షారూక్ ఖాన్ కోసం ఎదురు చూస్తున్నా...అభిమానికి శోభితా ధూళిపాళ సమాధానం
షారుఖ్ ఖాన్ తో నటించడంపై స్పందించింది హీరోయిన్ శోభితా ధూళిపాళ, ఓ అభిమాని చేసిన ట్వీట్ కు రిప్లై ఇచ్చిన శోభితా.. రిప్లై ఇస్తూ.. తన మనసులో మాట బయటపెట్టింది.

నటి శోభితా ధూళిపాళ షారూఖ్ ఖాన్ రాబోయే సినిమా 'జవాన్' గురించి మాట్లాడారు. సూపర్ డూపర్ ఎగ్జైటెడ్ అంటూ ఓ అభిమాని చేసిన ట్వీట్‌కి ఆమె రిప్లై ఇచ్చింది. షారుఖ్ ఖాన్‌తో కలిసి పనిచేయడానికి తాను ఎంతో ఉత్సాహంగా ఉన్నానంటోంది. ట్విట్టర్‌లో ఆస్క్ మి ఎనీథింగ్ సెషన్‌లో పాల్గొన్న శోభిత ధూళిపాళ తాను షారూఖాన్ కు వీరాభిమానిని అన్నారు. జవాన్ సినిమా కోసం ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నాను అన్నారు శోభిత.
ది నైట్ మేనేజర్' వెబ్ సిరీస్ ఫస్ట్ సీజన్... సెకండ్ పార్ట్ కోసం ఎదురు చూస్తోంది శోభితా ధూళిపాళ. తాజాగా శోభితా.. ఆదిత్య రాయ్ కపూర్ మరియు అనిల్ కపూర్‌లతో కలిసి స్పెషల్ షోలో పాల్గొంది. దాని సంబంధింవచిన ఫోటోలు కూడా తన సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది బ్యూటీ.
ఇక ఆతరువాత శోభితా ధూళిపాళ ట్విట్టర్‌లో ఆస్క్ మి ఎనీథింగ్ సెషన్‌ను నిర్వహించింది. సెషన్‌లో, శోభిత తాను సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్‌ను ఆరాధిస్తానని వెల్లడించింది. షారుఖ్ నెక్ట్స్ మూవీ జవాన్ గురించి మీరు ఉత్సాహంగా ఉన్నారా అని ఒక అభిమాని అడిగినప్పుడు, ఆమె "సూపర్ డూపర్ ఎగ్జైటెడ్ అంటూ బదులు ఇచ్చింది.
దీనిపై మరో అభిమాని స్పందిస్తూ.. ఎప్పుడో ఒకప్పుడు నువ్వు తప్పకుండా షారుఖ్ తో కలిసి పని చేస్తావు’ అని ట్వీట్ చేశాడు. నటి బదులిస్తూ, "అయ్యో చాలా ధన్యవాదాలు అంటూ ఆ అభిమానికి రిప్లై ఇచ్చింది షారుఖ్.
రీసెంట్ గా శోభితా నటించిన రమణ్ రాఘవ్ 2.0 మూవీ ఏడేళ్ళు పూర్తి చేసుకుంది. ఈ మూవీ గురించి గురించి కూడా శోభితను ప్రశ్నించారు ఫ్యాన్స్. ఇక ఆమె మాట్లాడుతూ.. ఆసినిమా నాకు చాలా ప్రత్యేకమైనది ,నా హృదయానికి చాలా దగ్గరగా ఉంటుంది అన్నారు. ఇది నా తొలి సినిమా.. అందుకే నాకు ప్రత్యేకం అన్నారు శోభిత.