MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • హోటల్‌ వాడు చేసిన పనికి 45ఏళ్ల హ్యాబిట్ ని మానేసిన శోభన్‌బాబు.. సోగ్గాడితో పెట్టుకుంటే అలా ఉంటది మరి..

హోటల్‌ వాడు చేసిన పనికి 45ఏళ్ల హ్యాబిట్ ని మానేసిన శోభన్‌బాబు.. సోగ్గాడితో పెట్టుకుంటే అలా ఉంటది మరి..

తెలుగు తెర సోగ్గాడు శోభన్‌ బాబు తన అలవాట్లు ఎలా ఉంటాయో వెల్లడించాడు. ఈ క్రమంలో ఓ షాకింగ్‌ విషయం చెప్పాడు. 45ఏళ్లు ఫాలో అయిన ఒక హ్యాబిట్‌ని మానేయడం వెనుక స్టోరీ చెప్పాడు. 
 

Aithagoni Raju | Published : May 12 2024, 05:52 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
17
Asianet Image

 శోభన్‌బాబు అంటే సోగ్గాడు అనే పదం గుర్తుకు వస్తుంది. సోగ్గాడు అనేది శోభన్‌బాబుకి పర్యాయపదంగా మారింది. సినిమా స్టార్లలో సిస్టమాటిక్‌ లైఫ్‌ని లీడ్‌ చేసిన నటుడిగా శోభన్‌బాబు నిలుస్తారు. ఆయన ఏదైనా ఓ పద్ధతి ప్రకారం నడుచుకున్నాడు. తన నియమాలతోనే జీవితం గానీ, సినిమా కెరీర్‌గానీ సాగింది. అలా సాగేలా చూసుకున్నారు శోభన్‌ బాబు. 

27
Asianet Image

ఆయన ఇతర హీరోల సినిమాల్లో నటుడిగా కీలక పాత్రలు పోషిస్తూ కెరీర్‌ని ప్రారంభించారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ, కృష్ణంరాజులతో సినిమాలు చేసి మెప్పించారు. కృష్ణతో అనే చిత్రాలు చేశారు. ఎన్టీఆర్‌ మూవీస్‌లోనూ నటించారు. ఆ తర్వాత సోలో హీరోగా ఎదిగారు. ఇతర హీరోలతో పౌరాణికాలు, సోలోగా సాంఘీకాలు చేసి మెప్పించాడు. 
 

37
Asianet Image

అయితే వ్యక్తిగతంగా శోభన్‌బాబుకి కొన్ని నియమాలు ఉంటాయనే విషయం తెలిసిందే. ఆయన మందుకి దూరంగా ఉన్నారు. సిగరేట్‌కి కూడా దూరమే. సినిమా సెలబ్రిటీలు పాల్గొనే పార్టీల్లోనూ ఆయన మందు తీసుకునే వారు కాదట. ఆయన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపారు. శాంపుల్‌ కూడా తీసుకునేవాడు కాదట. హీరోయిన్లు ఎగతాళి చేసినా ఇది నా లైఫ్‌ అని చెప్పి వచ్చేవాడట. 
 

47
Asianet Image

యోగా చేస్తూ బాడీని ఫిట్‌గా ఉంచుకునేవారు. ఎప్పుడు చురుకుగానూ ఉండేవారు. అయితే ఆయనకు ఉన్న ఆలవాట్లలో కాఫీ తాగే అలవాటు చిన్నపట్నుంచి ఉంది. మరణానికి ఓ పదేళ్ల ముందు వరకు ఆయన కాఫీ తాగడట. కానీ ఓ సంఘటనతో ఆయన 45ఏళ్ల అలవాటు ఉన్న కాఫీని మానేయాల్సి వచ్చిందట. ఆ అరుదైన విషయాన్ని బయటపెట్టాడు శోభన్‌బాబు. 
 

57
Sobhan Babu

Sobhan Babu

ఎర్లీ మార్నింగ్ కప్‌ కాఫీ తాగే అలవాటు ఉందన్నారు శోభన్‌బాబు. అయితే `ఏవండి ఆవిడ వచ్చింది` షూటింగ్‌ సమయంలో హోటల్‌లో కాఫీ అడిగాడట శోభన్‌బాబు కానీ కాఫీ రాలేదట. దీంతో షూటింగ్‌ టైమ్‌ అయిపోతుందని చెప్పి అలా కాఫీ తాగకుండానే వెళ్లిపోయాడట. మరో రోజు కూడా సేమ్‌ అలానే కాఫీ అడగ్గా వాళ్లు తేలేదట. మరి ఆ హోటల్‌లో పాలు లేవా? ఏంటో తెలియదు రెండు రోజులు ఇలానే జరిగింది. 
 

67
Asianet Image

దీంతో హర్ట్ అయిన శోభన్‌బాబు కాఫీని మొత్తమే మానేస్తా పోలా అనుకున్నాడట. ఆ హోటల్‌ వాళ్లు చేసిన పనికి సోగ్గాడు కాఫీ తాగడమే మానేయాలనుకున్నాడట. రెండు రోజులు తాగకుండా ఉన్నాను, మున్ముందు కూడా ఎందుకు ఉండలేను, తాగడమే మానేస్తా పోలా అనుకున్నాడట. అంతే దాన్ని నియమంగా పెట్టుకున్నాడట. అప్పట్నుంచి, ఆ ఇంటర్వ్యూ ఇచ్చేంత వరకు కాఫీని టచ్‌ చేయలేదని చెప్పాడు శోభన్‌ బాబు. 
 

77
Asianet Image

అయితే మధ్యలో ఓ తమాషా జరిగిందన్నారు. ఓ రోజు ఫ్లైట్‌లో వెళ్తున్నప్పుడు అందులో హోస్టెస్‌ ఇచ్చే కాఫీ స్మెల్‌ అద్భుతంగా ఉందట. అది మనసు లాగేసిందట. కానీ మూడేళ్లుగా తాగడం లేను కదా ఎందుకు అనిపించిందట. వాళ్లు ఫోర్స్ చేయడంతో ఓకే అన్నాను, ఆమె కాఫీ కలిపి తన వద్ద పెట్టిందట. అప్పుడు కాఫీని దగ్గర తీసుకుని గట్టిగా స్మెల్‌ తీసుకుని అక్కడ పెట్టేశాడట. అలా తనని తాను కంట్రోల్‌ చేసుకున్నానని, ఏ అలవాటైనా లిమిట్‌గా ఉంటే పర్వాలేదు, అది అదుపుతప్పితేనే అరోగ్యం దెబ్బతింటుందని చెప్పాడు శోభన్‌బాబు. ఈ రేర్‌ వీడియో క్లిప్‌ యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది. 

Aithagoni Raju
About the Author
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు. Read More...
 
Recommended Stories
Top Stories