MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • చిరంజీవి, బి గోపాల్, మణిశర్మలలో ఇంద్ర మూవీ సక్సెస్ క్రెడిట్ ఎవరిది ?.. మెగాస్టార్ మైండ్ బ్లోయింగ్ ఆన్సర్

చిరంజీవి, బి గోపాల్, మణిశర్మలలో ఇంద్ర మూవీ సక్సెస్ క్రెడిట్ ఎవరిది ?.. మెగాస్టార్ మైండ్ బ్లోయింగ్ ఆన్సర్

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో ఇంద్ర ఒకటి. అందులో ఎలాంటి సందేహం లేదు. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇండస్ట్రీ రికార్డులని తిరగరాసింది. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Dec 03 2024, 09:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో ఇంద్ర ఒకటి. అందులో ఎలాంటి సందేహం లేదు. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇండస్ట్రీ రికార్డులని తిరగరాసింది. ఇంద్ర చిత్రంలో చిరంజీవికి జోడిగా ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రే హీరోయిన్లుగా నటించారు. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

చిరంజీవి చేసిన డ్యాన్సులు, ఫైట్స్, ఇంటర్వెల్ లో ట్విస్ట్ ఇలా ప్రతి ఒక్కటీ హైలైట్ గా నిలిచింది. ఇక మణిశర్మ సంగీతం అయితే నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది. మణిశర్మ కెరీర్ లో బెస్ట్ సాంగ్స్, బెస్ట్ బిజియం ఇచ్చారు. అశ్విని దత్ నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కింది. జగదేక వీరుడు అతిలోక సుందరి, చూడాలని ఉంది లాంటి హిట్ చిత్రాల తర్వాత చిరంజీవి, అశ్విని దత్ కాంబోలో వచ్చిన ఇంద్ర చరిత్రలో నిలిచిపోయే విజయం దక్కించుకుంది. 

 

35

ఇంద్ర రిలీజ్ అయి అఖండ విజయాన్ని అందుకున్న తర్వాత చిరంజీవి చిత్ర యూనిట్ కి పార్టీ ఇచ్చారట. రచయిత దర్శకుడు బివిఎస్ రవి ఓ ఇంటర్వ్యూలో ఆ పార్టీలో జరిగిన సంఘటన గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సరదాగా పార్టీ జరుగుతోంది. చిత్ర యూనిట్ మొత్తం ఎంజాయ్ చేస్తున్నారు. ఇంద్ర విజయంలో క్రెడిట్ ఎవరికి దక్కుతుంది అనే చర్చ జరిగిందట. ఎక్కువ క్రెడిట్ చిరంజీవి గారిది అని చాలా మంది చెప్పారు. మణిశర్మకి కూడా క్రెడిట్ దక్కుతుందని కొందరు.. కొందరు డైరెక్టర్ బి గోపాల్ కి దక్కుతుంది అని ఇలా చర్చ జరుగుతూ ఉంది. 

 

45

కానీ చిరంజీవి గారు ఒకే ఒక్కరికి ఇంద్ర మూవీ క్రెడిట్ మొత్తం ఇచ్చేశారట. ఆయన ఎవరో కాదు రచయిత చిన్ని కృష్ణ. ఇంద్ర ఇంత విజయం సాధించింది అంటే అందుకు ప్రధాన కారణం చిన్ని కృష్ణ అందించిన కథే అని చిరంజీవి అన్నారట. దీనితో అంతా షాక్ అయి ఒక్కసారిగా చప్పట్లు కొట్టినట్లు బివిఎస్ రవి తెలిపారు. చిన్ని కృష్ణ కథ ఇవ్వకపోతే అసలు ఇంద్ర చిత్రమే లేదు అనేది చిరంజీవి అభిప్రాయం. 

 

55

చిరంజీవి.. చిన్ని కృష్ణకి అంతటి ప్రాధాన్యత ఇచ్చారు. అయినప్పటికీ చిన్ని కృష్ణ తర్వాతి రోజుల్లో రాజకీయ కారణాలతో చిరంజీవిని దూషించిన సంగతి తెలిసిందే. చిరంజీవి తనకి ఏనాడూ పిలిచి విస్తరి వేయలేదు అంటూ చిన్ని కృష్ణ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత మళ్ళీ తన తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్పారు. ఇంద్ర రీ రిలీజ్ అయినప్పుడు చిరంజీవి మరోసారి చిత్ర యూనిట్ ని చిన్నికృష్ణతో సహా ఇంటికి పిలిచి సన్మానించిన సంగతి తెలిసిందే. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
The Paradise: ది ప్యారడైజ్ సెన్సార్ రివ్యూ, అణచివేతకు వ్యతిరేకంగా జడల్ చేసిన విధ్వంసం.. నాని నటనకు జయహో
Recommended image2
Village Backdrop Movies: రాంచరణ్ నుంచి రవితేజ వరకు, హీరోలకు సవాల్..వందల కోట్లు తెచ్చిన ముసుగు విలన్లు వీళ్ళే
Recommended image3
SJ Surya Villain Movies: ఇండియన్ 2 నుంచి సర్దార్ 2 వరకు.. ఎస్.జే.సూర్య విలనిజం ఎందుకు ఫ్లాప్ అవుతోంది? జైలర్ 2 గట్టెక్కిస్తుందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved