట్లాడడంతో వెంటనే ఇంద్రుడు సీరియస్ అయ్యి వాళ్ళ అమ్మానాన్నలు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వెతికి పట్టి మరి వాళ్ళకి ఇచ్చేస్తాను అని అంటాడు. ఈ విషయంలో దేవుడి మాట కాదు కదా ఎవరి మాట వినను అని సీరియస్ అవుతాడు. మరొకవైపు దీప, కార్తీక్ ఇద్దరు హోటల్లో భోజనం చేస్తూ ఉండగా ఇంతలో చారుశీల కార్తీక్ కి ఫోన్ చేస్తుంది. అప్పుడు చారుశీల దీప ఆరోగ్యం గురించి పదేపదే ప్రశ్నలు వేయడంతో చారుశీల నేను ఒక డాక్టర్ అన్న విషయం నువ్వు మర్చిపోయినట్టు ఉన్నావు అని అంటాడు కార్తీక్. అప్పుడు వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండక అప్పుడు కార్తీక్ మార్నింగ్ బయలుదేరేటప్పుడు ఏవో రిపోర్ట్ అన్నావు ఇంతవరకు మెసేజ్ చేయలేదు అనడంతో వేరే డాక్టర్ తో మాట్లాడాను అని అంటుంది.
అప్పుడు దీప ఏమైంది డాక్టర్ బాబు అనడంతో నీ గురించి పదేపదే జాగ్రత్తలు చెబుతోంది వంటలక్క గురించి డాక్టర్ బాబుకి జాగ్రత్తలు చెబుతోంది అని అంటాడు కార్తీక్. ఆ తర్వాత దీప కార్తీక్ లో మాట్లాడుకుంటూ వారణాసి గురించి మాట్లాడుకోవడంతో ఆరోజు అడిగావు కదా నీకు గతం ఎలా గుర్తుకు వచ్చిందని ఇప్పుడు చెబుతా విను సంగారెడ్డికి మనం వెళ్ళినప్పుడు అక్కడ దసరా ఉత్సవాలలో వారణాసి నాకు కనిపించి నాకు గతం గుర్తుకు వచ్చేలా చేసాడు అని జరిగింది మొత్తం వివరిస్తాడు కార్తీక్. పాపం వారణాసి నాకోసం ఎంత చేశాడో చివరికి మనం లేకపోయినా సౌర్యని జాగ్రత్తగా చూసుకున్నాడు కానీ ఇప్పుడు నా వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు బాధగా ఉంది అని అంటుంది దీప.
అప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది అని దీప అడగడంతో కోమాలో ఉన్నాడు తొందరలోనే కోరుకుంటాడు అని అంటాడు కార్తీక్. మరొకవైపు హిమ శౌర్య ఫోటో చూస్తే ఏడుస్తూ కూర్చుంటుంది. ఇంతలో ఆనందరావు అక్కడికి వచ్చి ఏమైంది హిమ అనడంతో శౌర్యకి ఇక్కడికి రావడం ఇష్టం లేదు తాతయ్య. అమ్మ నాన్నలు బతికే ఉన్నారు అంటుంది కానీ నేనే అమ్మానాన్నలని చంపేశాను అంటుంది అని హిమ బాధపడుతుంది. ఇక్కడికి రావడానికి ఇష్టం లేక నన్ను సాకుగా అడ్డుపెట్టుకుంటోంది అని అనగా ఇంతలోనే అక్కడికి సౌందర్య వస్తుంది. అప్పుడు సౌందర్య మోనిత గురించి మాట్లాడుతూ పోలీస్ రోషిని నిజం చెప్పించే ప్రయత్నం చేయడంతో తనకు మతిస్థిమితం లేదని నాటకాలు ఆడుతోంది.
పైగా డాక్టర్ దగ్గరికి సర్టిఫికెట్ కూడా తీసుకువచ్చింది చాలా క్రిమినల్ బ్రెయిన్ అని మాట్లాడుతూ ఉంటుంది సౌందర్య. మరొకవైపు కార్తీక్, దీప ఇద్దరూ కారులో వస్తూ ఉంటారు. ఇప్పుడు డాక్టర్ బాబు హెల్త్ నాకు బాగోలేదు కదా మరి మీరు ఎందుకు బ్లడ్ ఇచ్చారు మీకేమయింది అని అనడంతో ఏమిలేదు జనరల్ టెస్ట్ కి ఇచ్చాను అని అంటాడు కార్తీక్. ఇప్పుడు నిజం చెప్పండి డాక్టర్ బాబు మీకేం కాలేదు కదా అని అనడంతో నాకు ఏమీ కాలేదు దీప నేను బాగానే ఉన్నాను అని అంటాడు కార్తీక్. అయినా అంత చిన్నదానికెందుకు భయపడుతున్నావ్ అనడంతో నాకు బాగోలేదు నీకు ఏమన్నా అయితే మన పిల్లలు అనాధలవుతారు అని అంటుంది దీప.
అయినా ఇంకొక అర్థగంటలో అమ్మ వాళ్ళని కలుస్తావు ఆ విషయం గురించి ఆలోచించకుండా ఏవేవో ఆలోచిస్తావేంటి దీప అని కార్తీక్ సంతోషంతో మాట్లాడుతాడు. ఇప్పుడు వారిద్దరూ హిమ తలుచుకుని ఆనందపడుతూ ఉంటారు. మరొకవైపు శౌర్య ఇంద్రుడు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు సౌర్య నేను వెతుకుతున్నట్లు మా అమ్మ నాన్న కూడా నా కోసం వెతుకుతూ ఉంటారు బాబాయ్ అని అంటుంది. మరొకవైపు కార్తీక్, దీప ఇద్దరు ఆనందరావు ఇంటికి వెళ్తారు. ఆ తర్వాత దీప వాళ్ళు లోపలికి వెళ్ళగా లోపల సౌందర్య పాలు తాగవే అని అనడంతో లేదు వద్దు నానమ్మ అని అనగా నువ్వు కూడా మీ నాన్న లాగే వాడు కూడా ఇలాగే సతాయించేవాడు అనిఅంటుంది.
అప్పుడు కార్తీక్ అమ్మ అని పిలవడంతో ఇప్పుడు కూడా కార్తీక్ నా పక్కనే ఉన్నటువంటి అని పిలుస్తున్నట్టు అనిపిస్తుంది అని అంటుంది సౌందర్య. అప్పుడు పక్కనే ఉన్న కార్తీక్ దీప లను చూసిన హిమ అమ్మ గట్టిగా వెళ్లి హత్తుకుంటుంది. అది చూసిన ఆనందరావు, సౌందర్య ఇద్దరు సంతోషపడుతూ ఉంటారు. కార్తీక్ వాళ్ళని చూసి ఒక్కసారిగా సౌందర్య షాక్ అవుతుంది. తర్వాత వాళ్ళందరూ ఆనందంగా ఉంటారు. అప్పుడు సౌందర్య వాళ్ళని చూసి ఎమోషనల్ అవుతూ మళ్లీ మిమ్మల్ని ఇలా చూస్తాను అనుకోలేదు అని ఎమోషనల్ అవుతుంది.