MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Karthika Deepam: మోనిత మీద అనుమానంతో ఇంటికి వచ్చిన సౌందర్య.. దీపను చూసిన ఆనందరావు!

Karthika Deepam: మోనిత మీద అనుమానంతో ఇంటికి వచ్చిన సౌందర్య.. దీపను చూసిన ఆనందరావు!

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్,కుటుంబ కథా నేపథ్యంతో కొనసాగుతూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు సెప్టెంబర్ 23వ తేదీన ఏం జరుగుతుందో తెలుసుకుందాం... 

4 Min read
Author : Navya G
Published : Sep 23 2022, 08:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే...దీప, జరిగిన విషయం అంతా గుర్తు తెచ్చుకొని,ఇంట్లో సామాన్లు అన్ని పగలగొట్టి ఏడుస్తూ ఉంటుంది. ఒక కొత్త,గతమే సృష్టించింది అన్నయ్య. అందరి ముందు నన్ను నవ్వులపాలు చేసింది. డాక్టర్ బాబు ఇంక నా మాట కూడా వినరు నేనేం చెప్పినా అది అబద్దం అని అంటారు, అదేమి అబద్ధం చెప్పినా అది నిజమనే నమ్ముతున్నారు అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ అన్నయ్య, నువ్వు వెళ్లి మీ భర్తని తీసుకురా అమ్మా, ఎవరు అపుతారు నేను నిన్ను చూస్తాను అని అనగా, మా భర్తే ఆపుతారు అన్నయ్య! ఏది నమ్మేస్థితిలో లేరు పూర్తిగా మోనిత వలలో ఉన్నారు అని బాధపడుతూ ఉంటుంది.
 

28

అప్పుడు వాళ్ళ అన్నయ్య, అయితే దీనికి ఒకటే మార్గం ఉన్నదమ్మ వెళ్లి కార్తీక్ ని ఎలాగైనా హాస్పిటల్ కి తీసుకురావాలి లేకపోతే ఈ సమస్య తీరదు అని అంటాడు. తీసుకొస్తాను అన్నయ్య,ముందు వెళ్లి ఆ మోనిత ఏవైనా ప్లాన్లు వేస్తుందేమో అని చూసి వస్తాను అని వెళ్తుంది దీప.అదే సమయంలో మోనిత ఇంటి బయట టెన్షన్ గా, అనవసరంగా ఇందాక నోరు జారే జారాను,ఇప్పుడు ఆంటీ అంకుల్ వచ్చేస్తారా అని భయపడుతూ ఉంటుంది. కార్తీక్ మేడ మీద ఉంటాడు. అప్పుడు ఆనంద్ రావు,సౌందర్యలు కార్ అక్కడ ఆగుతుంది.వాళ్ళు లోపలికి వస్తున్నప్పుడు మౌనిత వాళ్ళని చూసి వెంటనే శివతో, కార్తీక్ నీ పెరడుకి తీసుకెళ్లి పో అని అంటుంది.
 

38

అప్పుడు శివ కార్తీక్ ని బలవంతంగా బయటికి తీసుకెళ్తాడు. ఎక్కడికి తీసుకెళ్తున్నావురా అని అనగా బయట దోమల మందు వేస్తున్నారు ఆరోగ్యానికి మంచిది కాదు,పెరడు లో అయితే ఏ హానీ ఉండదు అని తీసుకెళ్లిపోతాడు.ఇంతలో ఆనందరావు,సౌందర్య మోనిత దగ్గరికి వస్తారు.అప్పుడు మోనిత, ఎలా ఉన్నారు ఆంటీ ఇదే మా బోటిక్ అని మాట్లాడుతుండగా,వాళ్ళు ఏమి  పట్టించుకోకుండా చుట్టుపక్కలంతా వెతుకుతారు. అప్పుడు మోనిత మనసులో,వచ్చి రాగానే కార్తీక్ కోసం వెతకడం మొదలు పెట్టేసారు అని అనుకోని, ఇదే మా బోటిక్ ఆంటీ బాగుందా అని అంటుంది.
 

48

 నీ బొటిక్ బానే ఉంది కానీ చదివిన నీ డాక్టర్ చదువు అంతా ఏమైంది అని అడుగుతుంది. డాక్టర్ చదివినప్పుడు కార్తీక్ నాకు తోడుగా ఉన్నాడు ఆంటీ నేను మళ్ళీ ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకోలేను అందుకే దాన్ని వదిలేసాను. కార్తీక్ చివరి శ్వాస వీడిన ఈ ఊర్లోనే ఉంటున్నాను అని అంటుంది. అదే సమయంలో దీప అక్కడికి వస్తుంది. అప్పుడు సౌందర్య ఆనంద్ రావులను, మోనిత బోటిక్ లో బట్టలు కప్పేస్తాయి. ఒక దిక్కు నుంచి చూస్తున్న దీప, కస్టమర్ తో మాట్లాడుతున్నట్టున్నది వీళ్ళు వెళ్ళాక దాని పని చెప్తాను అని అనుకుంటుంది. అదే సమయంలో కార్తీక్ ఫోన్ మర్చిపోయాను ఆగయ్య అని చెప్పి హాల్లోకి వస్తాడు.
 

58

శివ  వెళ్లిపోదాం సర్ బలవంతం పెట్టిన సరే హాల్ వరుకు వస్తాడు కార్తీక్.అప్పుడు కార్తీక్,తన తల్లితండ్రులను చూస్తాడు.వాళ్ళిద్దరిని చూసి కార్తీక్ కి తలనొప్పి వస్తుంది వీళ్లను ఎక్కడైనా చూశాను అనుకుంటాడు.  అస్పష్టమైన గతం గుర్తొస్తుంది. ఇంతలో మోనిత, శివతో కార్తీక్ నీ తీసుకెళ్ళమని సైగలు చేస్తుంది. అప్పుడు శివ బలవంతంగా కార్తీక్ ని ఇంటి పెరడుకు తీసుకువెళ్లిపోతాడు. అప్పుడు మోనిత, రండి లోపలికి రండి అని ఇల్లంతా చూపిస్తుంది. అప్పుడు లోపలికి వచ్చిన వాళ్ళిద్దరూ కార్తీక్ కోసం వెతుకుతారు కానీ కార్తీక్ కనిపించడు.
 

68

అప్పుడు సౌందర్య, మోనిత తో ఇందాక ఫోన్లో కార్తీక్ అని ఎందుకు అరిచావు అని అనగా, మోనిత భయపడుతూ ఉంటుంది.సౌందర్య గట్టుగా అడిగేసరికి కార్తీక్ లోపల ఉన్నాడు అని చెప్పి ఆనంద్ ని చూపించి కార్తీక్ లేనప్పుడు నుంచి ఆనంద్ ని కార్తీక్ అనే పిలుస్తున్నాను, కార్తీక్ ని బాబు లో చూసుకుంటున్నాను అని చెప్తుంది.ఇంక నన్ను అనుమానించొద్దు ఆంటీ నేను నిజంగానే చెప్తున్నాను అని అంటుంది. మరోవైపు దీప కార్తీక్ కోసం వెళ్తున్నప్పుడు,ఆనంద్ రావు దీప ను చూస్తాడు. చూసి దీప లా ఉన్నదే అని అంటాడు.అప్పుడు మోనిత,నాకు కూడా కార్తీక్ అప్పుడప్పుడు కనిపిస్తాడు కానీ అది నా బ్రమ. 
 

78

అలాగే మీకు దీప కనిపిస్తున్నట్టు ఉన్నది అని అంటుంది. అదే సమయంలో కార్తీక్ శివతో, నాకు వాళ్ళు ఎవరో గుర్తొస్తున్నట్టు ఉంది అయ్యా అదే సమయంలో తీసుకొచ్చేసావు అని అనగా దీప,నా గురించి మాట్లాడుతున్నారేమో నేను గుర్తొచ్చానేమో అని అక్కడికి వెళ్లి డాక్టర్ బాబు నేనేనా మీకు గుర్తొచ్చాను అని అనగా నువ్వు ఎందుకు మళ్ళీ ఇక్కడికి వచ్చావు అయినా నాకు గుర్తొచ్చి నువ్వు కాదు. అక్కడ ఇద్దరు ఎవరో వచ్చారు వాళ్ళు ఎక్కడో చూసినట్టు అనిపించింది అని అంటాడు. వాళ్లు కస్టమర్లు కాదా ఎవరైనా ఉంటారు అని దీప అనుకుంటుంది.అదే సమయంలో మోనిత ఆనందరావు,కార్తీక్ లతో మీ అనుమానాలన్నీ తొలగిపోయాయి కదా అని చెప్పి అక్కడి నుంచి పంపించేస్తుంది. అదే సమయంలో కార్తీక్ వెళ్లి వాళ్ళ ను ఆపమని అని అనగా వాళ్లు వెళ్లిపోతారు.

88

అప్పుడు మోనిత హమ్మయ్య తృటిలో ప్రమాదం తప్పిపోయింది అని అనుకుంటుంది. అదే సమయంలో దీప అక్కడికి వస్తుంది. దీప ను చూసిన మోనిత, నువ్వెప్పుడొచ్చావే? కార్తీక్ నువ్వు పిలిచావా అని అంటుంది.నీకు ఏమైనా పిచ్చా నేను ఎందుకు పిలుస్తాను అని చెప్పి కార్తిక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కార్తీక్ వెనకాల శివ కూడా వెళ్ళిపోతాడు. అప్పుడు దీప, మోనిత మెడ పట్టుకొని ఆ ఊరోళ్ళు ముందు నన్ను ఏమన్నావే, అయినా నేను  ఎప్పుడు వచ్చేనా అని అడుగుతున్నావంటే నేను చూడకూడనిది ఏమైనా జరిగిందా? ఇక్కడకి  ఎవరు వాళ్ళు అని అనగా మోనిత, మీ అత్త,మామ వచ్చారే. వాళ్లు కారు వెనకాతల పరిగెడతావా పోవే అని అంటుంది. అప్పుడు దీప, పోతాను నీ అంతు చూసే పోతాను అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు మోనిత, ఈ మధ్యన నా నోరు నా అదుపులో ఉండట్లేదు. ఫోన్లో కార్తీక్ అని అరిచాను. దీన్ని ఎప్పుడొచ్చావు అని అన్నాను. ఇంక జాగ్రత్తగా ఉండాలి. హమ్మయ్య అయినా తృటిలో పెద్ద ప్రమాదం తప్ప పోయింది అని అనుకుంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాత భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
విజయ్, రష్మిక వెడ్డింగ్ రిసెప్షన్ లో చిరు, కేటీఆర్, నాని, వెంకీ, నాగ్ సందడి.. టాలీవుడ్ మొత్తం తరలివచ్చిందిగా
Recommended image2
Vijay Divorce: భార్యకి విజయ్‌ రూ.250 కోట్ల భరణం.. దళపతి విడాకుల కేసులో ఊహించని ట్విస్ట్
Recommended image3
Ustaad Bhagat Singh vs Dhurandhar 2: ధురంధర్‌ 2 కూడా వాయిదా.. మార్చి 19న పవన్‌ కళ్యాణ్‌ ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved