MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రజనీకాంత్ మూవీ కలెక్షన్లని అధికమించిన కమెడియన్ చిత్రం, వారం రోజుల్లోనే సంచలనం

రజనీకాంత్ మూవీ కలెక్షన్లని అధికమించిన కమెడియన్ చిత్రం, వారం రోజుల్లోనే సంచలనం

ప్రశాంత్ పాండియరాజ్ దర్శకత్వంలో సూరి, ఐశ్వర్య లక్ష్మి నటించిన 'మామన్' చిత్రం బాక్సాఫీస్ వద్ద రజనీకాంత్ మూవీ లైఫ్ టైం వసూళ్ల రికార్డును బద్దలు కొట్టింది.

2 Min read
Author : Tirumala Dornala
Published : May 25 2025, 03:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కమెడియన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ
Image Credit : Twitter

కమెడియన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ

నటుడు సూరి కమెడియన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం హీరోగా అవకాశాలు అందుకుంటున్నారు. సూరి హీరోగా నటించిన కొత్త సినిమా 'మామన్'. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్. థియేటర్లలో సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చిందని సమాచారం. ప్రశాంత్ పాండియరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజ్‌కిరణ్, బాబా భాస్కర్, స్వాసిక, బాలా సరవణన్ వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. 'హృదయం' వంటి చిత్రాలతో పాటలతో పాపులర్ అయిన హిషామ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. దినేష్ పురుషోత్తమన్ సినిమాటోగ్రఫీ అందించారు.

24
సూరి 'మామన్'
Image Credit : Twitter

సూరి 'మామన్'

ఇంకా ఆర్ట్ డైరెక్టర్ జి. దురైరాజ్, ఎడిటర్ గణేష్ శివ, స్టంట్ మాస్టర్ మహేష్ మాథ్యూ, కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్, కాస్ట్యూమ్ డిజైనర్ ఎం. సెల్వరాజ్, లిరిసిస్ట్ వివేక్, కాస్ట్యూమ్ డిజైనర్ భారతి షణ్ముఖం ఇలా చాలా పెద్ద స్టార్ కాస్టింగ్ ఈ సినిమాలో పనిచేసింది. దర్శకుడు ప్రశాంత్ పాండియరాజ్ దర్శకత్వం వహించిన మొదటి సినిమా మామన్. ఈ సినిమా కథ నటుడు సూరిది.

Related Articles

Related image1
డిప్యూటీ సీఎంనే ఇరిటేట్ చేశాం.. పవన్ కళ్యాణ్ ప్రకటన, థియేటర్ల వివాదంపై బన్నీ వాసు కామెంట్స్
Related image2
వరుస డిజాస్టర్లతో నా పనైపోయింది, చిరంజీవి సరస్వతి దేవి మీద ఒట్టేశారు.. తండ్రీ కొడుకులపై డైరెక్టర్ కామెంట్స్
34
మామన్ బాక్సాఫీస్
Image Credit : Twitter

మామన్ బాక్సాఫీస్

'మామన్' సినిమా మే 16న సంతానం 'DD Returns' సినిమాకి పోటీగా విడుదలైంది. ఈ పోటీలో నటుడు సూరి గెలిచాడు. సంతానం సినిమాకి పెద్దగా ఆదరణ లభించలేదు. కానీ సూరి నటించిన 'మామన్' సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకోవడంతో రెండో వారంలో కూడా థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ వారం విడుదలైన విజయ్ సేతుపతి 'ఏస్' సినిమా కంటే సూరి 'మామన్' సినిమాకే క్రేజ్ ఎక్కువగా ఉంది.

44
వసూళ్ల సంచలనం సృష్టించిన సూరి 'మామన్'
Image Credit : Asianet News

వసూళ్ల సంచలనం సృష్టించిన సూరి 'మామన్'

'మామన్' సినిమా థియేటర్లలో విడుదలై వారం రోజులు అవుతుండగా, ఇప్పటివరకు తమిళనాడులోనే రూ.20 కోట్లకు పైగా వసూలు చేసి చూపించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా వసూళ్లు రూ.25 కోట్లు దాటి ఉంటాయని అంటున్నారు. ఈ సినిమా కేవలం 10 కోట్ల బడ్జెట్‌తోనే నిర్మించబడింది. కానీ దానికి రెట్టింపు వసూలు చేసింది. ఇందులో ఆశ్చర్యం ఏమిటంటే సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'లాల్ సలామ్' సినిమా మొత్తం మీద రూ.20 కోట్లే వసూలు చేసింది. ఆ వసూళ్లను ఒకే వారంలో అందుకున్నాడు సూరి.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Rashmika Mandanna: ఫ్యాన్స్‌ను ఫిదా చేసిన టాప్ 10 ఫొటోలు.. ఏ పోస్టుకు ఎన్ని లక్షల లైక్స్?
Recommended image2
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా? ఇద్దరి డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు?
Recommended image3
Triptii Dimri Movies: యానిమల్ బ్యూటీ చేతిలో 5 సినిమాలు.. రెండు నేరుగా ఓటీటీలోనే!
Related Stories
Recommended image1
డిప్యూటీ సీఎంనే ఇరిటేట్ చేశాం.. పవన్ కళ్యాణ్ ప్రకటన, థియేటర్ల వివాదంపై బన్నీ వాసు కామెంట్స్
Recommended image2
వరుస డిజాస్టర్లతో నా పనైపోయింది, చిరంజీవి సరస్వతి దేవి మీద ఒట్టేశారు.. తండ్రీ కొడుకులపై డైరెక్టర్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved