- Home
- Entertainment
- సౌందర్య సోదరుడి పెళ్లికి హాజరైన ఒకే ఒక్క స్టార్ హీరో ఎవరో తెలుసా?.. అందుకే ఆ రూమర్స్ !
సౌందర్య సోదరుడి పెళ్లికి హాజరైన ఒకే ఒక్క స్టార్ హీరో ఎవరో తెలుసా?.. అందుకే ఆ రూమర్స్ !
సౌందర్య సోదరుడి పెళ్లికి ఒకే ఒక్క స్టార్ హీరో హాజరయ్యారు. అది అప్పట్లో పెద్ద చర్చనీయాంశం అయ్యింది. మరి ఆయన ఎవరు? ఆయనతో రూమర్స్ కి కారణం ఏంటి?

సౌందర్య కన్నడ అమ్మాయి అయినా తెలుగులో ఎక్కువ సినిమాలు చేసింది. తెలుగమ్మాయి అనిపించింది. ఆమె కట్టు, బొట్టు తెలుగు దనాన్ని ఉట్టిపడేలా చేశాయి. అయితే ఆమె తెలుగులో ఎక్కువగా ఇద్దరు ముగ్గురు హీరోలతోనే చేసింది. అందులో వెంకటేష్, జగపతిబాబు ఉన్నారు. వీరితోనే ఏకంగా ఐదారు మూవీస్ చేసింది. వీరితోపాటు చిరు, బాలయ్య, నాగ్, శ్రీకాంత్, జేడీ చక్రవర్తి, మోహన్‌బాబు వంటి వారితోనూ కలిసి నటించి, ఆకట్టుకుంది సౌందర్య.
ఇదిలా ఉంటే తన పెళ్లి కంటే ముందే ఆమె తన సోదరుడి వివాహం చేసింది. సౌందర్యకి తోడ ఒక సోదరుడు ఉన్నాడు. 1997లో ఆయన పెళ్లి అయ్యింది. సౌందర్యనే స్వయంగా దగ్గరుండి తన బ్రదర్ వివాహాన్ని చేశారు. అన్నీ తానై వ్యవహరించారు. అప్పటికే ఆమె సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్నారు. దీంతో చాలా గ్రాండ్‌గానే వివాహం చేశారు.
అయితే సోదరుడి వివాహానికి బంధుమిత్రులను ఆహ్వానించింది సౌందర్య. సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్దగా ఎవరినీ పిలవ లేదు. కానీ ఒకే ఒక్క స్టార్ హీరోని ఆహ్వానించింది. ఆయన ఎవరో కాదు విక్టరీవెంకటేష్. కేవలం వెంకటేష్ ఒక్కరే సౌందర్య సోదరుడి వివాహ వేడుకకి హాజరయ్యారు.
సౌందర్య, వెంకటేష్ కలిసి ఎక్కువ సినిమాలు చేశారు. దాదాపు ఎనిమిది మూవీస్‌లో కలిసి నటించారు. అందులో `రాజా`, `పవిత్ర బంధం`, `ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు`, `జయం మనదేరా`, `దేవి పుత్రుడు`, `నిన్నే ప్రేమిస్తా`, `పెళ్లి చేసుకుందాం` వంటి చిత్రాలున్నాయి. ఇందులో ఒకటి రెండు తప్ప అన్నీ బంపర్ హిట్ సాధించాయి.
అయితే అప్పట్లో ఈ ఇద్దరు వరుసగా కలిసి పినిమాలు చేయడంతో ఇద్దరు ప్రేమలో ఉన్నారనే వార్తలు వచ్చాయి. అప్పటికే వెంకటేష్‌కి మ్యారేజ్ అయ్యింది. అయినా ఈ ఇద్దరు డేటింగ్‌లో ఉన్నారని, వెంకీతో సౌందర్యకి ఎఫైర్ ఉందని రూమర్లు వచ్చాయి. ఈ క్రమంలో తన సోదరుడి పెళ్లికి కేవలం వెంకీనే ఆహ్వానించడంతో ఆ రూమర్స్ కి మరింత బలం చేకూరినట్టయ్యింది.
ఆ మ్యారేజ్‌కి వెంకీ ఒక్కరినే పిలవడానికి మరో బలమైన కారణం ఉంది. ఆ సమయంలో వెంకటేష్, సౌందర్య కలిసి `పెళ్లి చేసుకుందాం` అనే సినిమాలో నటిస్తున్నారు. ఆ మూవీ షూటింగ్ బెంగుళూరులోనే జరుగుతుంది. దీంతో ఆయన్ని మాత్రమే ఆహ్వానించిందట సౌందర్య. అలా వెంకీ ఆ పెళ్లికి వెళ్లాల్సి వచ్చింది. కానీ బయట మాత్రం పుకార్లు షికార్లు చేశాయి.