- Home
- Entertainment
- కత్రినా కైఫ్ పై సోనమ్ కపూర్ పరోక్ష వ్యాఖ్యలు.. లైంగికంగా వేధింపులకు గురైంది, కానీ తోబుట్టువుల కోసం
కత్రినా కైఫ్ పై సోనమ్ కపూర్ పరోక్ష వ్యాఖ్యలు.. లైంగికంగా వేధింపులకు గురైంది, కానీ తోబుట్టువుల కోసం
#MeToo ఉద్యమానికి బలమైన మద్దతుదారు సోనమ్ కపూర్ అహుజా, 2018 ఇంటర్వ్యూలో బాలీవుడ్‌లో తన ఇద్దరు సన్నిహితులు తీవ్ర వేధింపులకు గురైనట్లు చెప్పి సంచలనం సృష్టించింది. పేర్లు చెప్పకపోయినా, "ఏడుగురు తోబుట్టువులు" అన్న మాటతో కత్రినా కైఫ్ గురించేనా అని నెటిజన్లు భావిస్తున్నారు.

#MeToo ఉద్యమానికి మద్దతుగా నిలిచిన సోనమ్ కపూర్, మహిళలు వేధింపుల గురించి ధైర్యంగా మాట్లాడాలని ప్రోత్సహిస్తున్నారు. సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొనే సవాళ్ల గురించి ఆమె మాట్లాడారు. ఈ ఇంటర్వ్యూ క్లిప్ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆమె వ్యాఖ్యలపై చర్చ జరుగుతుంది.
2018 బిజినెస్ ఆఫ్ ఫ్యాషన్ ఇంటర్వ్యూలో, ఇద్దరు సన్నిహితులు తీవ్ర వేధింపులకు గురైనట్లు సోనమ్ చెప్పింది. ఒకరు ఏడుగురు తోబుట్టువులతో కూడిన కుటుంబానికి ఆధారం కాబట్టి మాట్లాడలేకపోయిందని, బాధితురాలిగా ముద్ర వేస్తారని భయపడిందని వివరించింది.వేధింపులకు గురైన సోనమ్ స్నేహితురాలు ఎవరో కాదు కత్రినా కైఫ్ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
సోనమ్ పేర్లు చెప్పకపోయినా, "ఏడుగురు తోబుట్టువులు" అన్న మాటతో కత్రినా కైఫ్ గురించేనా అని నెటిజన్లు భావిస్తున్నారు. దీంతో ఆన్‌లైన్‌లో చర్చ జరుగుతోంది. సోనమ్ ఉద్దేశపూర్వకంగానే ఈ విషయం చెప్పిందా అని ప్రశ్నిస్తున్నారు.వేధింపుల గురించి తాను బహిరంగంగా మాట్లాడి తన కెరీర్ పాడు చేసుకోదలుచుకోలేదని, తాను తన 7 గురు తోబుట్టువుల బాగోగులు చూసుకోవాలని కత్రినా సోనమ్ కి చెప్పినట్లు ఆమె పరోక్షంగా తెలిపారు.
సోనమ్ తన స్నేహితురాలి గుర్తింపును పరోక్షంగా వెల్లడించినందుకు కొందరు విమర్శిస్తుండగా, మరికొందరు ఆమె వర్ణనతో అది ఎవరో సులభంగా ఊహించవచ్చని హాస్యంగా వ్యాఖ్యానించారు.