- Home
- Entertainment
- Ram Charan: RC 17 ఘనంగా ప్రారంభం.. నెమలి పింఛం థీమ్ ఏంటి.. సుక్కు దాచిపెట్టిన సంగతులెన్నో ?
Ram Charan: RC 17 ఘనంగా ప్రారంభం.. నెమలి పింఛం థీమ్ ఏంటి.. సుక్కు దాచిపెట్టిన సంగతులెన్నో ?
రాంచరణ్, సుకుమార్ కాంబినేషన్ లో ఆర్సీ 17 చిత్రం ఆదివారం రోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయింది. కానీ చాలా ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది. సినిమా బ్యాక్ డ్రాప్ ఏంటి అనేది ఇంకా తెలియదు.

రాంచరణ్, సుకుమార్ కాంబినేషన్
మెగా పవర్ స్టార్ రాంచరణ్ చివరగా నటించిన పెద్ది మూవీ బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. కానీ రాంచరణ్ స్టామినాకి ఆ సినిమా సరిపోలేదు. మెగా అభిమానులు పాన్ ఇండియా స్థాయిలో రీ సౌండ్ వినిపించాలి అని కోరుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ నటించిన గేమ్ ఛేంజర్, పెద్ది రెండు చిత్రాలు ఆశించిన రెస్పాన్స్ ఇవ్వలేదు. దీనితో మెగా అభిమానులంతా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.
RC 17 ఘనంగా ప్రారంభం
మొత్తానికి సుక్కు, రాంచరణ్ కాంబోలో రెండవ చిత్రం ప్రారంభం అయింది. ఆదివారం రోజు మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఈ చిత్రం లాంచ్ అయింది. ఈ కార్యక్రమానికి మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మాతలు రవి శంకర్, నవీన్ తో పాటు సతీసమేతంగా సుకుమార్ హాజరయ్యారు. డీవోపీ రత్నవేలు కూడా పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. మెగా పవర్ స్టార్ రాంచరణ్ పెద్ది సినిమా కోసం పెంచిన లాంగ్ హెయిర్ ని కొనసాగిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు సుకుమార్, రాంచరణ్ పై ఫస్ట్ క్లాప్ ఇచ్చి ఈ చిత్రాన్ని ప్రారంభించారు.
సమాధానం రావాల్సిన ప్రశ్నలు
దిల్ రాజు, నాగవంశీ, టిజి విశ్వప్రసాద్, డైరెక్టర్ మారుతి, బుచ్చిబాబు, గోపీచంద్ మలినేని, అనిల్ తడానీ, టి సిరీస్ భూషణ్ కుమార్ అతిథులుగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మూవీ అయితే ఘనంగా లాంచ్ అయింది కానీ అభిమానులలో కొన్ని ప్రశ్నలు మాత్రం అలాగే మిగిలిపోయాయి. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఎవరు ? హీరోయిన్ ఎవరు ? అనే సస్పెన్స్ ఇంకా వీడలేదు.
సినిమా బ్యాక్ డ్రాప్ ఏంటి ?
ఈ చిత్రాన్ని అనౌన్స్ చేస్తూ బ్లూ కలర్ థీమ్ లో నెమలి పించం, రాంచరణ్ ముఖం మిక్స్ అయ్యేలా కళాత్మకంగా పోస్టర్ రిలీజ్ చేశారు.నెమలి పింఛం అనగానే అందరికీ శ్రీకృష్ణుడు గుర్తుకు వస్తారు. దీనితో సినిమా బ్యాక్ డ్రాప్ పై అనేక ఊహాగానాలు మొదలయ్యాయి.
భారీ బడ్జెట్ లో పాన్ ఇండియా మూవీ
కానీ దేనిపైనా క్లారిటీ లేరు. వీటన్నింటికీ క్లారిటీ రావాలి అంటే సుకుమార్ స్పందించాల్సిందే. భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రంగా ఈ మూవీ తెరకెకెక్కబోతోంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.





