- Home
- Entertainment
- Sonakshi Sinha: సీక్రెట్‌గా సోనాక్షి సిన్హా ఎంగేజ్‌మెంట్.. కాబోయే వాడితో దోబూచులాట.. ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్?
Sonakshi Sinha: సీక్రెట్‌గా సోనాక్షి సిన్హా ఎంగేజ్‌మెంట్.. కాబోయే వాడితో దోబూచులాట.. ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్?
బాలీవుడ్ స్టార్ కిడ్, హీరోయిన్ సోనాక్షి సిన్హా మరోసారి వార్తల్లో నిలిచింది. ఆమె పంచుకున్న ఫోటోలు షాకిస్తున్నాయి. చూడబోతే సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ అయ్యిందనే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం ఆయా ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

sonakshi sinha engaged
స్టార్ కిడ్‌గా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది సోనాక్షి సిన్హా(Sonakshi Sinha). సీనియర్ నటుడు శతృఘ్న సిన్హా తనయగా ఆమె హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. సల్మాన్ ఖాన్‌తో `దబాంగ్` చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయి రాణిస్తుంది. బొద్దు అందాలతో కనువిందు చేసింది. అయితే ఆశించిన స్థాయిలో ఆమె కెరీర్ సాగడం లేదు. అడపాదడపా సినిమాలు చేస్తూ రాణిస్తుంది.
sonakshi sinha engaged
ఇదిలా ఉంటే తాజాగా ఆమె ఎంగేజ్‌మెంట్ (Sonakshi Sinha Engaged) చేసుకున్నట్టుగా పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో డైమండ్ రింగ్ తొడిగినట్టు ఉన్న ఫోటోలను పంచుకోవడమే ఈ వార్తలకు ఊతమిస్తుంది. ఇందులో తన వేలికి డైమండ్ రింగ్ తొడిగి ఉంది. అంతేకాదు ఓ వ్యక్తి ఆమె చేతిని పట్టుకుని ఉన్నాడు. దీంతో సీక్రెట్ గా సోనాక్షి ఎంగేజ్‌మెంట్ చేసుకుందనే వార్తలు ఊపందుకున్నాయి.
sonakshi sinha engaged
ఈ సందర్భంగా ఓ పోస్ట్ పెట్టింది సోనాక్షి. తన డ్రీమ్ నెరవేరబోతుందని పేర్కొంది. `ఈ రోజు నా లైఫ్‌లో బిగ్ డే. నా పెద్ద కలల్లో ఒకటి నెరవేరబోతుంది. మీతో ఆ విషయాన్ని పంచుకోవడానికి వేచి ఉండలేకపోతున్నా. దీన్ని నేనే నమ్మలేకపోతున్నా` అంటూ లవ్ ఎమోజీలను పంచుకుంది సోనాక్షి. మరి తన డ్రీమ్స్ ఏంటీ? నెరవేరబోయేదేంటి? అనేది సస్పెన్స్ గా మారింది. కానీ సోనాక్షి మాత్రం ఫ్యాన్స్ కి షాకిస్తూనే సస్పెన్స్ లో పెట్టిందని చెప్పొచ్చు.
sonakshi sinha engaged
ఇటీవల సల్మాన్ ఖాన్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్టు వార్తలు వైరల్ అయ్యాయి. గతంలో ఓ సినిమాలో వీరిద్దరికి సంబంధించిన ఎంగేజ్‌మెంట్ ఫోటోలను బయటకు తీసిన నెటిజన్లు ఎంగేజ్‌మెంట్ అయినట్టుగా చిత్రీకరించి వైరల్ చేశారు. దీంతో సోనాక్షి, సల్మాన్ మ్యారేజ్ చేసుకోబోతున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి. దీనిపై సోనాక్షి స్పందించి ఖండించింది.
తాజాగా ఏకంగా ఎంగేజ్‌మెంట్ రింగ్‌తో ఆమె కనిపించడం, ఆ ఫోటోలను అభిమానులతో పంచుకోవడం విశేషం. కెరీర్ ఆశించినస్థాయిలో సాగకపోవడంతో ఎట్టకేలకు పెళ్లికి సిద్ధమవుతుందని అంటున్నారు నెటిజన్లు. మరి ఇందులో నిజమెంతా? లేక తన సినిమా ప్రమోషన్ కోసమా? లేక ఏదైనా జ్యూవెల్లరీ ప్రమోషన్ కోసం ఇలా చేస్తుందా? అనేది సస్పెన్స్ గా మారింది. అదే సమయంలో తనతో పాటు ఉన్న ఆ వ్యక్తి ఎవరనేది మరింత సస్పెన్స్ నెలకొంది. మరి ఈ సస్పెన్స్ కి సోనాక్షి ఎప్పుడు తెరతీస్తుందో చూడాలి.
చివరగా `భుజ్‌ః ది ప్రైడ్ ఆఫ్ ఇండియా` చిత్రంతో మెప్పించిన సోనాక్షి ప్రస్తుతం `కుకుడ`, `డబుల్ ఎక్స్ ఎల్` చిత్రాల్లో నటిస్తుంది. ఇవి చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అవుతున్నాయి. అయితే ఆమె చేతిలో పెద్ద ప్రాజెక్ట్ లు లేకపోవడం గమనార్హం.