అత్యధిక వసూళ్లని రాబట్టిన ఇండియన్ సినిమాల్లో అమీర్ ఖాన్ `దంగల్` మొదటి స్థానంలో ఉంటుంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా రెండు వేల( రూ.2070)కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టింది.
ప్రభాస్, అనుష్క, రానా, తమన్నా కలిసి నటించిన `బాహుబలి 2` అత్యధిక వసూళ్లని రాబట్టిన ఇండియన్ మూవీస్‌లో ఇది రెండో చిత్రం. రాజమౌళి రూపొందించిన ఈ మూవీ రూ.1810కోట్లు రాబట్టింది.
Image credits: netflix
Telugu
3.పుష్ప 2
అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా, సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన `పుష్ప 2` మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.1742కోట్లు వసూలు చేసింది. ఇది మూడో స్థానంలో ఉంది.
Image credits: our own
Telugu
4.ధురంధర్ 2
రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ రూపొందించిన `ధురంధర్ 2` ఇప్పుడు టాప్ 5లోకి వచ్చింది. ఇది నాల్గో స్థానంలో నిలిచింది. దీనికి ఇప్పటి వరకు రూ.1711కోట్లు వచ్చినట్టు సమాచారం.
Image credits: X/@AdityaDharFilms
Telugu
5.ధురంధర్
అత్యధిక కలెక్షన్లని రాబట్టిన ఇండియా టాప్ 5 మూవీలో ఐదో స్థానంలో `ధురంధర్` ఉంటుంది. దీనికి రూ.1354కోట్లు వచ్చినట్టు టాక్. టాప్ 5లో రెండు రణ్‌వీర్ మూవీస్ ఉండటం విశేషం.