సమంత, నాగ చైతన్యలో శోభితకి నచ్చిన అంశాలు ఇవే.. ప్రభాస్, రష్మికపై క్రేజీ కామెంట్స్
అక్కినేని నాగ చైతన్య, శోభిత పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. మరికొన్ని గంటల్లోనే వీరిద్దరూ మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు. వీరిద్దరి వివాహంపై ఇండస్ట్రీలో, అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది.
అక్కినేని నాగ చైతన్య, శోభిత పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. మరికొన్ని గంటల్లోనే వీరిద్దరూ మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు. వీరిద్దరి వివాహంపై ఇండస్ట్రీలో, అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఇది నాగ చైతన్యకి రెండవ వివాహం. సమంతతో విడిపోయిన తర్వాత చైతు శోభితని ప్రేమించారు.
రెండేళ్లు ప్రేమలో మునిగిపోయిన ఈ జంట ఎట్టకేలకు వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. శోభిత నటిగా, మోడల్ గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో శోభిత చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చైతూతో తన ప్రేమ బయటపడక ముందే శోభిత.. చైతు, సమంత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఓ ఇంటర్వ్యూలో శోభిత రాపిడ్ ఫైర్ లో భాగంగా సమంత గురించి ఇలా సంధించింది. సమంత సినిమా జర్నీ అద్భుతం. ఆమె ప్రతి ప్రాజెక్టు ని ఎంచుకునే విధానం నాకు చాలా నచ్చుతుంది అని శోభిత తెలిపింది. రష్మిక గురించి చెబుతూ.. ఆమె సింపుల్ లుక్ లో కూడా చాలా అందంగా ఉంటుంది అని శోభిత కాంప్లిమెంట్ ఇచ్చింది.
ఇక నాగ చైతన్యలో అతడి కూల్ అండ్ కామ్ నెస్ అంటే ఇష్టం అని పేర్కొంది. ప్రభాస్ గురించి చెబుతూ.. నా అభిమాన నటుల్లో ప్రభాస్ ఒకరు. ఛత్రపతి నుంచి ఆయన ప్రతి చిత్రం చూస్తున్నా అని తెలిపింది. రానా గురించి మాట్లాడుతూ.. తాను ప్రతిదీ కొత్తగా ట్రై చేస్తుంటాడు. కొత్తదనం కోరుకుంటాడు అని శోభిత పేర్కొంది.