- Home
- Entertainment
- Sobhan Babu: కృష్ణ కోసమే నాకు అన్యాయం చేశారు, వాళ్ళ అంతు చూస్తా అంటూ కట్టలు తెంచుకున్న శోభన్ బాబు కోపం
Sobhan Babu: కృష్ణ కోసమే నాకు అన్యాయం చేశారు, వాళ్ళ అంతు చూస్తా అంటూ కట్టలు తెంచుకున్న శోభన్ బాబు కోపం
శోభన్ బాబు తన సహనం కోల్పోయి వాళ్ళ అంతు చూస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఆ వార్నింగ్ ఎవరికి ? మహాసంగ్రామం మూవీ రిలీజ్ అయ్యాక జరిగిన వివాదం ఏంటి అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.

శోభన్ బాబు, కృష్ణ సినిమాలు
సూపర్ స్టార్ కృష్ణ, సోగ్గాడు శోభన్ బాబు పోటాపోటీగా సినిమా చేయడమే కాదు అనేక మల్టీస్టారర్ చిత్రాల్లో కలిసి నటించారు కూడా. వీరిద్దరి మధ్య పోటీ ఎంతగా ఉండేదో అనుబంధం కూడా అంతే ఉండేది. అయితే కృష్ణతో కలిసి నటించిన ఒక సినిమా విషయంలో శోభన్ బాబుకి కోపం కట్టలు తెంచుకుంది అట.
పరుచూరి గోపాలకృష్ణ కామెంట్స్
ఈ విషయాన్ని ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తెలిపారు. ఎంతలా శోభన్ బాబుకి కోపం వచ్చింది అంటే పరుచూరి బ్రదర్స్ అంతు చూస్తా, నరికేస్తా అని అనేంతలా. శోభన్ బాబుకి అంత కోపం రావడం వెనుక కారణం ఉంది. పరుచూరి గోపాల కృష్ణ మాట్లాడుతూ.. అప్పట్లో ఓ కథని ఎన్టీఆర్ గారికి చెప్పాం. ఆయన ఆ సమయంలో రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచనలో ఉన్నారు. దీనితో ఈ కథపై ఆయన అంతగా ఆసక్తి చూపలేదు.
వాళ్ళ కోసమే మల్టీస్టారర్ మూవీగా..
దీనితో ఈ కథని వేరే హీరోతో చేయాలని అనుకున్నాం. వస్తావనికి అది ఒక హీరో కథే. దీనిని ఖైదీ నిర్మాత తిరుపతి రెడ్డి విన్నారు. ఆయనకి నచ్చింది. కానీ ఈ కథని ఇద్దరు హీరోల కథగా, మల్టీస్టారర్ మూవీగా మార్చగలరా ? నేను కృష్ణ, శోభన్ బాబు లని ఒప్పిస్తాను అని అన్నారు. దీనితో ఆ కథలో మార్పులు చేసి కృష్ణ, శోభన్ బాబు కోసం రూపొందించాం.
వాళ్ళ అంతు చూస్తా అంటూ శోభన్ బాబు ఆగ్రహం
కోదండరామిరెడ్డి దర్శకత్వంలో షూటింగ్ పూర్తయింది. కానీ సినిమా రిలీజ్ అయ్యే సరికి శోభన్ బాబు పాత్ర చాలా వరకు తగ్గిపోయింది. కృష్ణ గారి పాత్ర మాత్రమే బాగా హైలైట్ అయింది. పరుచూరి బ్రదర్స్ స్క్రీన్ ప్లే వల్లే తన పాత్ర తగ్గిపోయింది అని శోభాన్ బాబు భావించారు. కృష్ణ పాత్రని పెంచడం కోసం తనకి అన్యాయం చేశారు అని శోభన్ బాబు మా గురించి తప్పుగా అర్థం చేసుకున్నారు. పరుచూరి బ్రదర్స్ కనిపిస్తే వాళ్ళ అంతు చూస్తా అని శోభన్ బాబు అన్నారు.
చివరికి నిజం తెలుసుకుని..
దీనితో రెండేళ్ల పాటు ఆయనకి మాకు మాటలు లేవు. కానీ ఆ సంఘటనలో అసలు నిజం వేరు. మేము శోభన్ బాబు గారి పాత్రని తగ్గించలేదు అని పరుచూరి గోపాల కృష్ణ అన్నారు. ఈ చిత్రంలో శోభన్ బాబు మిలటరీ అధికారిగా నటించారు. శోభన్ బాబు సైనికుడు అయినప్పటికీ ఆయన కైకాల సత్యనారాయణతో కామెడీ చేసే సీన్లు ఉంటాయి. సెన్సార్ లో రిటైర్డ్ మిలటరీ అధికారి ఉన్నారు. ఇలా మిలటరీ వాళ్ళు కామెడీ చేస్తున్న సన్నివేశాలని ఆయన అంగీకరించలేదు. దీనితో చాలా వరకు శోభన్ బాబు గారి సీన్లు తప్పనిసరి పరిస్థితుల్లో తొలగించాల్సి వచ్చింది. ఆ విషయం తెలియక శోభన్ బాబు మమ్మల్ని అపార్థం చేసుకున్నారు. చివరికి రెండేళ్ల తర్వాత తిరుపతి రెడ్డి ద్వారా శోభన్ బాబుకి అసలు నిజం తెలిసింది. అప్పుడు శోభన్ బాబు గారు మమ్మల్ని పిలిపించి జరిగినదాంట్లో మీ తప్పు లేదు. నేనే అపార్థం చేసుకున్నాను. ఇకపై మనం కలసి పనిచేద్దాం అని అన్నారు.

