MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Bigg boss Telugu 8: కంటెస్టెంట్ల పేర్లు లీక్ చేసిన సోహైల్‌?.. ఈ సారి వాళ్లే స్పెషల్‌? రికమండేషన్‌ పనిచేస్తుందా

Bigg boss Telugu 8: కంటెస్టెంట్ల పేర్లు లీక్ చేసిన సోహైల్‌?.. ఈ సారి వాళ్లే స్పెషల్‌? రికమండేషన్‌ పనిచేస్తుందా

బిగ్‌ బాస్‌ తెలుగు 8వ సీజన్‌కి సంబంధించిన అప్‌డేట్లు, రూమర్లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా దీనిపై బిగ్ బాస్‌ మాజీ కంటెస్టెంట్ సోహైల్‌ స్పందించాడు. రెండుపేర్లు లీక్‌ చేశాడు. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jul 23 2024, 09:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బిగ్‌ బాస్ తెలుగు 8వ సీజన్‌ ప్రారంభానికి సన్నాహాలు జరుగుతున్నాయి. నాగార్జున హోస్ట్ గానే ఈ షో ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ప్రోమో విడుదల చేశారు హోస్ట్ నాగార్జున. ప్రోమో చాలా కొత్తగా, కలర్‌ఫుల్‌గా ఉంది. అదే సమయంలో ఆ ప్రోమోలోనే చాలా మీనింగ్‌ ఉంది. ఇన్‌ఫినిటీ సింబల్‌ చూపించారు. దీని ప్రకారం ఎంటర్‌టైన్‌మెంట్స్ కి ఇక కొదవ లేదని చెప్పొచ్చు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Bigg boss telugu 8

Bigg boss telugu 8

అయితే కంటెస్టెంట్లకి సంబంధించిన వార్తలే ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. చాలా పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఎవరు వస్తారనేది మాత్రం సస్పెన్స్. ఊహాగానాలు మాత్రం చాలానే వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రచారంలో ఉన్న వారిలో యాంకర్‌ వింధ్యా, విష్ణు ప్రియా, ప్రియాంక జైన్ బాయ్‌ ఫ్రెండ్‌ శివ, యాంకర్ నిఖిల్‌, బంచిక్‌ బబ్లూ, సుప్రీత, అమర్‌ దీప్‌ భార్య తేజూ, సీనియర్‌ హీరోయిన్‌ దీపికా, శ్వేతా నాయుడు, సీరియల్‌ నటుడు ఇంద్రనీల్‌, కమెడియన్‌ సద్దాం, యాదమ్మ రాజు, కుషితా కల్లాపు, రీతూచౌదరి, కిర్రాక్ ఆర్పీ, మై వీలేజ్‌ షో అనిల్‌, సాయికిరణ్‌, నటి సనా, శీతల్‌ గౌతమ్‌ వంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి. వీరితోపాటు వినోద్ కుమార్‌ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. మరి ఇందులో ఎవరు వస్తారనేది సస్పెన్స్ గా మారింది. 
 

36

ఇదిలా ఉంటే బిగ్‌ బాస్‌ షోతో పాపులర్‌ అయిన సోహైల్‌ దీనిపై స్పందించారు. అంతేకాదు ఇద్దరు పేర్లు లీక్‌ చేశాడు. బిగ్‌ బాస్‌ షో గురించి ఆయన మాట్లాడుతూ, మనిషి రియాలిటీని టీవీలో చూపించడం చాలా బాగుంటుంది. మనల్ని మనం షోలో చూస్తుంటే అదొక మంచి ఫీలింగ్‌, గ్రేట్‌ ఎక్స్ పీరియెన్స్. షో కోసం ఈ సారి కూడా ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేస్తున్నాను. బిగ్ బాస్‌ అంటేనే ఎంటర్టైన్‌మెంట్‌, ఈ సారి కూడా అదిరిపోతుందన్నారు సోహైల్‌. 
 

46

అయితే కంటెస్టెంట్లుగా ఎవరు వస్తారనేది తనకు తెలియదని, కానీ తన ఫ్రెండ్స్ ఇద్దరు బాగా ట్రై చేస్తున్నట్టు తెలిపారు. నజీమ్‌ అనే అబ్బాయి ఫోన్‌ చేస్తున్నాడని, సింగర్‌ అఫ్రజ్‌ అలీ  బిగ్ బాస్‌ షో నిర్వహకులకు చెప్పమని అడుగుతున్నారని, కానీ వాళ్లు వస్తారో రారో తెలియదన్నాడు సోహైల్. అయితే బిగ్‌ బాస్‌ షోలో రికమండేషన్‌ పనిచేయదని, ఆ పరిచయంతో తెలిసినవాళ్లు ఉన్నారు, చూడండి అన్నా అని మాత్రమే చెబుతామని, వాళ్లని తీసుకుంటారా? లేదా అనేది తెలియదన్నాడు సోహైల్‌. 
 

56
Bigg boss Telugu

Bigg boss Telugu

అయితే ఈ సారి షోలో కొంత మంది కంటెస్టెంట్ల పేర్లు చాలా ఎగ్జైటింగ్‌గా అనిపిస్తున్నాయి. అందులో విష్ణుప్రియా, సీరియల్‌ నటి దీపికా, అలాగే శ్వేతా నాయుడు, సద్దాం, సుప్రీత, రీతూ చౌదరి, యాంకర్‌ నిఖిల్‌ వంటి వారు ఎగ్జైట్‌ చేస్తున్నారు. వీళ్లు వస్తే షో రక్తికడుతుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. బిగ్ బాస్‌ అభిమానులు కూడా ఈ పేర్లని బాగా సూచిస్తున్నారు. వస్తే ఈ కంటెస్టెంట్లు చాలా స్పెషల్‌గా ఉంటారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరి ఇందులో ఎవరు వస్తారనేది మాత్రం షో ప్రారంభం రోజు వరకు గానీ క్లారిటీ రాదు. ఈ ఎనిమిదో సీజన్‌ షోని సెప్టెంబర్‌ మొదటి వారంలోనే ప్రారంభించబోతున్నారు. ఈ సారి షోలో కొత్త లుక్స్ ఉంటాయని తెలుస్తుంది. అవేంటనేది చూడాలి. 
 

66

బిగ్‌ బాస్‌ 4వ సీజన్‌లో సోహైల్‌ పాల్గొన్న విషయం తెలిసిందే. టాప్‌ 3లోనే మనీ తీసుకుని బయటకు వచ్చాడు. కానీ విన్నర్‌కి మించిన క్రేజ్‌ సోహైల్‌ కి వచ్చింది. చిరంజీవి, నాగార్జున సైతం అతన్ని అభినందించారు. ప్రశంసలు కురిపించారు. చిరు ఏకంగా ఇంటికి పిలిపించి బిర్యానీ పెట్టించాడు. ఆ క్రేజ్‌తో సోహైల్‌ వరుసగా హీరోగా సినిమాలు చేశారు. ఇప్పటి వరకు మూడు సినిమాలు విడుదలయ్యాయి. కానీ అవి బోల్తా కొట్టాయి. ఇప్పుడు ఓ ఓటీటీ ఫిల్మ్, మరో సినిమా చేస్తున్నట్టు తెలిపారు సోహైల్‌. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Recommended image2
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image3
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved