శోభితా ధూళిపాళ్లకి అక్కినేని ఫ్యాన్స్ రిక్వెస్ట్?, వాటిని ఆపేయ మంటూ
అదే సమయంలో ఫ్యాన్స్ లో కొందరు ...శోభిత ధూళిపాళను ఉద్దేశించి సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.
sobhita dhulipala
అక్కినేని నాగార్జున తనయుడు నాగచైతన్య, నటి శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలసిందే. ఈ నెల 8న ఈ జంట అఫీషియల్‌గా ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఈ విషయాన్ని నాగార్జున ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా నూతన జంటకు పలువురు సినీతారలు, అభిమానులు అభినందనలు తెలిపారు. అలాగే అక్కినేని అభిమానులు సైతం పండగ వాతావరణం సోషల్ మీడియాలో క్రియేట్ చేసారు. తమ ఇంట్లో శుభవార్తలాగే అందరూ ఫీలయ్యారు. అయితే అదే సమయంలో వాళ్లు శోభితకు ఓ రిక్వెస్ట్ చేస్తున్నారు.
అక్కినేని నాగచైతన్య రెండో వివాహం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నటి శోభిత ధూళిపాళతో నాగార్జున నివాసంలో ఈ జంటకు సింపుల్‌గా ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఈ విషయాన్ని చైతన్య తండ్రి, హీరో అక్కినేని నాగార్జున ధ్రువీకరిస్తూ, శోభితను ఎంతో సంతోషంగా తమ కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు. "చైతన్య, శోభితలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ రోజు అనంతమైన ప్రేమకు ఆరంభం" అంటూ చైతన్య, శోభిత నిశ్చితార్థం ఫొటోలను ఎక్స్ లో పంచుకున్న నాగార్జున వారిద్దరు జీవితాంతం ప్రేమగా, సంతోషంగా కలకాలం ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం విషయంలో తాము సంతోషంగా ఉన్నామని హీరో నాగార్జున తెలిపారు. విడాకుల అనంతరం చైతన్య చాలా బాధపడ్డారని వివరించారు. తన బాధను ఎవరితోనూ పంచుకోలేదని వెల్లడించారు. చైతూ సంతోషంగా ఉండటం చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని చెప్పారు. పెళ్లికి కాస్త సమయం తీసుకుంటామని నాగార్జున వెల్లడించారు.
ఇక అదే సమయంలో ఫ్యాన్స్ లో కొందరు ...శోభిత ధూళిపాళను ఉద్దేశించి సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. గతంలో ఎలాంటి హాట్ ఫొటో షూట్ లు చేసినా, బోల్డ్ సీన్స్ చేసినా ప్లాబ్లం లేదు. ఇప్పుడు అక్కినేని కుటుంబంలోకి వచ్చావు..ఆ లెగసీని కాపాల్సిన భాధ్యత నీపైన కూడా ఉంది కాబట్టి అలాంటివాటికి దూరంగా ఉండమని కోరుతున్నారు. అయితే చైతూ,కానీ వాళ్ల ఫ్యామిలీకానీ అలాంటి డిమాండ్స్ చేసినట్లు మనకు తెలియదు. చేస్తారని అనుకోం. ఎందుకంటే వాళ్లు అదే పరిశ్రమలో ఉంటున్నవాళ్లు కావటంతో నటన, రియల్ లైఫ్ కు తేడా తెలుసు.
Actress Shobita Dhulipala
ఇదిలా ఉంటే ఫ్యామిలీ మ్యాన్ 2 లో సమంత చేసిన బోల్డ్ సీన్స వల్లే విడాకులకు దారి తీసిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అవి దృష్టిలో పెట్టుకుని సమంత అభిమానులం అని చెప్పుకొనే కొందరు ... శోభిత పాత సీన్స్, పాత ఫొటో షూట్ లు హాట్ గా ఉండేవి ఎక్కడెక్కడివి తవ్వి షేర్ చేస్తున్నారు. వాటిని చూపుతూ ఇప్పుడు నాగచైతన్య ఏం సమాధానం చెప్తారని అంటున్నారు. ఇలా ఎవరి స్దాయిలో , ఎవరి ఆలోచనలతో వాళ్లు ఈ నిశ్చితార్దాన్ని అడ్డం పెట్టుుకుని సోషల్ మీడియాలో యుద్దాలు చేసేస్తూండటం విశేషం.
Sobhita photos
చైతు, శోభితల నిశ్చితార్థం ఇరు కుటుంబాల సమక్షంలో చాలా సింపుల్ గా జరిగింది. ఇండస్ట్రీలో చాలా మంది ఈ జంటకు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. అభిమానులు అయితే చైతు మంచి నిర్ణయం తీసుకున్నాడంటూ విషెష్ చెప్తున్నారు. ఈ క్రమంలో సమంత, నాగచైతన్య వైవాహిక జీవితం కూడా చాలా మంది గుర్తు చేసుకుంటున్నారు. అలాగే శోభిత ఎవరు, ఆమె ఎక్కడ నుంచి వచ్చిందనే వివరాలు గూగుల్ సాక్షిగా కూపీ లాగుతున్నారు.
నైట్ మేనేజర్ 2 లో శోభిత నటించిన శృంగార సన్నివేశాల గురించి సోషల్ మీడియాలో హాట్ హాట్ డిస్కషన్ జరుగింది. ఈ తెనాలి తెలుగు పిల్ల బాలీవుడ్ నే కాదు ఇండియా మొత్తాన్ని ఊపేస్తోంది అంటూ కామెంట్స్ వినిపించాయి. బజార్ అనే మ్యాగజైన్ కోసం శోభిత ఇలా ఫోజులు ఇచ్చింది. ఇవన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ హల్ చల్ చేస్తున్నాయి
ఇక 2017లో నటి సమంత, నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నా అది ఎంతోకాలం నిలవలేదు. వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో కొంతకాలం దూరంగా ఉన్నారు. అనంతరం 2021 అక్టోబర్‌లో విడిపోతున్నట్టుగా ప్రకటించారు. ఆ తర్వాత కొంతకాలానికి చైతూ-శోభిత జంటపై రూమర్స్ మొదలయ్యాయి. ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని, లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నారని వార్తలు వచ్చాయి. అయితే వారిద్దరూ కన్ఫర్మ్ చేయలేదు. కానీ ఇప్పుడు ఏకంగా నిశ్చితార్థం చేసుకోడం ఇంట్రెస్టింగ్‌గా మారింది.