- Home
- Entertainment
- కొంచెం తగ్గు ప్రకాష్ రాజ్, లెజెండ్రీ హీరో దిమ్మతిరిగే వార్నింగ్.. 2 ఏళ్ళ తర్వాత కనిపించమని అడిగితే..
కొంచెం తగ్గు ప్రకాష్ రాజ్, లెజెండ్రీ హీరో దిమ్మతిరిగే వార్నింగ్.. 2 ఏళ్ళ తర్వాత కనిపించమని అడిగితే..
సౌత్ లో విలక్షణ నటుల్లో ప్రకాష్ రాజ్ ఒకరు. ఎలాంటి పాత్రలో నటించినా తన నటన, మ్యానరిజమ్స్ తో ప్రకాష్ రాజ్ ఆడియన్స్ ని కట్టిపడేస్తారు. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రకాష్ రాజ్ సౌత్ లో కొన్ని వందల చిత్రాల్లో నటించారు.

Prakash Raj
Prakash Raj: సౌత్ లో విలక్షణ నటుల్లో ప్రకాష్ రాజ్ ఒకరు. ఎలాంటి పాత్రలో నటించినా తన నటన, మ్యానరిజమ్స్ తో ప్రకాష్ రాజ్ ఆడియన్స్ ని కట్టిపడేస్తారు. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రకాష్ రాజ్ సౌత్ లో కొన్ని వందల చిత్రాల్లో నటించారు. అయితే ప్రకాష్ రాజ్ తరచుగా వివాదాల్లో చిక్కుకుంటుంటారు.
Prakash Raj
ప్రకాష్ రాజ్ కి, లెజెండ్రీ నటుడు శోభన్ బాబుకి మధ్య ఒక ఆసక్తికర సంఘటన జరిగిందట. ప్రకాష్ రాజ్ అప్పుడే కెరీర్ ప్రారంభిస్తున్నారు. కొన్ని చిత్రాల్లో మాత్రమే నటించారు. శోభన్ బాబు నటించిన దొరబాబు చిత్రంలో ప్రకాష్ రాజ్ కి 1995లో అవకాశం వచ్చింది. ఆ చిత్ర ఫైట్ సీన్ లో ప్రకాష్ రాజ్ ఆవేశంగా శోభన్ బాబు మీదికి వచ్చారట. ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ అప్పుడు ఉడుకు రక్తం వల్లనో ఏమో తెలియదు.. ఫైట్ సీన్ లో శోభన్ బాబు గారి మీదికి ఆవేశం గా దూకుతున్నా.
Prakash
దీనితో శోభన్ బాబు గారు కొంచెం తగ్గు ప్రకాష్.. ఎందుకు ఆవేశపడుతున్నావ్, ఇది జస్ట్ యాక్టింగ్ మాత్రమే అని స్వీట్ గా వార్నింగ్ ఇచ్చారు. ఆ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకున్న సమయంలో శోభన్ బాబు గారు చెప్పిన మాట జీవితంలో మరచిపోలేను. ఆరోజు తేదీ మే 31, శోభన్ బాబు గారు నాతో మాట్లాడుతూ ప్రకాష్ ఈ రోజు తేదీ గుర్తుపెట్టుకుని నువ్వు రెండు సంవత్సారాల తర్వాత నన్ను కలుస్తావా అని అడిగారు. అదేంటి గురువుగారు ఎందుకు కలవను అని అడిగా.
మీరు ఎక్కడ ఉన్నా వస్తా అని చెప్పా. కానీ శోభన్ బాబు గారు నవ్వుతూ.. మీరు నన్ను వచ్చి కలవరు, ఎందుకంటే అంత బిజీ అయిపోతారు 2 ఏళ్ళ తర్వాత అని చెప్పారట. ఆయన నోటి నుంచి ఆ మాట వచ్చినప్పుడు నాకు అర్థం కాలేదు. కానీ రెండేళ్ల తర్వాత ఆయన చెప్పినట్లుగానే కలవలేకపోయా. సౌత్ లో విపరీతంగా బిజీగా అయిపోయా, నటుడిగా మంచి పేరు వచ్చింది. కొన్నేళ్ల తర్వాత ఒక చోట అనుకోకుండా ఆయన్ని కలిశా.
గురువుగారు ఆ రోజు మీరు ఇలా అన్నారు. మీరు అన్నట్లే నేను మిమ్మల్ని కలవలేకపోయా. ఆర్టిస్ట్ గా బాగా బిజీ అయ్యా అని చెప్పా. నాకు ఆరోజే తెలుసు ప్రకాష్ నువ్వు ఈ స్థాయికి చేరుకుంటావని అని శోభన్ బాబు చెప్పారట.