- Home
- Entertainment
- వెడ్డింగ్ ఫోటోస్ షేర్ చేసిన 'గూఢచారి' హీరోయిన్.. ఇదేం ట్విస్ట్ బాబోయ్, మరి ఆ హీరోతో డేటింగ్ ?
వెడ్డింగ్ ఫోటోస్ షేర్ చేసిన 'గూఢచారి' హీరోయిన్.. ఇదేం ట్విస్ట్ బాబోయ్, మరి ఆ హీరోతో డేటింగ్ ?
తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శోభిత నార్త్ బ్యూటీలని మించేలా గ్లామర్ షోలో రెచ్చిపోతోంది. గూఢచారి చిత్రంతో శోభిత మంచి గుర్తింపు దక్కించుకుంది.

తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శోభిత నార్త్ బ్యూటీలని మించేలా గ్లామర్ షోలో రెచ్చిపోతోంది. గూఢచారి చిత్రంతో శోభిత మంచి గుర్తింపు దక్కించుకుంది. 30 ఏళ్ల ఈ నాజూకు అందగత్తెకు తెలుగులో మాత్రమే కాకుండా హిందీ, తమిళ భాషల్లో కూడా అవకాశాలు దక్కుతున్నాయి.
గూఢచారి చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఆమె గురించి తరచుగా రూమర్స్ వస్తూనే ఉన్నాయి. అక్కినేని నాగచైతన్యతో ఎఫైర్ కొనసాగిస్తోంది అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. వీరిద్దరి ఎఫైర్ రూమర్స్ విషయంలో సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతోంది. బాలీవుడ్ మీడియాలో సైతం వీళ్లిద్దరి గురించి వార్తలు వస్తున్నాయి.
కానీ తాజాగా ఫ్యాన్స్ కి శోభిత స్వీట్ షాక్ ఇచ్చే ప్రయత్నం చేసింది. వెడ్డింగ్స్ ఇన్ దుబాయ్ అంటూ కొన్ని ఫోటోలు షేర్ చేసింది. దీనితో ఆమె అభిమానులు ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఒక వ్యక్తితో శోభిత వివాహం చేసుకుంటున్నట్లు ఆ పిక్స్ ఉన్నాయి.
శోభిత వెడ్డింగ్ ఫోటో షూట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. దీనితో శోభిత నిజంగానే పెళ్లి చేసుకుందా అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. కానీ ఇది నిజం పెళ్లి కాదు. ఓ యాడ్ షూట్ కోసం శోభిత ఇలా పెళ్లి కూతురిలా ఫోటో షూట్ చేసింది.
శోభిత వయసు 30 ఏళ్ళు. కెరీర్ పైనే ద్రుష్టి పెడుతూ ఆమె పిల్లి గురించి పట్టించుకోవడం లేదు. అయితే కొంత కాలంగా ఆమె నాగ చైతన్యతో రిలేషన్ షిప్ లో ఉందంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. వీరిద్దరూ కలసి ముంబైలో కనిపించారు అంటూ కూడా బాలీవుడ్ మీడియా గతంలో పేర్కొంది.
అయితే శోభిత యాడ్ ఫోటో షూట్ పై ఫ్యాన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. నాకు చిన్నపాటి స్ట్రోక్ వచ్చినంత పని అయింది అని ఓ నెటిజన్ పేర్కొనగా మరో నెటిజన్ నువ్వు నిజంగానే పెళ్లి చేసుకున్నట్లు నాకు సందేహం కలిగింది అని పేర్కొన్నారు.