Sobhita Dhulipala: శోభితకు ఇష్టమైన సినిమా అదే, ఆమె భర్త చైతూది మాత్రం కాదు
Sobhita Dhulipala: నటి శోభితా ధూళిపాళ అక్కినేని కోడలిగా మారాక ఆమెకు అభిమానులు ఎక్కువైపోయారు. అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన చీకటిలో సినిమాతో శోభితకు ఇంకా మంచి పేరు వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా గురించి అన్నీ పాజిటివ్ రివ్యూలు వచ్చాయి.

శోభితా చీకటిలో సినిమా హిట్
టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి శోభితా ధూళిపాళ. ఆమె అక్కినేని ఇంటి కోడలిగా మారాక మరింతగా క్రేజ్ పెరిగిపోయింది. తాజాగా ఆమె సినిమా చీకటిలో అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆమె పలు ఛానెళ్లకు ఇంటర్య్వూలు ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాలను పెంచుకుంది. అన్నట్టు శోభితా చేసిన మర్డర్ థ్రిల్లర్ సినిమా చీకటిలో ఇప్పటికే పాజిటివ్ రివ్యూలను తెచ్చుకుంది. అక్కినేని కోడలు తెలుగులో హిట్ కొట్టిందనే చెప్పుకోవాలి.
శోభితకు ఇష్టమైన సినిమా
ఒక ఇంటర్య్వూలో శోభితను ఆమెకు ఇష్టమైన తెలుగు సినిమా ఏదని ప్రశ్నించారు విలేకరులు. దానికి ఆమె కొంచెం కూడా ఆలోచించకుండా ‘ఆనంద్’ అని చెప్పింది. దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘ఆనంద్’ సినిమా తన మనసుకు చాలా నచ్చిందని వివరించింది. 2004లో విడుదలైన ‘ఆనంద్’ సినిమాలో కనిపించే కథ, సహజమైన పాత్రలు, భావోద్వేగాల్ని చాలా సున్నితంగా చూపించారు. ముఖ్యంగా సినిమా చూస్తున్నంతసేపు ఆ పాత్రలతో మనం కూడా ప్రయాణం చేస్తున్నట్టుగా అనిపిస్తుందని ఆమె చెప్పారు. నిజానికి నాగ చైతన్య సినిమా పేరు ఏదైనా చెబుతుందని అందరూ ఆశించారు. కానీ ఆమె నిజాయితీగా తనకు నచ్చిన సినిమా పేరు చెప్పింది.
నా భర్తను సలహాలు అడుగుతా
శోభితా తన భర్త నాగచైతన్య గురించి మాట్లాడుతూ తనకు చాలా సపోర్టివ్ గా ఉండే వ్యక్తి అని అంది. ఇద్దరం సినిమాల గురించి ఎక్కువ మాట్లాడుకుంటామని, కానీ తమ తమ కెరీర్ నిర్ణయాలు మాత్రం స్వతంత్రంగానే తీసుకుంటామని చెప్పింది. ఒక సినిమా ఒప్పుకునే ముందు కథా బలం, పాత్రకు ఉన్న ప్రాధాన్యాన్నే తాను ఎప్పుడూ చూస్తానని శోభితా తెలిపింది. తన సినిమాల విషయయంలో కూడా నాగచైతన్యను కేవలం సజెషన్ మాత్రమే అడుగుతానని, నిర్ణయం తానే తీసుకుంటానని తేల్చి చెప్పింది శోభితా.
అమ్మ సినిమాలు వద్దంది
లాక్ డౌన్ సమయంలో తన తల్లి సినిమాలు వదిలేసి గేట్ పరీక్ష రాసి పై చదువులకు వెళ్లమని చెప్పేదని, కానీ తాను సినిమాల్లోనే ఉండేందుకు ఇష్టపడ్డానని చెప్పింది శోభితా. తన కుటుంబానికి సినిమాలతో ఎలాంటి సంబంధాలు లేకపోవడంతో వారు అలా చెప్పారని వివరించింది. అయితే తాను ఏ పని చేసినా కూడ తల్లిదండ్రలు సపోర్ట్ చేసేవారని, వద్దని మాత్రం చెప్పేవారు కాదని వివరించింది. పెళ్లయిన తరువాత వచ్చిన తొలి సంక్రాంతిని హైదరాబాద్ లో అక్కినేని కుటుంబంతోనే సెలెబ్రేట్ చేసుకున్నానని ఆమె వివరించింది.

